గత తొమ్మిది రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలని నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీలను ప్రభుత్వం పట్టించుకోకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, సమ్మె పైన దుష్ప్రచారం చేయడాన్ని నిరసిస్తూ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పై ఏపీ అంగన్వాడి వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో ఉలవపాడు ఐసిడిఎస్ ఆఫీస్ వద్ద లింగసముద్రం, ఉలవపాడు, గుడ్లూరు మండలాలకు చెందిన అంగనవాడి వర్కర్లు, హెల్పర్లు సుమారు 250 మంది ఈరోజు నిరసన తెలుపుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని నిరసించారు. అంగన్వాడీలు నిరవధిక సమ్మె తొమ్మిది రోజుల నుండి చేస్తున్న పట్టించుకోకపోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. అంగన్వాడీ కార్యకర్తలను ఉద్దేశించి సిఐటియు జిల్లా నాయకులు జీవిబి కుమార్, వాకా. లతా రెడ్డి, ప్రభావతి తదితరులు మాట్లాడారు. సమ్మెపై ప్రభుత్వం దుష్ప్రచారం చేయటాన్ని ఖండించారు. ప్రభుత్వం అనాగరికంగా అంగన్వాడి సెంటర్ల తాళాలు పగల గొట్టటం సిగ్గుచేటు అన్నారు. మహిళలకు అన్యాయం చేసిన ఏ ప్రభుత్వానికైనా తగిన శాస్తి జరుగుతుందన్నారు. ఇప్పటికైనా పట్టుదలకు పోకుండా, ప్రభుత్వం దిగివచ్చి అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయాలని కోరారు. అనంతరం ఉలవపాడు మండల కేంద్రంలో అంగన్వాడి సమ్మెకు మద్దతు ఇవ్వమని అంగన్వాడీల భిక్షాటన,ధర్నా. అనంతరం ఉలవపాడు మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ బొమ్మ సెంటర్ లో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఉలవపాడు మండల అధ్యక్షురాలు వాకాలాతారెడ్డి. ఉలవపాడు ప్రాజెక్టు లీడర్ సిహెచ్ ఇందిరావతి, అన్ని మండలాల నాయకులు ఎస్ కే పద్మజ, బీ మార్తమ్మ,కత్తి. బుజ్జమ్మ,మంచాలి సిహెచ్ పద్మజ, ఎం పద్మ, సిహెచ్ రమాదేవి, కాకర్లపూడి శైలజ, డి వరలక్ష్మి, డి రమాదేవి, సురేఖ, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
Anganwadi
ప్రకాశం జిల్లా దర్శి లో జనసేన పార్టీ నాయకులు గరికపాటి వెంకట్ అంగనవాడి కార్యకర్తల దీక్ష లో పాల్గొని సంఘీభావం తెలిపారు. వారి యొక్క డిమాండ్లను వెంటనే అంగీరించి కనీస వేతనం ఇవ్వాలని తెలిపారు. తదుపరి క్రిస్ మస్ సందర్భంగా pgn కాంప్లెక్స్ లో దర్శి నియోజకవర్గం క్రైస్తవ సోదరీ సోదరులకు సుమారు 1200 మందికి దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గరికపాటి వెంకట్ మాట్లాడుతూ దర్శి అద్దంకి రోడ్డులోనీ జనసేన పార్టీ కార్యాలయం దగ్గర ఈనెల 24 వ తారీఖున దర్శిలో జనసేన ఆద్వర్యం లో సెమీ క్రిస్ మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం. ఈ కార్యక్రమానికి దర్శి నియోజకవర్గ పాస్టర్లు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు.
సీఎం జగన్ కు ఓటేసి గెలిపిస్తే తమను బిక్షం ఎత్తుకునే పరిస్థితి తీసుకొచ్చారని అంగన్వాడిలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడి మహిళలు చేపట్టిన సమ్మె ఎనిమిదవ రోజుకు చేరుకుంది. ఈరోజు అంగన్వాడి మహిళలు భిక్షాటన చేస్తూ వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. రాష్ట్రంలో సుమారు లక్షా ఎనిమిది వేలు అంగన్వాడి కుటుంబాలు ఉన్నాయని, వచ్చే ఎన్నికల్లో జగన్కు ఓటుతోనే బుద్ధి చెబుతామంటూ వారు హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలని లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
అన్నమయ్య జిల్లా.. రైల్వే కోడూరు మండలంలోని ఐసిడిస్ కార్యాలయం వద్ద అంగన్వాడి వర్కర్లు చేస్తున్న సమ్మె ఆరవ రోజుకు చేరింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డికి అంగన్వాడి రాష్ట్ర నాయకులు అర్జీ ఇస్తుంటే ఇదేమైనా పెళ్లి పత్రిక అని ఎగతాళిగా మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు. మంత్రి గా ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం చాలా దారుణం అన్నారు. ఆర్ధిక మంత్రి క్షమాపణ చెప్పేంతవరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు. ప్రభుత్వం సమస్యలు పరిస్కారం చేసే వరకూ ఆందోళన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం లో వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు జయరామయ్య, సిఐటియు అధ్యక్షులు యానాదియ్య, జిల్లా అధ్యక్షురాలు ఎస్ శ్రీలక్ష్మి, ప్రాజెక్ట్ అధ్యక్షరాలు రమాదేవి, ప్రాజెక్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ టి రాధా కుమారి, కోశాధికారి జి పద్మావతి, గౌరవ అధ్యక్షురాలు డి వనజ కుమారి పాల్గొన్నారు.
