ప్రపంచంలోనే ఆధ్యాత్మిక రాజధానిగా పిలవబడే తిరుపతి నుంచి వైయస్సార్సీపి ఎమ్మెల్యే అభ్యర్థి, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ భూమన అభినయ రెడ్డిని తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జిగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఎమ్మెల్యే, టిటిడి బోర్డు చైర్మన్ తనయుడు గానే కాకుండా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకొని రాష్ట్రం మొత్తం తిరుపతి వైపు చూసే విధంగా గత రెండు సంవత్సరాలలో మాస్టర్ ప్లాన్ల రోడ్లతో తిరుపతిని ట్రాఫిక్ ఫ్రీ ప్రాంతంగా తీర్చిదిద్దుతూ.. తిరుపతిలోని ప్రజలకు ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా తిరుపతిని ఓ ఐటి హబ్ గా మార్చుతానని తిరుపతి వైఎస్సార్సీపీ ఇంచార్జ్ భూమన అభినయ రెడ్డి అంటున్నారు.
chittoor district news
చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ టీ ఒడ్డురు లో టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. 3వ తేదీన టీ వడ్డూరులో ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమంలో నిన్నటి రాత్రి తెలుగుదేశం బ్యానర్లు కడుతుంటే మా ఊర్లో తెలుగుదేశం జెండా ఎగరకూడదని వైసీపీ నాయకులు టిడిపి నాయకులు పైన దాడి చేసారు. వీధిలైట్లు ఆపి 50 మందిపైనే వైసిపి నాయకులు వచ్చి టిడిపి నాయకులు పైన దాడి చేసారు. స్వతంత్ర బాబు, దొరస్వామి, వినోద్, అమర, ప్రియ అనే మహిళ తల పైన తీవ్ర గాయాలయ్యాయి. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని గాయపడిన వారిని పరామర్శించి మీకు నేనున్నానని వాళ్ళకి వెన్నుదట్టి ధైర్యం చెప్పారు. వైసీపీకి పోయే కాలం వస్తేనే ఇటువంటి బుద్ధి పుడుతుందని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు.
ఏర్పేడు మండలంలోని చింతలపాలెం చెక్ పోస్ట్ వద్ద AP03BMO727 నెంబర్ గల కారు అతివేగంగా వచ్చి చెక్ పోస్ట్ ను తప్పించబోయి పక్కనే ఉన్న జనాలపైకి దూసుకుని వెళ్ళింది. అక్కడే ఉన్న చింతలపాలెంకు చెందిన మురళి మరియు హరి అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అప్పటికి కారు ఆగకుండా పక్కనే ఉన్న వేపచెట్టుని గుద్దడంతో చెట్టు విరిగిపోయి ఓ దుకాణాన్ని తోసి వేసింది. పక్కనే ఉన్న వ్యక్తులు సమాచారం ఇవ్వడంతో అంబులెన్స్ హుటాహుటిన క్షతగాత్రులను ఏరియా ఆసుపత్రికి తరలించింది.
