మెదక్ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తూప్రాన్ పరిధిలోని 44వ జాతీయ రహదారిపై వెళ్తున్న ఒక భారీ కంటైనర్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఒక ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీకి చెందిన కొత్త కార్లను హైదరాబాద్ నుంచి షోరూమ్‌కు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తూప్రాన్ సమీపానికి రాగానే కంటైనర్ వెనుక భాగం నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు, మంటలు వ్యాపించాయి. డ్రైవర్ గమనించి వాహనాన్ని ఆపేలోపే మంటలు కంటైనర్ మొత్తం విస్తరించాయి. ఈ ప్రమాదంలో కంటైనర్‌లో ఉన్న ఎనిమిది కొత్త కార్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. హైవేపై మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసారు.
Tag:




Total views : 81759