Read Also..
అంగన్వాడీల సమ్మె ఆందోళన 5వరోజుకు చేరింది. ఈరోజు ఉలవపాడు ఐసీడీఎస్ ఆఫీస్ వద్ద అంగన్వాడిలు కళ్ళకు గంతల కట్టుకొని నల్ల చీరలు ధరించి రాష్ట్ర ప్రభుత్వ చర్యలను నిరసించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి జి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పంతాలకు, పట్టింపులకు పోకుండా అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం చేయకుండా బెదిరింపులతో ఉద్యమాన్ని అణచాలనుకోవడం ఆయన నియంత్రత్వ పాలనకు నిదర్శనం అని అన్నారు. సచివాలయ వాలంటీర్లు సిబ్బంది చేత బలవంతంగా తాళాలు పగలగొట్టి సెంటర్లు తెరిపించడం అంటే తన ఆస్తులను తనే ధ్వంసం చేసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తాళాల మీద కొట్టే ప్రతి దెబ్బ రాబోయే కాలంలో సమ్మెట్టు పోటుల్లాగా ఆయన మీదనే ఆ దెబ్బలు తగులుతాయి అనేది గుర్తించుకోవాలని అన్నారు. వెంటనే అంగన్వాడీలను చర్చలకు పిలిచి సమస్య పరిష్కారం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఉలవపాడు మండల అధ్యక్షురాలు వాకా.లతా రెడ్డి ప్రాజెక్టు సెక్టార్ లీడర్లు ఎస్.కె పద్మజ, బీ.మార్తమ్మ ,సిహెచ్ పద్మజ ,పర్రె తిరుపతమ్మ, కృష్ణకుమారి ,ప్రసన్న, కామాక్షి, పద్మ ,డి రమాదేవి, పొంతగాని రమణ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీలు ఆట పాటలతో ధర్నా శిబిరంలో డాన్సులతో ఆకట్టుకున్నారు. కోలాటం ప్రదర్శించారు ఎర్రజెండా ఎర్రజెండా ఎన్నియాలో ….అది పేదలపాటి జెండాఎన్నియాలో… అని నృత్యం చేశారు. శైలజ, డి వరలక్ష్మి, సిహెచ్ కోటేశ్వరి కసుకుర్తి కోటేశ్వరి, శివలీల, మాంచాలి, శ్రీదేవి తదితరులు కళారూపాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సి. హెచ్. ఇందిరావతి, పద్మజ లతా రెడ్డి పద్మజ ప్రవీణ గీత అమీరున్నీసా తదితరులు పాల్గొన్నారు.
తమ పిల్లలను అంగన్వాడీ బడులకు ఎలా పంపాలని చిన్నారుల తల్లిదండ్రులు సచివాలయం సిబ్బంది ప్రశ్నించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని 45,46 అంగన్వాడి కేంద్రానికి చిన్నారులను పంపాలని ఇళ్ళ వద్దకు వెళ్లారు. కొద్ది సేపటి తర్వాత పాఠశాలల వద్దకు వెళ్లిన తల్లిదండ్రులు మీ మొహాలు తమకు తెలియదని పిల్లలను మీ వద్దకు ఎలా పంపాలని ప్రశ్నించారు. తమ పిల్లల ఆలనా పాలనా మొత్తం అంగన్వాడీ టీచర్, ఆయాలకు తెలుసని మీకు ఎలా తెలుస్తుందని అన్నారు. దీంతో సచివాలయం సిబ్బంది వద్ద సమాధానాలు లేక మౌనంగా కూర్చుండిపోయారు.
Read Also..
