మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో ముసలం మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ కేటాయించారు. మునుగోడు టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చలమల్ల కృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తికి గురైనారు. ఈరోజు చౌటుప్పల్ తన క్యాంపు కార్యాలయంలో మరోసారి కార్యకర్తల సమావేశం నిర్వహించి, వారి సలహాలు స్వీకరించి, మునుగోడు నుండి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలవడానికి మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.
రాజగోపాల్ రెడ్డి
తెలంగాణ ఎన్నికల సమరాంగణంలో అధికార బీఆర్ఎస్ తో అమీతుమీ తేల్చుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ రెండో జాబితా విడుదల చేసింది. ఈ నెల 23న 55 మందితో తొలి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్. నేడు 45 మందితో రెండో జాబితా ప్రకటించింది. ఇవాళ కాంగ్రెస్ గూటికి తిరిగొచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు నియోజకవర్గం టికెట్ ఇచ్చారు. క్రికెట్ దిగ్గజం మహ్మద్ అజారుద్దీన్ కు జూబ్లీహిల్స్ టికెట్ లభించింది. పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, మధుయాష్కీ గౌడ్ తదితరులు కూడా రెండో జాబితాలో టికెట్లు పొందారు.
డీకే అరుణ బీజేపీకి గుడ్ బై చెపుతున్నారంటూ వస్తున్న వార్తలపై డీకే అరుణ స్పందించారు. తాను బీజేపీని వీడే ప్రసక్తే లేదని, కాంగ్రెస్ లో చేరే అవకాశమే లేదని చెప్పారు. తనపై కొందరు పనికట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ అధినాయకత్వం తనను గుర్తించి జాతీయ ఉపాధ్యక్ష పదవిని ఇచ్చిందని అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో పని చేయాలంటే అదృష్టం ఉండాలని చెప్పారు. మరోవైపు, బీజేపీ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు ఆయన స్పష్టం చేశారు. నియంత కేసీఆర్ పాలనను అంతమొందించేందుకే తాను కాంగ్రెస్ లో చేరుతున్నానని ఆయన తెలిపారు.






Total views : 78093