దక్షిణ అమెరికా దేశం చిలీలో భారీ భూకంపం సంభవించింది. ఉత్తర చిలీలోని కలామా నగరానికి తూర్పు ప్రాంతంలో భూమి బలంగా కంపించింది.రిక్టర్ స్కేల్‌పై ఈ భూకంప తీవ్రత 6.9గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. భూగర్భంలో సుమారు 89 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. కలామాతో పాటు సమీప ప్రాంతాల్లో కూడా బలమైన భూప్రకంపనలు సంభవించాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.మరోసారి భూప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిక జారీ చేశారు.
Tag:






Total views : 194362