ఏ.కొండూరు మండలం గోపాలపురం గ్రామానికి చెందిన ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు అజ్మీరా ప్రసాద్ నాయక్ ఆదివారంనాడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. విజయవాడలో ఒక ప్రయివేటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు. తన చావుకు గ్రామంలోని తిరుపతి భూలక్ష్మి,భూక్య త్రిపుర,ఏ.కొండూరు ఎస్సై కారణం అంటూ సెల్ఫీ వీడియో తీసుకొని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు అజ్మీరా ప్రసాద్ నాయక్. మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ హాస్పిటల్ ఉన్నది . తనని వేదీస్తున్నాడు అంటూ ఏ.కొండూరు పోలీసు స్టేషన్లో తిరుపతి భూలక్ష్మీ, అజ్మీరా ప్రసాద్ నాయక్ పై ఆదివారం ఉదయం FIR నమోదు కావడంతో కేసు ఈ సంఘటన జరగటానికి ప్రధాన కారణం.
Crime
గత రెండు రోజుల క్రితం తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం బత్తల వల్ల గ్రామంలో భార్య పావనిను అతి కిరాతకంగా నరికి చంపిన భర్త కాటయ్య ను అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా సిఐ శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ దాదాపు 8 సంవత్సరాల క్రితం శ్రీ సిటీలోని ఓ మొబైల్ కంపెనీలో పని చేస్తున్న కాటయ్యకు అదే కంపెనీలో పనిచేస్తున్న పావని పరిచయం అవ్వడంతో ప్రేమించి పెద్దలను ఎదిరించి సూళ్లూరుపేటలోని చంగాలమ్మ గుడిలో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వారిద్దరికీ ఒక కొడుకు ఒక కుమార్తె కూడా ఉన్నారు. కాటయ్య మందు తాగడం మరియు ఇతర చెడు అలవాట్లకు బానిసై పెళ్లి అయిన తరువాత పరిశ్రమకు పోకుండా పని నిలిచిపోయి భార్యను కూడా ఉద్యోగానికి పోకుండా ఆపేశాడు. కాటయ్య తన వ్యసనాల కోసం అప్పుడప్పుడు కూలి పనులకు వెళ్తూ అతని అలవాట్లకి ఇంటి ఖర్చులకు డబ్బులు సరిపోక అతని భార్యని కొట్టి వాళ్ళు పుట్టింటి నుండి డబ్బులు తీసుకొని రమ్మని వేధించేవాడని ఈ చిత్రహింసలు భరించలేక తన గోడును తల్లిదండ్రులకు చెప్పుకొని అప్పుడప్పుడు అక్కడ నుండి డబ్బులు తీసుకువచ్చి జీవనాన్ని సాగిస్తున్నారు. ఈ మధ్యకాలంలో భార్యపై భర్తకు అనుమానం పెరగడంతో తీవ్రంగా మానసికంగా హింసించేవాడని గత నాలుగు నెలల క్రితం తనకు డబ్బు చాలా అత్యవసరమని మీ తల్లి తండ్రి వద్దకు వెళ్లి డబ్బులు తీసుకొని రమ్మని ఒత్తిడి చేయడంతో పావని ససేమిరా అనడంతో తీవ్రంగా తలకు గాయపరిచి వేధించిన విషయం పావని తల్లిదండ్రులకు తెలిసి వారు తమ ఇంటికి తీసుకుని వెళ్లి చికిత్స చేసి అల్లుడు కాటయ్య ను పిలిచి పదివేల రూపాయలు ఇచ్చి తమ కూతురిని వేధించవద్దని చెప్పి పంపించారు. విపరీతంగా అనుమానం పెరగడంతో రెండు రోజుల క్రితం సూళ్లూరుపేట నుంచి తెచ్చుకున్న కత్తితో పావని అతి కిరాతకంగా నరికి చంపేశాడు. హత్య చేసిన తరువాత హత్యకు వాడిన రెండు కత్తులు పక్కనే ఉన్న చెరువులో పడవేసి సూళ్లూరుపేట కు పారిపోయాడని అతన్ని ఈరోజు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
Read Also..
