శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు. అక్టోబరు 1, 2వ తేదీల్లో ఆయన తిరుమలలో పర్యటిస్తారు. మంగళవారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా అలిపిరి వద్ద ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి పాదాల చెంతకు చేరుకుని.. అక్కడ పూజలు నిర్వహిస్తారు. అనంతరం మెట్ల మార్గంలో తిరుమల కొండ ఎక్కనున్నారు. రాత్రి 9 గంటలకు కొండపైకి చేరుకుని అక్కడే బసచేస్తారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల సమయంలో దీక్షా మాలతోనే స్వామివారిని దర్శించుకుంటారు.
అనంతరం లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేస్తారు. అక్కడి నుంచి వెంగమాంబ అన్నదాన సత్రానికి చేరుకుని భక్తులకు అందించే అన్న ప్రసాదాలను పరిశీలిస్తారు. అనంతరం టీటీడీ అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. బుధవారం రాత్రి కూడా కొండపైనే బస చేస్తారు. ఆయన చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష గురువారానికి పూర్తవుతుంది. దీక్ష విరమణ అనంతరం గురువారం సాయంత్రం 4 గంటలకు కొండ కిందకు చేరుకుంటారు. తిరుపతి నగరంలో ఏర్పాటు చేసిన వారాహి సభలో పాల్గొంటారు. అనంతరం విజయవాడకు తిరుగు ప్రయాణమవుతారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- కాకినాడ జిల్లా తుని మండలం చామవరం గ్రామంలో సీఎం చంద్రబాబు పర్యటన ..ఇవాళ కాకినాడ జిల్లా తుని మండలం చామవరం గ్రామంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ అధికారులు విడుదల చేసారు . ఉదయం 10 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరతారు .ఉదయం…
- హైదరాబాద్లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..ఆరోగ్యమే మహాభాగ్యమని చెబుతుంటారు. ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ వ్యాయామం, రన్నింగ్ లేదా వాకింగ్ చేయడం ఎంతో అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి సందేశాన్నే తన జీవితంలో ఆచరిస్తూ మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ దుబ్బ కిషన్. మే నెలలో…
- నిర్మల్ జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాల్లో విషాద ఘటన..నిర్మల్ జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాల దయనీయ పరిస్థితికి అద్దం పట్టే ఘటన చోటుచేసుకుంది. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ప్రసవ వేదనలో ఉన్న ఓ గర్భిణి అటవీ ప్రాంతంలోనే బిడ్డకు జన్మనిచ్చింది. అంబులెన్స్ గ్రామానికి చేరుకోలేకపోవడంతో కుటుంబ సభ్యులు ఎడ్లబండిపై ఆమెను…
- హైదరాబాద్లోని గండిపేట భూకబ్జా యత్నం కేసులో దర్యాప్తు..నకిలీ జీఓలు, ఫోర్జరీ పత్రాలతో కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని విక్రయించేందుకు యత్నించిన అంతర్రాష్ట్ర భూ దందా ముఠాను పోలీసులు ఛేదించారు. పోలీసులకు తహసీల్దార్ ఫిర్యాదు చేయడంతో భూదందా గుట్టు వెలుగులోకి వచ్చింది. గండిపేట పరిధిలోని సర్వే నెంబర్ 18లో గల…
- హోంగార్డుపై కత్తితో దాడి చేసిన కేసులో నలుగురు అరెస్ట్..అనకాపల్లి జిల్లా పరవాడ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ కె.వి. రమణపై కత్తితో దాడి చేసిన కేసులో నలుగురు నిందితులను పరవాడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.ఇటీవల అర్ధరాత్రి సమయంలో హోంగార్డ్ కె.వి. రమణపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 90153