మిర్చి కాంపౌండ్ కు వెళ్లే దారిలో మంచినీటి పైప్ లైన్ లీకేజీ పై శాశ్వత పరిష్కారం చేపట్టాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అధికారులను ఆదేశించారు. వరంగల్ నగరంలోని మార్వాడి గల్లీ, మిర్చి కాంపౌండ్ వద్ద లీకైన పైప్ లైన్ ను మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, పబ్లిక్ హెల్త్ డీఈ శ్రీకాంత్ తో కలిసి పరిశీలించారు. పైప్ లైన్ లీకేజీ కారణంగా మురికి నీరు నల్లాల్లోకి వస్తున్నాయనీ..తద్వారా మంచినీరు కలుషితమవుతుందన్నారు. మూడు రోజులుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న అధికారులు స్పందించకపోవడం తగదన్నారు. మిర్చి కాంపౌండ్ లో చేతిపంపులను మరమ్మతులు చేయించి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
Tag:






Total views : 82547