ఏపీలో గ్రామ వాలంటీర్లు నేటి నుంచి సమ్మె చేయనున్నారు. గౌరవ వేతనం పెంపు, సర్వీసుల క్రమబద్ధీకరణ లేకపోవడంతో అసంతృప్తితో ఉన్న గ్రామ వాలంటీర్లు సమ్మె చేసేందుకు రెడీ అయ్యారు. అంతేకాకుండా, ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘’ కార్యక్రమానికి కూడా దూరంగా ఉండాలని నిర్ణయించారు. వాలంటీర్లతో సమ్మె ఆలోచన విరమింపజేసేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. ఈరోజు నుంచి సమ్మె సైరన్ మోగించేందుకు వాలంటీర్లు డిసైడయ్యారు. 2019 అక్టోబర్లో జగన్ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. ఒక్కో వాలంటీరుకు 5 వేల రూపాయలు గౌరవవేతన ఇస్తున్నారు. పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇటీవల రాష్ట్రంలోని గ్రామ, వార్డ్ వాలంటీర్లకు 750 రూపాయల జీతం పెంపు ప్రకటించారు. ప్రస్తుతం వాలంటీర్ల వ్యవస్థ ప్రభుత్వ పథకాల అమలులో క్రియాశీలకంగా ఉంది. అయితే, గౌరవ వేతనానికి సంబంధించి కొంత కాలంగా వాలంటీర్లలో అసంతృప్తి గూడు కట్టుకుంది. పొరుగు సేవల సిబ్బంది, కాంట్రాక్ట్ కార్మికుల జీతాలంత కూడా తమకు రావట్లేదని వలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జగన్ ప్రభుత్వం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడితో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సమావేశం ముగిసింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం 3 గంటల పాటు సాగింది. జగన్ ప్రభుత్వంపై లోతైన విశ్లేషణతో ప్రశాంత్ కిశోర్ ఓ నివేదికను చంద్రబాబుకు అందించారు. రాష్ట్ర యువతలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి ఉందని ఆ నివేదికలో పేర్కొన్నారు. ధరల పెంపు, కరెంటు చార్జీల పెంపు, పన్నులు, నిరుద్యోగం తదితర అంశాలు వచ్చే ఎన్నికల్లో వైసీపీ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆ నివేదికలో పొందుపరిచారు. దళితులు, బీసీలపై దాడులు వైసీపీకి ప్రతికూలంగా మారాయని… బీసీలు, దళితులను వైసీపీకి దూరం చేశాయని కూడా ప్రస్తావించారు. ఎవరో ఒకరిద్దరు మంత్రులను మినహాయిస్తే, మిగతా మంత్రులకు సున్నా మార్కులు పడతాయని నివేదికలో అభిప్రాయపడ్డారు. ప్రభుత్వానిది అహంకార ధోరణి అనే భావన ప్రజల్లో నెలకొందని కూడా వివరించారు. పరిస్థితులను అనుకూలంగా మార్చుకునేందుకు విపక్షం తగిన వ్యూహ రచన చేసుకోవాలని, యువతను ఆకర్షించేలా టీడీపీ కార్యాచరణ ఉండాలని నివేదికలో సూచించారు. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సిఫారసు చేశారు. చంద్రబాబు అరెస్ట్ కారణంగా… తటస్థంగా ఉండేవారిలోనూ, వైసీపీ వర్గాలోనూ జగన్ పై వ్యతిరేకత వచ్చిందని ప్రశాంత్ కిశోర్ నివేదికలో స్పష్టం చేశారు. కాగా, ప్రశాంత్ కిశోర్ తన నివేదికలో ఆయా వర్గాలు, అంశాల వారీగా ప్రభుత్వ బలాబలాలను కూడా విశ్లేషించారు.






Total views : 78223