తిరుపతి అభివృద్దిలో టిటిడి భాగస్వామ్యం ఉండాలని నగరపాలక సంస్ధలోకి నిధులు మళ్ళీంచరాదని అఖిలపక్షం నాయకులు పేర్కొన్నారు. టిటిడి నిధులతో తిరుపతి అభివృద్ది అనే అంశం పై నగరంలో అఖిలపక్ష ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తిరుపతి అభివృద్ది టిటిడి స్వయం పర్యవేక్షణలో జరగాలని కోరారు. నగర ప్రజలు ప్రేక్షక పాత్ర వహించకుండా అధికార పార్టీ పై ఒత్తిడి తీసుకవచ్చి టిటిడి లో వచ్చే ఉద్యోగ అవకాశాలు పోందాలని, తిరుపతి అభివృద్దికి టిటిడి గరిష్టంగా నిధులు వెచ్చించాలని డిమాండ్ చేశారు. నగరంలోని పలు విద్యాసంస్ధలు, ఆస్పత్రుల ఏర్పాటులో టిటిడి కీలకమని గుర్తు చేశారు. తిరుపతి అభివృద్దికి భాజపా అడ్డంకిగా మారడం పట్ల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.
ap news
అనంతపల్లి గ్రామంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద దస్తావేజు లేకరిగా పనిచేస్తున్న కాట్రగడ్డ ప్రభాకర్ ను తుపాకీతో కాల్చి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు. పుల్లలపాడు గ్రామంలో తన ఇంటి వద్ద ఉన్న ప్రభాకర్ (60)ను కారులో వచ్చిన దుండగులు అరటిపండ్లు తీసుకోమని పిలిచి తుపాకీతో మూడు రౌండ్లు కాల్చి చంపి దుండగులు పరారయ్యారు కారులో ఇద్దరు వ్యక్తులు వచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకొన్న నల్లజర్ల పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు
అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం 85 నిట్టూరు గ్రామం పొలంలో కంచ విషయంపై నిట్టూరు గ్రామానికి చెందిన వెంకటరెడ్డికి మేడికుర్తి గ్రామానికి చెందిన ఆదినారాయణ, ఇరువురి ఘర్షణ జరుగుతుండగా మధ్యలో ఆదినారాయణ కొడుకు నాగార్జున రావడంతో నిట్టురుకు చెందిన వెంకటరెడ్డి ఇనుపరాడితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తన చిన్నాయన కంబగిరి అతన్ని విడిపించుటకు వెళ్తే అతనిపై దాడి చేయడంతో అతనికి తీవ్ర గాయాలు కావడంతో అనంతపురం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేడు తిరుపతి వస్తున్న సంగతి తెలిసిందే. తిరుమలలో రాత్రికి బస చేసి నవంబరు 27న శ్రీవారి దర్శనం చేసుకుంటారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో, ఏపీ సీఎం జగన్ ఆయనకు స్వాగతం పలికేందుకు నేడు తిరుపతి వెళ్లనున్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు సీఎం జగన్ రేణిగుంట విమానాశ్రయానికి వెళ్లనున్నారు. ప్రధాని మోదీకి స్వాగతం పలికిన అనంతరం సీఎం తిరిగి విజయవాడ చేరుకోనున్నారు. ప్రధాని రాక నేపథ్యంలో తిరుపతి, తిరుమలలో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. వీవీఐపీ పర్యటన నిబంధనలను అనుసరించి తగిన ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డికి రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డి సూచనలు చేశారు. ప్రధాని మోదీ రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమల కొండపైకి చేరుకునే మార్గం పొడవునా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. కాగా, తిరుమల పర్యటన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ వెళ్లనున్నారు.
ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి రాజీనామా చేయడం తమ పార్టీకే కాకుండా ఏలేశ్వరం మండలానికి హర్షించదగ్గ విషయమని స్థానిక సర్పంచులు వైసీపీ నాయకులు ఎంపీటీసీలు అన్నారు. ఏలేశ్వరం మండలం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏలేశ్వరం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాతో నెగ్గిన గొల్లపల్లి నరసింహమూర్తి పార్టీకి రాజీనామా చేయడమే కాకుండా వెంటనే ఎంపీపీ పదవికి కూడా రాజీనామా చేయాలని వారన్నారు. అలాగే పార్టీలో ఉండి ఒంటి పోకడ రాజకీయం చేసిన ఘనత ఒక గొల్లపల్లి బుజ్జికే దక్కుతుందని వారు ఆరోపించారు. ఇదేవిధంగా ప్రోటోకాల్ అంటూ స్థానిక అధికారులను బాధించే సంఘటనలు ఎన్నో ఉన్నాయని అన్నారు. ఏలేశ్వరం అభివృద్ధి చెందాలంటే ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి రాజీనామా చేయడమే శుభ పరిణామం అని అది ఏలేశ్వరం మండల ప్రజలకు అదృష్టమని అన్నారు. అలాగే పార్టీలో భవిష్యత్తు ఇచ్చిన ఎమ్మెల్యే పర్వతపై అవాకులు చవాకులు పెలడం తగదని వారన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే పై ఆరోపణలను మానుకోవాలని వారు సందర్భంగా హెచ్చరించారు
యువగళం పాదయాత్ర 2.0 అంటూ ప్రకటన వచ్చింది కదా అధికార వైఎస్సార్సీపీ నేతల్లో ఆందోళన మొదలైంది. పాదయాత్రకు ఊహించని రీతిలో జనం తరలి వస్తున్నారు. మొదట్లో ఈ పాదయాత్రను వైఎస్ఆర్ సీపీ తేలిగ్గా తీసుకోగా, ప్రతి చోటా యువగళంలో కనిపిస్తున్న స్పందన చూసి అధికార పార్టీ నేతలు బాగా కంగారు పడుతున్నారు. అందుకు తగ్గట్లుగా యాత్రకు ఎన్ని అడ్డంకులు వచ్చేలా చేశారో లెక్కేలేదు.ప్రస్తుతం నడుస్తున్న సామాజిక సాధికార బస్సు యాత్రలో ఆ ప్రభావం స్పష్టంగా కనపడుతోంది. పైగా యువగళం 2.0 పాదయాత్రలో నారా లోకేశ్ ప్రస్తావించే ప్రధాన అంశం.. చంద్రబాబు అక్రమ అరెస్టు గురించే ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వ కక్ష్యసాధింపు తీరును ఈ యాత్ర ద్వారా మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్తారు. జనాదరణ కూడా గతంలో కంటే మరింతగా ఉంటుంది. ఈ పరిణామాలు ఊహించుకొనే ప్రస్తుతం వైఎస్ఆర్ సీపీ నేతలు టెన్షన్ పడుతున్నట్లుగా సమాచారం. యువగళం సాగే ప్రాంతాల్లోని నేతలకు దానికి అడ్డంకులు సృష్టించాలని అధిష్ఠానం నుంచి ఆదేశాలు అందాయని కూడా సమాచారం
కొమోరిన్ ప్రాంతం నుండి ఆంధ్రప్రదేశ్ మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని ఐఎండీ వెల్లడించింది. ఈ ద్రోణితో రెండు ఉపరితల ఆవర్తనాలు కలిసిపోయి కొనసాగుతున్నాయని వివరించింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నట్టు తెలిపింది. అక్కడక్కడ భారీ వర్షపాతం నమోదైందని తెలిపింది. నేడు కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ గుంతలప్రదేశ్ గా మారిందని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ అన్నారు. టీడీపీ-జనసేన పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేశారు. అధ్వానంగా ఉన్న రోడ్ల పరిస్థితిపై నిరసన కార్యక్రమం చేపట్టారు. గండేపల్లి మండలం కోరుకొండ, గోకవరం మండలాలకు అతి ముఖ్యమైన లింకు రోడ్డు అద్వాన్న పరిస్థితిలో ఉంది. వెంటనే మరమ్మతులు చేసి ప్రజలను ప్రమాదాల నుంచి కాపాడాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని రోడ్లను వెంటనే బాగు చేస్తామని నెహ్రూ తెలిపారు.
ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రోడ్లు బాగోలేవని వచ్చే ఎన్నికల్లో వైసీపీని వద్దనుకోవద్దని ఆయన అన్నారు. రోడ్ల వల్ల జీవన ప్రమాణాలు పెరుగుతాయా? అని ఆయన ప్రశ్నించారు. చెన్నై, కర్నూలు రాష్ట్ర రాజధానులుగా ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలు అక్కడకు వెళ్లడానికి రెండు రోజులు పట్టేదని చెప్పారు. విశాఖ కంటే గొప్ప అర్హతలు ఉన్న రాజధాని ఏపీలో లేదని అన్నారు. విశాఖ రాజధాని వల్ల జీవన ప్రమాణాలు పెరుగుతాయని చెప్పారు. దేశంలోని ప్రతి రాష్ట్రంలో విద్యుత్తు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని… మన కంటే ధరలు తక్కువ ఉన్న రాష్ట్రం ఏదో చెప్పాలని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ చేసిన ఉపయోగం లేని పనులు ఏమిటో టీడీపీ నేతలు చెప్పలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. సామాజిక సాధికార యాత్రలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని గుంతకల్ రోడ్డులో… ఎనిమిది దుకాణాలను దొంగలు టార్గెట్ చేశారు. అర్ధరాత్రి షాపుల తాళాలు బద్దలు కొట్టి దుకాణాలలోకి చొరబడ్డారు. మెడికల్ స్టోర్స్, ఫర్టిలైజర్స్, టీ షాప్, చిల్లర దుకాణా షాపులు కూడా వదలలేదన్నారు బాధితులు. ఉన్న కాటికి దోచుకొని వెళ్లిపోయారన్నారు. 8 షాపులలో సుమారు 10వేల నగదు, ఒక సెల్ ఫోన్ చోరీ జరిగినట్లు సమాచారం వచ్చింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




Total views : 90081