వెల్లుల్లిలోని 3 పాయలను పాలలో కలిపి మరగబెట్టి రాతవేళల్లో సేవిస్తే ఉబ్బసం తగ్గుముఖం పడుతుంది. వెల్లుల్లిలోని ఒక పాయను చితకకొట్టి 120 మిల్లిలీటర్ల మాల్ట – వెనిగార్‌తో కలిపి మరగబెట్టి, తర్వాత చల్లార్చి వడగట్టి, అంతే పరిమాణవు తేనెను అందులో కలిపి ఒక సీసాలో నిలవ ఉంచుకోవాలి. రెండు లేక మూడు స్పూన్లు ఈ సిరప్‌ను మెంతికూర డికాక్షన్‌తో కలిపి సాయంత్రం ఒకసారి, రాత్రి పడుకోబోయే ముందు ఒకసారీ ఒకటి లేక రెండు సార్లు చొప్పున సేవిస్తే ఉబ్బసం వల్ల కలిగే ఇబ్బందులు తొలగిపోతాయి.
asthma
కాకరను తరచుగా తినడం వల్ల చర్మ, రక్త సంబంధ సమస్యలు దూరం అవుతాయి. ఆస్తమా, బ్రాంకైటిస్, దగ్గు, శ్వాస సంబంధ సమస్యలు తగ్గడంలో కాకర ఎంతో ఉపయోగపడుతుంది. కాకర కాయ కూర తినడం చాలా మందికి ఇష్టం ఉండదు. చేదుగా ఉండే కాకరను ఎలా తింటాం అని దూరం పెడుతుంటారు. కానీ కాకర కాయలో బోలెడు పోషకాలున్నాయి. ఫ్రై చేసినా, ఉడికించినా జ్యూస్ రూపంలో తీసుకున్నా కాకరలోని పోషకాలు శరీరానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలోనైతే కాకరను తరచుగా తీసుకోవడం మరింత ఫలితాన్నిస్తుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను పెంపొందిస్తుంది. బరువు తగ్గడానికి సహకరిస్తుంది. వర్షాకాలంలో కాకరను ఎక్కువగా తీసుకోవడం వల్ల వాటిలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగాలను దూరం చేస్తాయి. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలంగా మారి, ఇన్ఫెక్షన్లు దూరం అవుతాయి. కాకర కాయలోని యాంటీఆక్సిడెంట్లు శరీరం నుంచి ట్యాక్సిన్లు బయటకు పోయేలా చూస్తాయి. ఫలితంగా జీర్ణవ్యవస్థ మెరుగ్గా పని చేసి బరువు తగ్గుతారు. కాకర కాయలో క్యాలరీలు, కొవ్వు, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు కాకర ఓ వరం. కాకరలోని ఆల్కలైడ్లు రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. ఇందులోని చార్న్‌టిన్ పెప్టైడ్లు ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి. కాకరలోని యాంట్రీ మైక్రోబియాల్, యాంటీఆక్సిడెంట్ గుణాలు రక్తాన్ని శుద్ధి చేయడంలో తోడ్పడతాయి.
ఉల్లికాడలు గుండె, రక్తనాళాలకు మంచిది. ఇది కొలెస్ట్రాల్ ఆక్సీకరణను తగ్గిస్తుంది, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ కూరగాయలోని సల్ఫర్ కాంపౌండ్ బ్లడ్ ప్రెజర్ స్థాయిలను నియంత్రి౦చడానికి, తగ్గించడానికి సహాయపడుతుంది. ఉల్లికాడలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి కూడా సహాయపడతాయి. ఉల్లికాడలలో ఉన్న క్రోమియం కంటెంట్ మధుమేహ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది బ్లడ్ షుగర్ స్థాయిలను నియంత్రిస్తుంది, గ్లూకోస్ శక్తిని పెంచుతుంది. అల్లిల్ ప్రోపిల్ డిసల్ఫయిడ్ తగ్గిన బ్లడ్ షుగర్ స్థాయిలలో చాలా సహాయకారిగా కూడా ఉంటుంది. దీనిలో ఉన్న యాంటీ-బాక్టీరియల్ లక్షణం జలుబు, జ్వరానికి వ్యతిరేకంగా పోరాడడానికి సహాయపడుతుంది. అసౌకర్య అరుగుదల నుండి ఉపశమనానికి యాంటి బాక్టీరియల్ లక్షణాలను కూడా అందిస్తుంది. ఈ కూరగాయలోని విటమిన్ C వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. ఉల్లికాడలలో పెక్టిన్ (నీటిలో కరిగే కొల్లాయిడల్ కార్బోహైడ్రేట్) ముఖ్యంగా పెద్దప్రేగు కాన్సర్ అభివృద్ది అవకాశాలను తగ్గిస్తుంది. ఉల్లికాడలలో క్వర్సేటిన్ బాధనివారక, యాంటి హిస్టమైన్ ప్రయోజనాలను అందిస్తుంది. ఇది కీళ్ళనొప్పులు, ఉబ్బస చికిత్సకు మంచి కూరగాయ. స్ధూలపోషకాలు ఉండడం వల్ల ఇది జీవక్రియ నియంత్రణకు మంచి ఆహారం. ఉల్లికాడలు కళ్ళ జబ్బులకు, కాళ్ళ సమస్యలకు మంచివి. కూరగాయలలోని అల్లసిన్ చర్మానికి మంచిది, ఇది చర్మం ముడతల నుండి రక్షిస్తుంది.
Read Also..
Read Also..