6.47 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం…సంతృప్తికరంగా దర్శించుకున్న భక్తులు
ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని డిసెంబరు 23 నుండి 2024 జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు 6.47 లక్షల మంది భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కల్పించామని టీటీడీ ఈవో ఎ వి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం ఈవో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారికి నిర్దేశించిన సమయంలోనే సంతృప్తికరంగా స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం కల్పించామన్నారు. దర్శించుకున్న భక్తులతోపాటు అన్నప్రసాదాలు స్వీకరించిన భక్తుల సంఖ్య గతం కంటే పెరిగిందని చెప్పారు. భక్తులు క్యూలైన్లలో చలికి ఇబ్బందులు పడుతూ ఎక్కువ సమయం వేచి ఉండడాన్ని నివారించేందుకు టైంస్లాట్ టోకెన్లు జారీ చేశామన్నారు. 10 రోజులకు కలిపి విఐపి బ్రేక్ దర్శనానికి సంబంధించి మొత్తం 19,255 టికెట్లు జారీ చేశామని, 18,578 మంది హాజరుకాగా, 677 మంది(3.3 శాతం) గైర్హాజరయ్యారని తెలిపారు. దాతలకు బ్రేక్ దర్శనానికి సంబంధించి ఆన్లైన్లో మొత్తం 6,858 టికెట్లు బుక్ చేసుకున్నారని, 6,388 మంది హాజరుకాగా, 470 మంది(7 శాతం) గైర్హాజరయ్యారని వివరించారు. శ్రీవాణి దాతలకు మొత్తం 20 వేల ఎస్ఇడి టికెట్లు జారీ చేశామని, 19,083 మంది హాజరుకాగా, 917 మంది(4.5 శాతం) గైర్హాజరయ్యారని తెలియజేశారు. రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి మొత్తం 2.25 లక్షల టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకున్నారని, 1,97,524 మంది హాజరుకాగా, 27,476 మంది(12.2 శాతం) గైర్హాజరయ్యారని తెలిపారు. సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు మొత్తం 4.23 లక్షలు మంజూరు చేశామని, 3,24,102 మంది హాజరుకాగా, 90,850 మంది(21.5 శాతం) గైర్హాజరయ్యారని వెల్లడించారు. అదేవిధంగా, ఈ పది రోజులకు కలిపి రూ.40.20 కోట్లు హుండీ కానుకలు అందాయని, 17.81 లక్షల మంది అన్నప్రసాదాలు, 35.60 లక్షల మంది లడ్డూ ప్రసాదాలు స్వీకరించారని, 2.14 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని ఈవో తెలియజేశారు. అలిపిరి పాదాల మండపం వద్దగల రాతిమండపం కూలిపోయే స్థితికి చేరుకుందని, దీని పునర్నిర్మాణానికి సంబంధించి భారత పురావస్తు శాఖకు పలుమార్లు లేఖలు రాసినా స్పందన లేదని తెలిపారు. నందలూరులోని శ్రీ సౌమ్యనాథస్వామివారి ఆలయ గోడ కూలిందని, దీనికి సంబంధించి పురావస్తు శాఖకు లేఖలు రాసినా స్పందించడం లేదని చెప్పారు. రాతిమండపాలు, ఆలయాల పునర్నిర్మాణానికి సంబంధించి టీటీడీలో ప్రత్యేకంగా ఆలయ నిర్మాణ విభాగం ఉందని, ఇక్కడ నిపుణులైన స్థపతులు ఉన్నారని వివరించారు. ఎస్వీ శిల్ప కళాశాల ఆధ్వర్యంలో ఎంతో మంది నిపుణులను తయారవుతున్నారని, వీరు విగ్రహాల తయారీతోపాటు, చక్కగా ఆలయాలు నిర్మించగలరని తెలియజేశారు. ఇటీవల జమ్మూకాశ్మీర్, వైజాగ్, హైదరాబాద్, ఒడిశా, కన్యాకుమారి, సీతంపేట, రంపచోడవరం ప్రాంతాల్లో అత్యంత సుందరంగా రాతి కట్టడంతో ఆలయాలు నిర్మించామని వెల్లడించారు. అలిపిరి నడకమార్గంలో ఏర్పాటుచేసిన ట్రాప్ కెమెరాల ద్వారా చిరుత, ఎలుగుబంటి సంచారాన్ని గుర్తించినపుడు వెంటనే భక్తులను అప్రమత్తం చేసి తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్ర అటవీశాఖకు రూ.3.5 కోట్లు అందించామని, దీంతో అత్యాధునిక ట్రాప్ కెమెరాల కొనుగోలుతో పాటు ఇతర చర్యలు చేపడతారని చెప్పారు.