నర్సాపూర్ మండలం కొండాపూర్ అడవి ప్రాంతంలో ఓ వ్యక్తి మృత దేహం వెలుగులోకి వచ్చింది. మృతుడు హైదరాబాద్ బోరబండకు చెందిన నోమన్ గా పోలీసులు గుర్తించారు. ఫారుక్ నేనే హత్య చేశానని పోలీసులకు లొంగిపోయాడు. బోరబండలో గొడవపడి నోమన్ ను చంపాలనే ఉద్దేశంతో తీసుకువచ్చి హత్య చేసినట్లు ఫారుక్ పోలీసులతో ఒప్పుకున్నాడు. ఈ కేసు పై పూర్తిస్థాయిలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లి కొత్త ఇండ్లలో కాపురము ఉంటున్న భవన కార్మికుని పై కొందరు యువకులు ఘాతుకానికి వడిగట్టారు. పట్టపగలే హత్యాయత్నంకు పాల్పడి, అతి దారుణంగా కొట్టి ఆపై ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించి కాల్చి చంపడానికి ప్రయత్నం చేసిన అమానుష ఘటన మంగళవారం మదనపల్లిలో జరిగింది. వివరాలు.. మదనపల్లి మండలం కొత్త ఇండ్లు రంగారెడ్డి కాలనీలో కాపురం ఉంటున్న కాకర్ల ఆంజనేయులు కుమారుడు కె ప్రవీణ్ కుమార్ (35), పవన కార్మికునిగా పని చేస్తూ భార్య పిల్లలను పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆ వీధిలో ఉంటున్న కుమార్, అంజి మరికొంతమంది ప్రవీణ్ కుమార్ తాగి వస్తే తిడుతుంటాడని ఆగ్రహంతో అంతమొందించాలని పథకం వేశారు. అనుకున్న ప్రకారమే ఊరికి సమీపంలోని ఎలకపల్లి కుంట వడ్డిపల్లి బుట్టలోకి తీసుకెళ్లి పట్టా పగలే అతి కిరాతకంగా కొట్టి నడుము కాళ్లు చేతులు విరచి పెట్రోల్ పోసి నిప్పంటించి చంపడానికి ప్రయత్నించారు. ఈ ఘాతుకానికి వడిగట్టిన నిందితులు అక్కడ నుంచి పారిపోతునడాన్ని స్థానికంగా ఉన్న కొందరు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వెంటనే ఘటనా స్థలం వద్దకు చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న ప్రవీణ్ కుమార్ ని హుటాహుటిన స్టానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి అతని పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన వైద్యం కోసం తిరుపతికి వెళ్లాలని రెఫర్ చేశారు. ఘటన సమాచారం అందుకున్న రూరల్ సీఐ సత్యనారాయణ, ఎస్సై సుధాకర్ ఆసుపత్రికి చేరుకుని బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడి ఘటన గల కారణాలపై ఆరా తీసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఓ వివాహిత దారుణ హత్యకు గురైన ఘటన తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం బత్తలవల్లంలో చోటుచేసుకుంది సత్యవేడు సీఐ శివకుమార్ రెడ్డి వివరాల మేరకు బత్తుల వల్లం హరిజనవాడకు చెందిన ఇరకం పావని (26), ఈరోజు ఉదయం తన ఇంట్లో రక్తపు మడుగులో మిగతజీవిగా పడి ఉండటం చూసిన స్థానికులు వరదయ్యపాలెం ఎస్సై నాగార్జున రెడ్డి కి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ పావని మృతదేహాన్ని పరిశీలించి వివరాలు ఆరా తీశారు,మృతురాలు పావునికి ఆమె భర్త కాటయ్యకు మధ్య గత కొంతకాలం నుంచి మాస్పర్ధలు ఉన్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలో భర్త ఆమెను హత్య చేసి ఉంటాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భర్త కాటయ్యను పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతురాలికి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నట్లు సమాచారం.
