పలమనేరు ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉన్న కరెంటు ఫోల్ను కర్ణాటక ఆర్టీసీ బస్సు. ఢీకొని రంగబాబు వరకు ఈడ్చుకొని వెళ్లిన వైనం, ఆ సమయానికి అక్కడ ప్రజలు ఎవరు లేకపోవడంతో తప్పిన ప్రమాదం, సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది వెంటనే నష్ట నివారణ చేపట్టి కరెంటును పునరుద్ధరించారు, ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
bus accident
చిల్లకూరు వరగలి క్రాస్ రోడ్ సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, ముగ్గురికి గాయాలు. శబరిమలై నుండి నెల్లూరు వైపు వెళ్తున్న టెంపో ముందు వెళ్తున్న ఆటోను డీ కొట్టడంతో జరిగిన ప్రమాదం. ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలకు తీవ్ర గాయాలు గూడూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న చిల్లకూరు పోలీసులు….
నల్లగొండ బైపాస్ లో ట్రావెల్స్ బస్సు దగ్ధం. ఘటనలో మంటల్లో ఓ ప్రయాణికుడు దుర్మరణం. పట్టణ సమీపంలోని నార్కెట్పల్లి-అద్దంకి హైవేపై.. అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ తో ట్రావెల్స్ బస్సు దగ్ధం. హైదరాబాద్ నుంచి చీరాల వైపు 38 మంది ప్రయాణికులతో బయలుదేరిన ట్రావెల్స్ బస్సు. ఏసీ డెమో నుంచి మంటలు రావడంతో బస్సును నిలిపేసి. ప్రయాణికులను దింపిన డ్రైవర్. నిమిషాల్లోనే దగ్ధమైన ట్రావెల్స్ బస్సు.
సుండుపల్లి మండలం బెస్తపల్లి దగ్గర ఆగి ఉన్న ద్విచక్ర వాహన దారుడు రామచంద్ర నాయక్ ను తిరుపతి నుంచి సుండుపల్లికి వస్తున్న ఆర్టిసి బస్సు డి కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన రామచంద్ర నాయక్ ను ఆసుపత్రికి తరలించేందుకు 108 కు ఫోన్ చేసినప్పటికీ సకాలంలో సంఘటన స్థలానికి చేరుకోకలేక పొయ్యింది. మానవత స్వచ్చంద సంస్థ వారికీ చరవాణి ద్వారా సమాచారం ఇవ్వడంతో హుటా హుటిన మానవత అంబులెన్స్ చోదకుడు చంటి ప్రమాద సంఘటన స్థలానికి చేరుకొని రామచంద్ర నాయక్ ను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు వారికీ ప్రాధమిక వైద్య సేవలు అందించి మెరుగైన వైద్యం కోసం తిరుపతికి వెళ్లాలంటూ సూచించారు. ప్రమదం జరిగిందని సమాచారం ఇచ్చిన వెను వెంటనే సకాలంలో సంఘటన స్థలానికి చేరుకొని ఆసుపత్రికి చేర్పించిన మానవత సభ్యులకు, అంబులెన్స్ చోదకుడు కి వారి కుటుంబ సభ్యులు స్థానికులు ప్రసంసాభినందనలు తెలియజేశారు. గాయపడిన రామచంద్ర నాయక్ డి వాయిల్ దొడ్డి బిడికి గా పోలీసులు గుర్తించారు. సుండుపల్లి పోలీసులు జరిగిన సంఘటన పై కేసు నమోదు చేశారు.
