ఐపీఎల్ 2026 సీజన్‌కు నేడు గ్రాండ్ ఫినాలేతో తెరపడనుంది. ఒకవైపు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. మరోవైపు వ్యూహాత్మక ఆటతో ఆకట్టుకున్న గుజరాత్ టైటాన్స్.. టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. అహ్మదాబాద్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక నరేంద్ర మోదీ స్టేడియం ఈ మహా సమరానికి ఆతిథ్యం ఇస్తోంది. రెండు నెలలుగా అభిమానులను అలరించిన ఐపీఎల్ సీజన్‌కు ముగింపు పలికే ఈ ఫైనల్ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. రెండోసారి ట్రోఫీని ముద్దాడాలన్న లక్ష్యంతో బరిలోకి దిగుతున్న ఇరు జట్లు విజయం కోసం సర్వశక్తులు ఒడ్డనున్నాయి. వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండటంతో అభిమానులు పూర్తి స్థాయి క్రికెట్ వినోదాన్ని ఆస్వాదించే అవకాశముంది.
Tag:





Total views : 90287