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ టీచర్లు, ఆయాలపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నాడని మాజీ మంత్రి, టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా అయిదు రోజులుగా డిమాండ్ల సాధన కోసం అంగన్ వాడీలు చేస్తున్న పోరాటానికి శనివారం ఉదయం ఆయన కనేకల్లులో సంఘీభావం ప్రకటించారు. అక్కడ వారి దీక్ష శిబిరానికి ఆ పార్టీ నాయకులతో వెళ్లారు. వారి పోరాటానికి ఆది నుంచి తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు ప్రకటించిందన్నారు. రానున్న తెలుగుదేశం ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను తీరుస్తుందని భరోసా ఇచ్చారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు కూడా స్పష్ఠమైన హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 2019లో ప్రతిపక్ష నాయకుడి హోదాలో జగన్మోహన్ రెడ్డి పక్క రాష్ట్రాల కంటే ఏపీలో అంగన్వాడీలకు మెరుగైన జీతాలు ఇస్తానని నమ్మబలికాడన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చిన వేతనాలనే ప్రస్తుతం వైసిపి ప్రభుత్వం ఇస్తోందన్నారు. నాలుగున్నరేళ్లు గడుస్తున్నా, అంగన్వాడి మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చడానికి ఎందుకు శ్రద్ధ చూపలేదని కాలవ సూటిగా ప్రశ్నించారు. వారు అడుగుతున్న డిమాండ్లు సహేతుకమైనవి, న్యాయబద్దమైనవి అని ఆయన అభిప్రాయపడ్డారు. వారు నిరసన తెలుపుతుంటే వైసిపి ప్రభుత్వం దుర్మార్గంగా సెంటర్ల తాళాలు పగలగోడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 5రోజుల పాటు అంగన్వాడిలు న్యాయబద్దంగా పోరాటం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డికి కనీసం చీమ కుట్టినట్లుగా లేకపోవడం బాధ్యతరహితమన్నారు. అంగన్వాడిల సమస్యల్ని తీర్చడానికి చేతకాని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమానవీయంగా సెంటర్లను స్వాధీనం చేసుకోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం లో తాళాలు బద్దలు కొట్టి అంగన్వాడీ కేంద్రాలను తెరుస్తున్న సచివాలయాల సిబ్బంది, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత మూడు రోజులుగా అంగన్వాడీ సిబ్బంది అంగన్వాడీ కేంద్రాలకు తాళాలు వేసి సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే.. అంగన్వాడీ సిబ్బంది సమస్యలు ప్రభుత్వం పరిష్కరించకుండా, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంపిడిఓ, మున్సిపల్ కమీషనర్ ల ఆధ్వర్యంలో పట్టణం, మండలాల పరిధిలోని అంగన్వాడి కేంద్రాలను సచివాలయం సిబ్బంది తో అంగన్వాడీ సూపర్ వైజర్ పర్యవేక్షణలో తాళాలు బద్దలు కొట్టి తెరుస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలలో స్టాక్ రిజిస్టర్ ను పరిశీలించి గర్భిణీలకు, బాలింతలకు, పిల్లలకు ఇబ్బంది లేకుండా ఫీడింగ్ ఇస్తున్నట్లు అంగన్వాడీ సూపర్ వైజర్లు చెపుతున్నారు. కాగా తమ సమస్యలు పరిష్కరించాలని స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద చేస్తున్న ఆందోళన నాల్గవ రోజు కొనసాగుతోంది. అంగన్వాడీ సిబ్బంది నల్ల దుస్తులు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతుంటే తాళాలు బద్దలు కొట్టి అంగన్వాడీ కేంద్రాలను తెరవడం సిగ్గు సిగ్గు అంటూ అంగన్వాడీ సిబ్బంది నినాదాలు చేశారు.
చాలిచాలని వేతనాలతో తమ కడుపు మండుతూ సమస్యల పరిష్కారం కోసం శాంతియుత నిరసనలు చేస్తుంటే తమపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఏంటని ప్రకాశం జిల్లా మార్కాపురంలో అంగన్వాడీ లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్కాపురం, తర్లుపాడు, పొదిలి, యర్రగొండపాలెం మండలాల్లో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు నాలుగు రోజులుగా సమ్మె చేస్తూ వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రభుత్వం తమ అనుమతి లేకుండా అంగన్వాడీ కేంద్రాల వద్దకు వెళ్ళి తాళాలను పగులగొట్టడం ఏంటని వారు మండిపడుతున్నారు. మార్కాపురంలోని 52వ అంగన్వాడి కేంద్ర వద్ద తాళం పగులగొట్టెందుకు వచ్చిన సచివాలయం సిబ్బందిని అడ్డుకున్నారు. అక్కడే కింద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ తర్వాత పట్టణంలోని నాలుగు వీధుల్లో నిరసన ర్యాలీ చేశారు.
కాకినాడ లో కద్దాంతోక్కిన అంగన్వాడీ కార్యకర్తలు తమ నాణ్యమైన డిమాండ్స్ పరిష్కరించాలి అని కాకినాడ కలెక్టర్ ధర్నా చౌక్ వద్ద గత 3 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఆనాడు జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర లో మాకు అనేక హామీలు ఇచ్చారు, ఒకటి కూడా నెరవేర్చలేదు. కనీసం వేతనం ఇవ్వాలని తెలంగాణ కంటే ఎక్కువ వేతనం ఇస్తానని.. అబద్దపు హామీలు ఇచ్చారని.. అంగన్వాడీ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు.




Total views : 147643