బీజేపీ నాయకుడు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఫిర్యాదు ఆధారంగా చేవెళ్ల ఎంపీ, బీఆర్ఎస్ నేత రంజిత్ రెడ్డిపై హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. తమ పార్టీకి చెందిన నేతలు, సర్పంచ్‌లను ఎందుకు కలుస్తున్నావని, ఎందుకు మాట్లాడుతున్నావంటూ అగౌరవంగా మాట్లాడారని, అసభ్యకరంగా మాట్లాడారని విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు జనవరి 17న రంజిత్ రెడ్డి తనకు కాల్ చేశారని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. రంజిత్‌రెడ్డిపై ఐపీసీ సెక్షన్ 504 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎంపీ రంజిత్ రెడ్డిపై కేసు నమోదు విషయంలో న్యాయ సలహా తీసుకున్నామని బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ సతీష్ తెలిపారు. నాంపల్లిలోని మూడో ఏసీఎంఎం కోర్టును సంప్రదించగా పోలీసులకు కీలక సూచనలు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా మరో రెండు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు ఉన్న సమయంలో జరిగిన ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
BRS leader
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు “ఎక్స్” లో ఆసక్తికర వీడియోని పోస్ట్ చేశారు. ధాన్యపు రాశుల తెలంగాణను ప్రతిబింబించేలా తాను స్వయంగా వీడియోను చిత్రీకరించారు. ఎన్నికల ప్రచారానికి గాను నిజామాబాద్ నుంచి జగిత్యాలకు వెళ్తున్న క్రమంలో ఆర్మూర్ లోని సిద్దులగుట్ట వద్ద రోడ్డుకు ఇరువైపులా రైతులు వడ్లను ఆరబెట్టిన దాన్ని వీడియోలో ఆమె చిత్రీకరించారు. “ధాన్యపు రాశుల తెలంగాణ. అప్పుడు ఎట్లుంది తెలంగాణ..!! ఇప్పుడు ఎట్లైంది తెలంగాణ !!” అని పోస్టులో కవిత పేర్కొన్నారు.
Read Also..
ట్రాన్స్ జెండర్స్ ను అవమానపరిచే విధంగా వాక్యాలు చేయడం సరైనది కాదని.. కెసిఆర్, కేటీఆర్ సూచనల మేరకే ట్రాన్స్ జెండర్స్ ను అవమానపరిచావా..? వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నిలిచిన మిగతా అభ్యర్థులు మగవారు కాదా అని సూటి ప్రశ్న.. బీఎస్పీ తరఫున ఒక ట్రాన్స్ జెండర్ బరిలో నిలిచి ఉంటే బిఆర్ఎస్ పార్టీ నాయకులు తట్టుకోలేక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని.. తక్షణమే బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే శ్రీహరి ఇల్లు ముట్టడిస్తాం.. మా ట్రాన్స్ జెండర్స్ అందరం ఐక్యమై నీ అంత చూస్తామని సవాల్ చేశారు.
ఇబ్రహీంపట్నం మంచిరెడ్డి కిషన్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దాడిని ఖండిస్తూ మంచిరెడ్డి కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. మాట్లాడుతూ, ముందే ప్లాన్ చేసుకొని మా కార్యకర్తలపై నాయకులపై రాళ్లు విసరడం జరిగింది సుమారుగా 35 కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. మూడుసార్లు ఓడిపోయిన మళ్లీ ఓడిపోవడానికి నామినేషన్ వేసి ఇలా దాడి చేయడం కరెక్టు కాదని హెచ్చరించారు. దాడికి ప్రతి దాడి చేస్తే అది కరెక్ట్ కాదని అన్నారు. ఈ ఎన్నికలలో ప్రజలే బుద్ధి మల్రెడ్డి రంగారెడ్డికి కాంగ్రెస్ పార్టీకి స్టేట్ లో ఇక్కడ ఇబ్రహీంపట్నంలో అవకాశం ఇవ్వరు అని అన్నారు. ఏది ఏమైనా మా కార్యకర్తలను నేను కాపాడుకుంటానని భరోసా ఇచ్చారు.
ముషీరాబాద్ లో బిఆర్ఎస్ విజయం తథ్యం అని ముఠాగోపాల్ పేర్కొన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గ బిఆర్ ఎస్ అభ్యర్థి ముఠాగోపాల్ భారీ ర్యాలీ నిర్వహించి అట్ట హాసంగా నామినేషన్ దాఖలుచేశారు.నామినేషన్ ప్రారంభానికి ముందు ముషీరాబాద్ చౌరస్తాలోని మహంకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ ర్యాలీగా ఆయన బయలుదేరి ముషీరాబాద్ రిటర్నింగ్ కార్యాలయంలో నియోజకవర్గ ఎన్నికల అధికారి వి.లక్ష్మిణా రయణకు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మత్కడుతూ తాను చేసిన అభిరుద్దె తనను గెలిపిస్తుందన్నారు.
కంటోన్మెంట్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్య నందిత తన తండ్రి స్వర్గీయ సాయిన్న ఆశీస్సులతో ఈ రోజు కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశానని తెలిపారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దర్ వెన్నెల ఎదురు కావడంతో ఒకరికి ఒకరు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పుకున్నారు. తన తండ్రి స్వర్గీయ సాయన్న కంటోన్మెంట్ ప్రజలకు తన జీవితంని త్యాగం చేశారని తెలిపారు. ఆయన ను ఆశీర్వదించిన విధంగానే కంటోన్మెంట్ ప్రజలు నన్ను కూడా ఆశీర్వదించి ఈ ఎలక్షన్ లలో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నానన్నారు.