చిత్తూరు జిల్లా పుంగనూరు లో వరకట్నం వేధింపులు తాళ లేక భర్త పై భార్య ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని ఏఆర్ కానిస్టేబుల్ భార్య విజయ కుమారి (28) ఆవేదన వ్యక్తం చేసింది. అనంతరం తనకు న్యాయం చేయాలని అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన చేపట్టింది. చౌడేపల్లి సర్కిల్లో గల సదుం పోలీస్ స్టేషన్లో ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న టి. గిరిబాబు కు 2017 సంవత్సరంలో తనతో వివాహం జరిగిందని విజయ కుమారి తన దగ్గర ఉన్న మ్యారేజ్ సర్టిఫికెట్ ను చూపించింది. గిరిబాబు ఈ మధ్యనే అన్లైన్లో లక్షల రూపాయల డబ్బును పోగొట్టుకోన్నట్లు, దాని కారణంతోనే తనను పుట్టింట నుండి వరకట్నం తేవాలని వేధింపులకు గురి చేస్తున్నాడని విజయ కుమారి ఆరోపించింది. డబ్బుకోసం ఇంకో యువతిని వివాహం చేసుకోవటానికి సిద్దపడ్డాడని, రెండు రోజుల క్రితం సదుంలోని ఓ గుడిలో రెండో వివాహం చేసుకున్నాడని ఆవిడ ఆరోపించింది. ఈ ఘటన పై పుంగనూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసారు.
cvr, ఇమేజ్ గ్రూప్స్ చైర్మన్ సివి రావు, ఉషారాణి దంపతులు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు పూర్ణ కుంభ స్వాగతం పలికి దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మరియు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురైన నాగరాజు (28) అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఆదివారం ఉదయం వాల్మీకిపురం లో చోటుచేసుకుంది. మండలంలోని హత్యాపురం గ్రామానికి చెందిన నాగరాజు స్థానిక లైన్మెన్ వద్ద అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. ఆదివారం ఉదయం పట్టణ పొలిమేర లోని శివాలయం వద్ద ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురయ్యాడు. అతని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
గురువారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎస్వీ భట్ తన కుటుంబ సభ్యులతో కలిసి చౌడేపల్లిలోని శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభ స్వాగతం పలికి పూజలు నిర్వహించి ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు న్యాయమూర్తి కార్తీక్, ఆలయ మాజీ చైర్మన్లు కెవి రాజన్న, చెన్నరాజు శెట్టి పాల్గొన్నారు.
ఒకప్పుడు చౌడేపల్లి నివసిస్తులైన న్యాయమూర్తి గ్రామస్తులను సన్నిహితులను పేరుపేరునా పలకరించారు. ఉదయం చౌడేపల్లి చెడుగుట్లపల్లి రోడ్డు నందు తమ పూర్వీకులు ప్రతిష్టించిన నాగదేవతల ఆలయంలో అభిషేకాలు పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
అంగన్వాడీలకు అండగా నేనున్నా అని జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ సంఘీభావం తెలిపారు. అంగన్వాడీ వర్కర్లల న్యాయమైన డిమాండ్ లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ డిమాండ్ చేశారు. గురువారం రాజంపేట పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట సిఐటియు, ఏ ఐ టి యు సి ఆధ్వర్యంలో పదవ రోజు అంగన్వాడి వర్కర్లు, ఆయాలు వారి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని నిర్వహిస్తున్న సమ్మెకు జనసేన పార్టీ సంఘీభావం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ మలిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ జనసేన పార్టీ ఎప్పుడు అంగన్వాడీ కార్యకర్తలకు అండగా ఉంటుందన్నారు. పది రోజులుగా అంగన్వాడి వర్కర్లు సమ్మె నిర్వహిస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోవడం దారుణం అని అన్నారు. వారికి కనీస వేతనం 26,000 ప్రభుత్వం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