అక్రమ సంబంధాలు, వివాహేతర బంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చుపెడుతున్నాయి. ఓ యువకుడు వివాహితతో అక్రమసంబంధం పెట్టుకుని ఆమె ఇంట్లోనే అనుమానాస్పద రీతితో మృతిచెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో వెలుగుచూసింది. వట్టిచెరుకూరు లో ఓయువకుడు అనుమానాస్పద స్ధితిలో మృతిచెందాడు. అయ్యన్నకుంటిపల్లెకి చెందిన గేరా సందీప్ గ్రామంలోని పరమేశ్వర సాయి అనే వ్యక్తి ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఈ యువకుడు వివాహితతో అక్రమసంబంధం పెట్టుకున్నాడు. వివాహితతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడటంతో తీవ్ర ఆందోళనకు గురయిన సందీప్ అదే ఇంట్లో సూసైడ్ చేసుకున్నాడు. తలుపులు తెరిచి చూసేసరికి సందీప్ ప్రాణాలు కోల్పోయి కనిపించాడు. అయితే సందీప్ ది ఆత్మహత్య కాదు… హత్య చేసారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పల్నాడు జిల్లా , గురజాల మండలం ,జంగమహేశ్వరపురం గ్రామంలో జరిగిన కృష్ణారెడ్డి హత్య కేసులో మాజీ ఎమ్మెల్యే యరపతినేని స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈసందర్బంగా యరపతినేని మాట్లాడుతూ..మహేష్ రెడ్డి మాటలు దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఉన్నాయని మండిపడ్డారు. 2019లో వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 11 మంది చనిపోయారని, కాసు మహేష్ రెడ్డి చేసే అక్రమ మైనింగ్ వల్ల ఎనిమిది మంది చిన్నారులు చనిపోయారని అన్నారు. మహేష్ రెడ్డి ఓటమి అంచున ఉన్నారని రాబోయే ఎన్నికలలో తనను ఢీకొనలేకనే తప్పుడు కేసులు బనాయించాలని చూస్తున్నారని అన్నారు.
ప్రవల్లిక ఆత్మహత్య కేసులో నిందితుడు శివరామ్ రాథోడ్‌కు నాంపల్లి కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. రూ.5 వేల వ్యక్తిగత పూచీకత్తుపై కోర్టు బెయిల్ ఇస్తూ ఆదేశాలిచ్చింది. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం నిందితుడిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన కోర్టు.. ప్రవల్లిక ఆత్మహత్య కేసులో శివరామ్ పాత్రపై సరైన ఆధారాలు లేవంటూ బెయిల్ మంజూరు చేసింది.వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజిపల్లికి చెందిన ప్రవల్లిక టీఎస్పీఎస్సీ గ్రూప్స్ పరీక్షలకు సిద్ధం కావడానికి నగరానికి వచ్చి అశోక్‌నగర్‌లోని బృందావన్ హాస్టల్లో ఉంటోంది. గతవారం ఆమె హాస్టల్ గదిలోనే ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఉదంతంపై ఐసీపీలోని 417, 420, 306 సెక్షన్లు జోడిస్తూ శివరామ్‌ను నిందితుడిగా చేర్చారు.శివరామ్ శుక్రవారం నాంపల్లి కోర్టులో తన న్యాయవాది ద్వారా సరెండర్ పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. కోర్టు అనుమతించడంతో లొంగిపోయాడు. అయితే, ఈ కేసుపై శనివారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. శివరామ్ పాత్రపై సరైన ఆధారాలు లేవంటూ బెయిల్ మంజూరు చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రవళిక ఆత్మహత్య కేసులో నిందితుడు శివరాం రాథోడ్ నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. వరంగల్ జిల్లా బిక్కాజిపల్లికి చెందిన ప్రవళిక హైదరాబాద్ చిక్కడపల్లిలోని హాస్టల్ గదిలో ఈ నెల 13న బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనపై విద్యార్థులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆందోళనలకు దిగారు. గ్రూప్స్ పరీక్షల వాయిదా కారణంగా మానసిక ఒత్తిడితో ఆమె చనిపోయిందంటూ ఆరోపించారు. ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. శివరాం రాథోడ్ వ్యవహారం వెలుగుచూసింది. మృతురాలి సెల్‌ఫోన్ డేటాను పరిశీలించిన దర్యాప్తు అధికారులు ఆమెతో శివరాం చేసిన వాట్సప్ సందేశాలను గుర్తించారు. దీంతో అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే శివరాం నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు.






Total views : 90621