రెండు చెంచాల మెంతి గింజలను సుమారు 4 గంటలు నీటిలో నానబెట్టి వాటిని ఈ నీటితో సహా ఉడకబెట్టి వడగట్టి తేనెతో తీసుకుంటే ఉబ్బస రోగం, క్షయ రోగులు, అధిక మద్యపానం వల్ల కాలేయం చెడిపోయిన వారు, కీళ్ల నెప్పులు, రక్తహీనతతో బాధపడేవారు త్వరగా కోలుకుంటారు. నీళ్ల విరేచనాలు, రక్త విరేచనాలు అవుతున్నవారు, మూలశంక (పైల్స్) ఉన్నవారు వేయించిన మెంతిపొడిని 1-2 చెంచాలు మజ్జిగతో తీసుకోవాలి. కడుపులో మంట, పైత్యంతో బాధపడుతున్నవారు వేయించిన మెంతుల పొడిని మజ్జిగ (పులవని)తో తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. పేగు పూతకు మెంతులు మంచి ఔషధం. 2-4 చెంచాలు గింజలను రాత్రి నానబెట్టి ఉదయం భోజనానికి ముందు తీసుకుంటే ప్రాథమిక దశలో ఉన్న మధుమేహం అదుపులోకి వస్తుంది. చాలా రోజుల పాటు మధుమేహాన్ని నియంత్రించొచ్చు. మెంతి గింజల పచ్చిపిండిని పాలలో కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం నున్నగా తయారవుతుంది. మెంతి పొడి పట్టించి స్నానం చేస్తే చుండ్రు, వెంట్రుకలు రాలడం తగ్గుతాయి. మెంతి పిండి మంచి కండీషనర్‌గా పనిచేస్తుంది. మలబద్దకంగా ఉంటే 2-3 చెంచాల గింజలు నానబెట్టి తింటే విరేచనం సాఫీగా అవుతుంది. మెంతి గింజల పొడి, పసుపు సమాన భాగాలుగా నీళ్లలో మరగకాచి శుభ్రమైన వస్త్రం సాయంతో వడపోయాలి. తెల్ల బట్ట సమస్య ఉంటే జననేంద్రియాలను ఈ నీళ్లతో శుభ్రం చేసుకుంటే గుణం కనపడుతుంది. నీళ్లను వడపోయడం చేయాలి. ప్రతీ రోజూ అర చెంచాడు మెంతి పొడిని భోజనానికి ముందు తీసుకుంటే మధుమేహం వచ్చే సూచనలున్న వారు కొన్నేళ్ల వరకు రాకుండా నివారించొచ్చు.
Read Also..
Read Also..
ఆస్త్మా గల వారు వింటర్ సీజన్ లో ఎక్కువ ఇబ్బంది పతుంటారు . అటువంటివారు ఆహారము విషయములో తగినంత శ్రద్ద తీసుకుటే సమస్య తీవ్రతను కొంత తగ్గించుకోవచ్చును . అటు వంటి ఐదు పదర్ధాలపై అవగాహన. ఆయుర్వేద మరియు ప్రకృతి చికిత్సా నిపుణులు చెప్పిన ప్రకారము మెగ్నీషయం కు పాలకూర మంచి అధారము . ఆస్త్మా లక్షణాలను తగ్గించడము లో బాగా సహకరిస్తుంది. ఆస్తమా గలవారికి రక్తము లోనూ , టిష్యూలలోను మెగ్నీషియము స్థాయిలు తక్కువగా ఉంటాయి. దీర్ఘకాలము మెగ్నీషియం స్థాయిలు పెంచుకోవడము వలన ఆస్త్మా ఎటాక్స్ తగ్గుతాయి. రెడ్ క్యాప్సికం దీనిలో ” సి ” విటమిన్ ఎక్కువ. ఇన్ప్లమేషన్ తగ్గించడములో బాగా దోహదపడుతుంది. అయితే మిగతా విటమిటన్ సి ఉన్న ఆహారపదార్ధాలు అస్త్మాకి మంచి చేయవు . రెడ్ మిరిపకాయలోని ఎస్కార్బిక్ యాసిడ్ ” ఫాస్ఫోడిల్ స్టెరేజ్ ” అనే ఎంజైమ్ ఉతపత్తిని అడ్డుకుంటుంది. చాలా ఆస్త్మా మందులలో ఇదే జరుగుతుంది. ఉల్లి వీటిలో కూడా యాంటీ – ఇన్ప్లమేటరీ , యాంటీ అస్త్మాటిక్ ప్రభావాలున్నాయి. ఉల్లి తినడము వల్ల ‘ హిస్తమిన్ ‘ విడుదలను అడ్డుకుంటుంది. దీనివల బ్రోంకియల్ అబ్ స్ట్ర్క్షక్షన్ తగ్గుతుంది. ఆరెంజ్ కమలా , నారింజ , నిమ్మలలో ఉండే విటమిన్ ‘ సి ‘ ఉబ్బస లక్షణాలు తగ్గిస్తుందని అనేక పరిశోదనలు ఉన్నాయి. ముఖ్యము గా చిన్నపిల్లలో ఈ లక్షణాలు బాగా తగ్గినట్లు ఆదారాలు ఉన్నాయి. యాపిల్ : వీటిలో ఉండే ‘ ఫైటోకెమికల్స్ ‘ అస్త్మాతో ఇబ్బంది పడే వారి ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తాయి. యాపిల్ పై తొక్క ముదుర రంగులో ‘ లైకోఫిన్’ ఎక్కువగా ఉన్నందున యాంటి-ఆక్షిడెంట్ గా ఆస్త్మారోగులము మేలుచేస్తుంది.





Total views : 75406