ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆధ్వర్యంలో అసెంబ్లీ వన్యప్రాణి – పర్యావరణ పరిరక్షణ కమిటీ ఏర్పడింది. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర జూలాజికల్ పార్క్ ను కమిటీ సందర్శించింది. ఆధునికీకరణ, అభివృద్ధిపై కీలక సమీక్ష నిర్వహించింది. స్పీకర్ అయ్యన్నపాత్రుడితో పాటు ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, పులివర్తి నాని, నరేంద్ర వర్మ మరికొందరు సభ్యులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. జూపార్కులో స్పీకర్ మొక్కను నాటారు. ఆసియాలోనే దాదాపు 3 వేల ఎకరాల అతిపెద్ద విస్తీర్ణం కలిగిన జూపార్కులలో ఇది ఒకటి. అయితే, సరైన కనీస వసతులు, నీటి సమస్య , సౌకర్యాలు లేకపోవడం వల్లే సందర్శకుల సంఖ్య ఆశించిన స్థాయిలో పెరగడం లేదని స్పీకర్ విస్మయం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రతిరోజూ దాదాపు 90 వేల మంది వస్తుంటే, జూపార్కుకు మాత్రం కేవలం 3 వేల మంది మాత్రమే వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తగు చర్యలను తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Tag:




Total views : 212525