ఎన్నికల నోటిఫికేషన్ (Election Notification) :
నాలుగోదశ ఎన్నికల నోటిఫికేషన్ (Election Notification)ను ఎన్నికల సంఘం విడుదల చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయ్యింది. పదకొండు గంటల నుంచి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. పార్లమెంట్ స్థానాలకు కలెక్టరేట్లల్లో, అసెంబ్లీ స్థానాలకు నియోజకవర్గ ప్రధాన కేంద్రాల్లో నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు స్వీకరించారు. నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు మరో నలుగురికి మాత్రమే ఆర్వో కార్యాలయం లోపలికి అనుమతి ఇచ్చారు. నామినేషన్ వేసే అభ్యర్థుల ఊరేగింపుతో పాటు దాఖలు చేసే ప్రాంతంలో పూర్తిగా వీడియో రికార్డింగ్ చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో హెల్ప్ డెస్కుల ఏర్పాటు చేశారు. నాలుగో దశలో ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే 10 రాష్ట్రాల్లోనూ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 25 పార్లమెంటు నియోజకవర్గాలకు మే 13వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అదే తేదీన తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. ఇదిలా ఉండగా ఈ నెల 25న సీఎం జగన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్..తమిళనాట చారిత్రాత్మక విజయంతో రికార్డ్ సృష్టించిన సీఎం విజయ్..తనదైన పనితీరుతో ఆకట్టుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే తన క్రమశిక్షణ, సమయపాలన అధికారుల్లో చర్చనీయాంశంగా మారాయి. ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగిలా సచివాలయంలో విధులకు హాజరవుతుండటంపై హర్షం వ్యక్తం…
- రాబర్ట్ వాద్రాకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఊరట..ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు భారీ ఊరట లభించింది. హర్యానాలోని గురుగ్రామ్ భూ కుంభకోణం, మనీలాండరింగ్ కేసులో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఆయనకు ఉపశమనం కలిగింది. ఇవాళ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరైన ఆయనకు ప్రత్యేక…
- మహారాష్ట్రలోని పుణెలో నకిలీ బాంబు కలకలం..మహారాష్ట్రలోని పుణెలో ఓ యువకుడు చేసిన నకిలీ బాంబు కలకలం వెయ్యిమంది పోలీసులను పరుగులు పెట్టించింది. సోలాపూర్‌కు చెందిన శివాజీ రాథోడ్ అనే యువకుడు తన వైద్యానికి 7 లక్షల రూపాయలు సమీకరించాలనే ఉద్దేశంతో ఈ డ్రామాకు తెరలేపాడు. హడప్సర్లోని కామధేను…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: నాలుగోదశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల…





Total views : 78793