అంగన్వాడీలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం కావడంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఎమ్మెల్యేల ఇళ్ళను అంగన్వాడీలు ముట్టడించి ఆందోళన చేపట్టారు. ఏలూరులోని ఎమ్మెల్యే ఆళ్ల నాని ఇంటిని అంగన్వాడి మహిళలు ముట్టడించారు. ఎమ్మెల్యే ఆళ్ల నాని ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించి భారీ గేట్లను ఏర్పాటు చేసి అంగన్వాడీ మహిళలను అడ్డుకున్నారు. గత 16 రోజులుగా అంగన్వాడీలు తమ న్యాయమైన సమస్యలపై సమ్మె చేపట్టిన కనీసం ప్రభుత్వం స్పందించలేదని. రెండుసార్లు చర్చిలకు పిలిచి తమ సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం విస్మరించిందని వారు మండిపడ్డారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు అంగన్వాడీ మహిళలకు అనేక హామీలు ఇచ్చారని నాలుగున్నర సంవత్సరాలు గడుస్తున్నా కనీసం ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని లేకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
Anganwadi
తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ 15వ రోజు అంగన్వాడీలు శ్రీకాకుళం నగరంలో వినూత్నంగా నిరసన చేపట్టారు. 7 రోడ్ల కూడలి వద్ద ప్లేట్లు, గరిటలు పట్టుకొని మోత మోగిస్తూ తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీల జిల్లా అధ్యక్షురాలు కళ్యాణి మాట్లాడుతూ నిద్రాహారాలు మాని అనేక విధాలుగా ప్రభుత్వం కళ్ళు తెరిపించే విధంగా కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైకరిని విడనాడి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చర్చల పేరుతో కాలయాపన చేయకుండా కనీస వేతనం 26000 ఇవ్వాలని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారం గ్రాచ్యూటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
Read Also..
తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఏపి రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు ఆందోళనలు చేస్తున్నారు. ఏలూరు జిల్లా కైకలూరులో అంగన్వాడీల నిరసనలు 15 వ రోజూ కొనసాగుతున్నాయి. ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా కైకలూరు మండల పరిషత్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు ప్లేట్లపై గరిటెలతో శబ్దాలు చేస్తూ ఆందోళనలు చేశారు. మాట ఇచ్చాడు జగనన్న …మడమ తిప్పాడు జగనన్న, ఇదేమీ రాజ్యం, ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం అంటూ అంగన్ వాడీలు నినాదాలు చేశారు.
అంగన్వాడీ టీచర్ల, ఆయాల సమస్యలు పరిష్కరించాలని గత 13 రోజులుగా గుత్తి ఐసిడిఎస్ కార్యాలయం ఎదురుగా చేస్తున్న నిరసన సమ్మె సోమవారం 14వ రోజుకు చేరింది. సోమవారం క్రిస్మస్ పండుగ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు యేసుప్రభు చిత్రపటానికి వినతి పత్రం అందజేశారు. ఏపీ సీఎం జగన్ మనసు మార్చి మా జీతాలు పెంచేలా చూడాలని యేసుప్రభుకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు, అంగన్వాడి టీచర్లు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీసం రూ.26,000 గౌరవ వేతనం ఇవ్వాలని, ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. గత 13 రోజులుగా అంగన్వాడి టీచర్లు నిరసన సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవడం లేదని వారు ఈ సందర్భంగా జగన్ సర్కార్ పై మండిపడ్డారు. తక్షణమే అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో రాబోవు కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.