చిత్తూరు జిల్లా, పలమనేరు నియోజకవర్గం, వి.కోట,నెర్నిపల్లి గ్రామం వద్ద కారు ఢీకొని యువకుడు మృతి, పోలీసుల కథనం మేరకు సోమవారం సాయంత్రం బైరెడ్డిపల్లి మండలం లక్కనపల్లి గ్రామానికి చెందిన రాజు కుమారుడు బాలాజీ 28ఏళ్ళు తన ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తూ కారు ఢీకొనడంతో మృతి చెందాడని, పోస్టుమార్టం కొరకు పలమనేరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
చింతపల్లి సాయిబాబా గుడి సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం. అదుపుతప్పి పెళ్లి బృందం బస్సు పల్టీ. ప్రమాదంలో మహిళ మృతి, సుమారు 20 మందికి గాయాలు,పలువురి పరిస్థితి విషమం. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు. ఘటనా స్థలంలో క్షతగాత్రుల హాహాకారాలు. క్షతగాత్రులను హైద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలింపు. గుంటూరు జిల్లా వినుకొండ నుంచి హైద్రాబాద్ లోని ఓ పెళ్లికి హాజరయ్యేందుకు వెళ్తుండగా దుర్ఘటన. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని అనుమానం.
శ్రీకాళహస్తి నుండి తిరుపతి వెళ్లే రోడ్ లో తొండమనాడు ఆర్చి వద్ద తిరుపతి నుంచి వస్తున్న ఆర్టిసి బస్సును లారీ ఢీకొట్టింది. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు, లారీ డ్రైవర్ బస్సు డ్రైవర్ స్వల్ప గాయాలు అవడంతో 108 ద్వారా శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Also..
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణం శివారు గంటా ఊరు వద్ద శనివారం ఉదయం ఎస్విఎంఎస్ బస్సు ఢీకొని ద్విచక్ర వాహనంలో పలమనేరుకు వస్తున్నటువంటి తల్లి కుమార్తెలకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108 వర్గాలకు సమాచారం అందించారు. 108 డ్రైవర్ బాబజాన్, ఈఎంటి ప్రీతి సంఘటన ప్రాంతానికి చేరుకొని గాయపడిన తల్లి కూతుర్లను పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని జిల్లెలగడ్డ గ్రామ శివారులలో రోడ్డు మరమ్మతు పనులు జరుగుతుండగా హానుమకొండ నుండి సిద్దిపేటకు వెళుతున్న సిద్దిపేట డిపో TS 36 T 7817 నెంబర్ గల బస్సు డ్రైవర్, గ్రానైట్ వెహికిల్ ని ఓవర్ టేక్ చేస్తూ అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న పొలంలోకి పడబోయింది. అందులో దాదాపు 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. అందులో కొంతమందికి స్వల్ప గాయాలు కాగా మిగతావారు సురక్షితంగా బయటపడ్డారు. దీనికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటూ ప్రయాణికులు చెప్పుకొచ్చారు ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు తెలిపారు.
తమిళనాడు కుప్పం సరిహద్దు వాణియంబాడిలో చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై ప్రభుత్వ బస్సు, ప్రైవేట్ బస్సు ఢీకొన్న ఘటనలో నలుగురు పురుషులు, ఒక మహిళ సహా 5 మంది మృతి చెందారు. 40 మందికి పైగా గాయపడ్డారు తిరుపత్తూరు జిల్లా చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై వాణియంపాడి చెట్టి అప్పనూర్ జంక్షన్ ప్రాంతంలో బెంగళూరు నుంచి చెన్నై వెళ్తున్న ప్రభుత్వ బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి ఎదురుగా చెన్నై నుంచి బెంగళూరు వస్తున్న ప్రైవేట్ లగ్జరీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రభుత్వ బస్సు డ్రైవర్, ఉలుందూర్ పేటకు చెందిన ఎవుమ్మలై, వాణియంబాడికి చెందిన మహ్మద్ బైరోస్, చిత్తూరు ప్రాంతానికి చెందిన అజిత్ కుమార్, చెన్నైకి చెందిన కృతిక అనే మహిళ సహా ఐదుగురు మరణించారు. 40 మందికి పైగా తీవ్రంగా గాయపడగా, ఇరుగుపొరుగు వారు వెంటనే వారిని రక్షించి చికిత్స నిమిత్తం వాణియంబాడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అలాగే వాణియంబాడి రూరల్ పోలీసులు ఘటనపై విచారణ చేపట్టి ప్రమాదానికి గురైన బస్సులను రోడ్డుపై నుంచి తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.
Read Also..






Total views : 147538