హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో జరిగిందే ఇప్పుడు గజ్వేల్‌లోనూ జరుగుతుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. వర్గల్ సరస్వతీదేవి ఆలయంలో ఆయన పూజలు నిర్వహించారు. ఆ తర్వాత పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ… గజ్వేల్‌లో ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధం లాంటివన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అధికార పార్టీకి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ ఎన్ని కుయుక్తులు, కుట్రలు చేసినా గెలిచేది బీజేపీయే అన్నారు. గజ్వేల్‌లో ఏ పార్టీ అయినా సమావేశాలు పెట్టుకోవచ్చునని, కానీ బీజేపీ సమావేశాలకు ప్రజలు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. డబ్బులిచ్చి బీజేపీ సభకు రాకుండా చేస్తున్నారన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలోనూ ఇలాగే చేశారన్నారు. కానీ వారు ప్రలోభాలకు లొంగకుండా ధర్మాన్ని, న్యాయాన్ని నిలబెట్టారన్నారు. ఈసారి గజ్వేల్‌లో అదే జరుగుతోందన్నారు.
Bjp
రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. గెలుపు గుర్రాల కోసం ప్రధాన రాజకీయ పార్టీలు ముమ్మర కసరత్తులు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అధికార కాంగ్రెస్ పార్టీ శనివారం అభ్యర్థుల తొలి జాబితా ను విడుదల చేయగా.. అటు బీజేపీ కూడా 83 మందితో రెండో జాబితాను ప్రకటించింది.రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంపై గత కొంతకాలంగా సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. ఆ ఊహాగానాలకు తెరదించుతూ నేడు వెల్లడించిన జాబితాలో రాజే పేరును భాజపా ప్రకటించింది. తన కంచుకోట ఝల్రాపటన్ నుంచే ఆమెను బరిలోకి దించింది. ఈ నియోజకవర్గం నుంచి ఆమె ఇప్పటికే 4 సార్లు విజయం సాధించారు.ఇక, మేవాఢ్ వీరుడు మహారాణా ప్రతాప్ సింగ్ వారసుడు విశ్వరాజ్ సింగ్ మేవాఢ్‌ను నాథ్‌ద్వారా నుంచి నిలబెట్టింది. ఇటీవలే విశ్వరాజ్ భాజపాలో చేరారు. అటు ప్రముఖ రాజకీయ నేత భైరాన్ సింగ్ షెఖావత్ అల్లుడు నర్పత్ సింగ్ రజ్వీకు కూడా తాజా జాబితాలో చోటు దక్కింది. బీజేపీఇప్పటివరకు 124 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. అటు కాంగ్రెస్ కూడా శనివారం 33 మందితో అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. అయితే, ఇందులో పెద్దగా ఎలాంటి మార్పులు చేయలేదు.
భక్తుల కానుకలు, ముడుపులతో టిటిడి ఖజనా నింపుకుంటున్న పాలక మండలి నిర్ణయం సరైనది కాదు అన్నారు బిజేపి అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ టిటిడి నిధుల్ని తిరుపతి అభివృద్ధి కోసం మున్సిపాలిటీ మళ్ళించడంను వ్యతిరేకిస్తున్నాం.. ఈ నిర్ణయంపై విశ్వహిందూ పరిషత్ వ్యతిరేకిస్తూ అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన తెలియజేస్తున్నాం.. టిటిడి నిధుల్లో ఒక్కశాతం అంటే, ఏడాదికి యాభై కోట్లు, శానిటరీ పేరుతో మరో యాభై కోట్లు దారి మళ్ళించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.. రాష్ట్ర ప్రభుత్వం టిటిడి నిధులను తిరుపతి మున్సిపాలిటీ మళ్ళించడం లేదంటూ ఉత్తర్వులు జారీ చేయడం సంతోషం.. స్వార్ధ రాజకీయాలు,స్వార్ధ ప్రయోజనాల కోసం ఎవరినో దృష్టిలో పెట్టుకుని టిటిడి నిధులను దారి మళ్ళించేందుకు ప్రయత్నించారు.. ఇలాంటి నిర్ణయం తీసుకుంటే శ్రీవారి భక్తుల ఆగ్రహంకు గురి కాక తప్పదన్నారు భానుప్రకాష్ రెడ్డి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏ క్షణంలో అయినా బీజేపీఅభ్యర్థుల ప్రకటన రావొచ్చని ఎంపీ లక్ష్మణ్ వెల్లడించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. మూడు రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికపై భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ చర్చించిందని తెలిపారు. తెలంగాణ నుంచి 50కి పైగా స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేసినట్లు వివరించారు.
అభ్యర్థుల ఎంపికలో బీజేపీ సామాజిక న్యాయం పాటిస్తుందన్నారు. సీట్ల కేటాయింపులో మహిళలు, బీసీలకు పెద్దపీట వేశామన్నారు. మొదటి విడతలో బీసీలకు 20కి పైగా సీట్లు కేటాయిస్తున్నామన్నారు. మహిళా రిజర్వేషన్‌కు సంబంధించి దిల్లీలో ఎమ్మెల్సీ కవిత ధర్నాలు చేశారు.. కానీ, మహిళలకు బీఆర్ఎస్ సీట్లు కేటాయించలేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ బీసీలను పట్టించుకోవడం లేదన్నారు. రాజాసింగ్ సస్పెన్షన్, పోటీ అంశాన్ని అధిష్ఠానం పరిశీలిస్తోంది అని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు.





Total views : 89511