2019 ఎన్నికల సమయంలో అంగన్వాడీలకు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు జీతాలు పెంచుతానని హామీ ఇచ్చి ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుండి ఇప్పటివరకు జీతాలు పెంచకపోవడమే కాక అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు వారి న్యాయమైన సమస్యల కోసం సమ్మె నిర్వహిస్తుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని అన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మొన్న జరిగిన బహిరంగ సభలో టిడిపి జనసేన పార్టీ 2024లో ఉమ్మడిగా ప్రభుత్వం చేపడుతుందని చేపట్టిన వెంటనే అంగన్వాడీల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పడం జరిగిందన్నారు. అంతేకాదు లోకల్ గా మీకు ఏ సమస్య వచ్చినా కూడా నేను ముందు ఉంటాను, నాకు మీ సమస్యను వెంటనే తెలియజేయండి అని మలిశెట్టి వెంకటరమణ అన్నారు. రాబోవు 2024 ఎన్నికలలో ప్రజలందరూ తగిన బుద్ధి చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తారు. ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి మాట తప్పను మడమ తిప్పను అన్న నినాదం చేసి ప్రతి సంస్థల ఉద్యోగులను ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. గత ఎన్నికల ముందు ఎన్నో చెప్పారు ఏ ఒక్క సమస్య పరిష్కరించడంలో విఫలమైందని ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగున్నర సంవత్సరాల పాలనలో దోచుకోవడం దాచుకోవడం తప్ప అభివృద్ధి శూన్యమని మలిశెట్టి వెంకటరమణ ఎద్దేవాచేశారు. రాష్ట్రంలోని ఉద్యోగస్తులందరికీ ఎన్నో హామీలు ఇచ్చి మాట తప్పిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు, జనసేన నాయకులు, ఆయాలు, తదితరులు పాల్గొన్నారు.
చేనేత కార్మికులను ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు అన్ని విధాలుగా వారికి సహకారం అందిస్తూ .. చేనేత కార్మికులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణారెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక తిరుచానూరు శిల్పారామంలో రాష్ట్ర చేనేత వస్త్ర ప్రదర్శన – 2023 కార్యక్రమంను జ్యోతి ప్రజ్వలన చేసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. చేనేత కార్మికులు ఆర్థికంగా సామాజికంగా ఎదిగేందుకు అన్ని విధాలా సహకారం అందిస్తూ వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. వారి కష్టాలను గుర్తించి తోడ్పాటును అందించేలా వారు తయారు చేసిన ఉత్పత్తులను ప్రతి ఒక్కరు కొనుగోలు చేయాలని అన్నారు. చేనేత కార్మికులు తయారుచేసిన నాణ్యమైన అన్ని రకాల వస్త్రాలు ఆరోగ్యకరమైనవి ఎలాంటి హానికర పదార్థాలు వాడరని తెలిపారు. అన్ని సీజన్లోనూ లో ప్రతి ఒక్కరు ధరించేలా తయారు చేయడం జరుగుతుందని తెలిపారు. అన్ని రకాల వెరైటీలు చాలా తక్కువ రేటుతో ఇక్కడ ప్రదర్శన నిర్వహించడం జరిగిందని అన్నారు. చేనేత కార్మికులు సొంత మగ్గాలు ద్వారా తయారుచేసిన నాణ్యమైన మరియు వైవిద్యమైన ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం కొరకు సుమారు 120 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ ఎగ్జిబిషన్ నందు ధర్మవరం, వెంకటగిరి, శ్రీకాళహస్తి, ఉప్పాడ, నారాయణవరం, మంగళగిరి, చీరాల, మాధవరం , హ్యాండి క్రాఫ్ట్, బెడ్ షీట్స్ వంటివి అందుబాటులో ఉంచడం జరిగిందని పండుగలు సందర్భంగా తిరుపతి ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ రాజారావు మాట్లాడుతూ.. రాష్ట్ర చేనేత వస్త్ర ప్రదర్శన నేటి నుండి జనవరి 2 వరకు 14 రోజులు నిర్వహించనున్నారని దాదాపు అన్ని జిల్లాల నుంచి ఉత్పత్తి అయినటువంటి చేనేత రకాలు అందుబాటులో కలవని తెలిపారు. ఉత్పత్తి ధరలకే నేరుగా చేనేత కళాకారుల దగ్గర నుంచి కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం వారి సహకారంతో ఏర్పాటుచేసిన ఈ ప్రదర్శనను తిరుపతి పుర ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ ఎ డి పిచ్చెశ్వర రావు, డెవలప్మెంట్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.




Total views : 89955