అంగన్ వాడీలను ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటే చూస్తు ఊరుకోబోమని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హెచ్చరించారు. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారిని, బ్రాందీ షాపు వద్ద కాపలా పెట్టిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. ఏలూరు కలెక్టరేట్ వద్ద అంగన్వాడి మహిళలు చేపట్టిన నిరవధిక సమ్మె 15వ రోజు కొనసాగుతోంది. ఈ సమ్మెలో చింతమనేని పాల్గొని సంఘీభావం ప్రకటించారు. జగన్ కు దమ్ముంటే రాష్ట్రంలో పాదయాత్ర చేయాలని సవాల్ విసిరారు. పోలీసులు, గన్ మెన్లు లేకుండా కనీసం బయటకు రాలేని పరిస్థితిలో జగన్ ఉన్నాడన్నారు. ముఖ్యమంత్రి పాపం పండిందని, ప్రజలు ఎదురు తిరిగేందుకు సిద్ధంగా ఉన్నారని చింతమనేని తెలిపారు.
తమ న్యాయపరమైన డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడి వర్కర్స్ & హేల్పర్స్ యునియన్ అద్వర్యంలో తలపెట్టిన అంగన్ వాడి నిరవధిక సమ్మె 14 వ రోజుకు చేరుకున్నప్పటికీ ప్రభుత్వం స్పందించక పోవడం చాల బాధకరం అన్నారు. అంగన్ వాడి నాయకురాలు మసృన్ బీ, చిన్నమండెం మండలం కార్యదర్శి ఉమా రాణి. 14 వ రోజు నిరవధిక సమ్మె నిరసన కార్యక్రమాన్ని అన్నమయ్య జిల్లా రాయచోటి ఆర్డివో కార్యాలయం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఆదేశాలు మేరకు సమాన పనికి సమాన వేతనం 26 వేల వేతనాన్ని అందజేయలన్నారు. అదే విధంగా తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె బాట పట్టిన మహిళల పట్ల వైసిపి నాయకులు అనేక అసత్య ఆరోపణలు చేయడం తగదన్నారు. తమ సమస్యలు పరిష్కరించాల్సింది పోయి అంగన్ వాడి తాళాలు పగల గొట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఈ ప్రభుత్వం సిగ్గు పడాల్సింది పోయి తమను తాము సమర్దించు కోవడం చాల సిగ్గు చేటన్నారు. నెల నెలకు అందని వేతనాలతో, చాలీ చాలని వేతనాలతో, అంగన్ వాడి కేంద్రాల అద్దెలు చెల్లించుకోలేక, కూరగాయలు, గ్యాస్, టి ఎ డి ఎ బిల్లులు రాకపోవడంతో అంగన్ వాడిలు ఆర్దికంగా అనేక దుర్బర దుస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని, లేని యెడల రానున్న రోజుల్లో అంగన్ వాడి మహిళల శక్తి ఏంటో ప్రభుత్వానికి తెలియజేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాయచోటి ఐ సి డి ఎస్ ప్రాజెక్ట్ పరిదిలోనున్న అంగన్ వాడి వర్కర్లు హేల్పర్లు పాల్గొన్నారు.
Read Also..
కాకినాడ జిల్లాలో అంగన్వాడీల సమ్మె 14వ రోజు కొనసాతుంది. గత 14 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం సమస్యలను పరిష్కరించడం లేదని అంగన్వాడీలు వాపోయారు. పండగ మీక, పస్తులు మాకా అంటూ నినాదాలు చేశారు. క్రిస్మస్ పండగ రోజైన సీఎం జగన్ అంగన్వాడీలకు శుభవార్త చెప్తారని ఎదురు చూస్తున్నామని అంగన్వాడీలు ఆశగా ఎదురుచూస్తున్నారు.
బాపట్ల జిల్లాలో ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో 13వ రోజు అంగన్వాడీలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. లక్షపై చిలుకు ఉన్న అంగన్వాడీల పట్ల ఎందుకు అంత నిర్లక్ష్యం. ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ 13 రోజుల నుండి మేము సమ్మెలు దీక్షలు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చీమకుట్టినట్లు అయినా లేదని, అంగన్వాడీల పట్ల ముఖ్యమంత్రి మొండి వైఖరి, మాకెంతో బాధ కలిగిస్తుందని వారు అన్నారు. ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అంగన్వాడీ పట్ల దయచూపి అంగన్వాడి ల డిమాండ్లను పరిష్కరిస్తారని ఆశిస్తున్నామని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె ఉధృతం చేస్తారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంగనవాడిలపై ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తుందని వారన్నారు, ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అంగన్వాడి డిమాండ్లను పరిష్కరించాలని వారు అన్నారు.
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడి టీచర్ల ఆధ్వర్యంలో చేస్తున్న నిరసన సమ్మె శుక్రవారం 11 రోజుకు చేరింది. ఇందులో భాగంగా గుత్తి ఐసిడిఎస్ కార్యాలయం నుండి స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ వరకు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సిఐటియు నాయకులతో కలిసి అంగన్వాడి టీచర్లు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం ఎన్టీఆర్ సర్కిల్లో సిఐటియు నాయకులతో కలిసి అంగన్వాడి టీచర్లు రోడ్డుపై బైఠాయించి ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. సిఐటియు జిల్లా నాయకులు నాగరాజు, నిర్మలమ్మ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలలో ఇచ్చిన హామీల్లో అంగన్వాడి టీచర్లకు తెలంగాణ రాష్ట్రంలో కన్నా అదనంగా వెయ్యి రూపాయలు జీతాలు పెంచుతానని మాట ఇచ్చి మాట తప్పారని జగన్ సర్కార్ పై అంగన్వాడీ టీచర్లు మండిపడ్డారు. తక్షణమే అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వచ్చే ఎన్నికలలో ఓటుతో బుద్ధి చెప్తామని జగన్ సర్కార్ కు హెచ్చరించారు. రోడ్డుపై భిటాయించి ఆందోళన చేయడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. సమాచారం తీసుకున్న పోలీసులు వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా తగు చర్యలు తీసుకున్నారు.
Read Also..
లక్ష పైచిలుకు ఉన్న అంగన్వాడీల పట్ల ఎందుకంత నిర్లక్ష్యం.. అంగన్వాడీలను విమర్శ చేసే ప్రతి ఒక్కరి ఇంట్లో మహిళలలు ఉన్నారనే విషయం గుర్తు పెట్టుకోండి.. జగన్మోహన్రెడ్డి కోసం నాడు గెలిపించిన వారిలో మేము కూడా ఉన్నాము.. ఇప్పుడు సమస్యల పరిష్కారం కోసం నిరసన కార్యక్రమం చేస్తుంటే పార్టీల రంగు పులమటం ఎంత వరకో మీ విజ్ఞతికే వదిలేస్తున్నాం.. గౌరవ వేతనం కోసం మా పోరాటం కాదు.. కనీస వేతనంమే మా డిమాండ్.. మాటలు చెప్పే ఆలోచనలు వద్దు, ఆచరణలో చూపండి. నాడు మీరు చెప్పిన మాటలకు కట్టుబడమనేదే మా విజ్ఞప్తి.. మాటలు జారే ముందు మీ నాయకుడు చేసిన వాగ్దానంపై ప్రశ్నించండి.. బాపట్లలో 11వ రోజు దీక్ష ఐసిడిఎస్ ప్రాజెక్టు నుండి ర్యాలీగా బయలుదేరి, బాపట్ల పాత బస్టాండ్ లో మానవహారం గా ఏర్పడి రోడ్డుపై నిరసన తెలిపిన అంగన్వాడీలు.. బెదిరించాల్సిన అవసరం మాకు లేదు. న్యాయమైన సమస్యలపై మాత్రమే మేము ప్రశ్నిస్తున్నాము.. ఈ సందర్భంగా అంగన్వాడీలకు పోలీసులకు తోపులాట జరిగింది. కాసేపు బాపట్ల పాత బస్టాండ్ సెంటర్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అనంతరం అంగన్వాడీలు ధర్నా విరమించి ఐసిడిఎస్ ప్రాజెక్టు బయలుదేరి వెళ్లారు.






Total views : 147584