హైడ్రా అంశంపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. ఇదే సమయంలో ఏపీలో బుడమేరులో ఆక్రమణల వల్ల కాలనీలు మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ హైడ్రా అంశంపై స్పందించారు. ఆయన కాకినాడ జిల్లాలోని గొల్లప్రోలు ప్రాంతంలో పర్యటించారు. చెరువుల ఆక్రమణలు కొందరు తెలిసి చేయవచ్చు లేదా మరికొందరు తెలియక చేయవచ్చునని హైడ్రాను ఉద్దేశించి పవన్ కల్యాణ్ అన్నారు. అయితే పునరావాసం కల్పించిన తర్వాతే చర్యలు చేపట్టాలన్నారు. బాధితుల సమస్యలు, ఇబ్బందులు తెలుసుకున్న తర్వాత. ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చి ఆ తర్వాత ముందుకు వెళ్లాలనేది తన వ్యక్తిగత అభిప్రాయం అన్నారు. ఇదే విషయాన్ని తాను సీఎం దృష్టికి తీసుకువెళతానన్నారు.బుడమేరులో ఆక్రమణకు పాల్పడిన వారితో మాట్లాడాలని అయన అభిప్రాయపడ్డారు. ఆక్రమణ స్థలం అని తెలియక కొన్నవారు కూడా ఉండి ఉంటారన్నారు. అందరితో మాట్లాడి చర్యలు తీసుకుంటే బావుంటుందన్నారు. నదులు, వాగుల ప్రాంతాల్లోని కట్టడాలపై ప్రజల్లో చైతన్యం రావాల్సి ఉందన్నారు. సుద్దగుడ్డ వాగుపై మాట్లాడుతూ, ఈ వాగు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్.పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన “ఎస్ ఆర్ కళ్యాణమండపం” డైరెక్టర్ శ్రీధర్ గాదె, శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్ ప్రొడక్షన్ నెం.3 సినిమా “ఎస్ఆర్ కళ్యాణమండపం” చిత్రంతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించి దర్శకుడిగా ప్రతిభ చాటుకున్న డైరెక్టర్ శ్రీధర్…
- “15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.“15 ఏళ్ల నా కల నెరవేరింది.. నా బిడ్డలా చూసుకున్నా..” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్ తెలుగు ప్రేక్షకులను అలరించేలా విభిన్నమైన, ఆసక్తికరమైన కథాంశాలతో ముందుకు సాగుతున్న జీ5 మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. అదే ‘పంచనామా’ సిరీస్.…
- హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్. విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై ఏగన్ హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘హైకూ’. ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ రొమాంటిక్ హీరో హరీష్ కళ్యాణ్ రిలీజ్ చేశారు. కలర్‌ఫుల్ విజువల్స్,…
- ఘనంగా “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.ఈ నెల 18న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ వివిఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై, ఖాన్ దురాని, సాహితి ఆవంచ హీరో హీరోయిన్స్ గా రవి లోకిరెడ్డి డైరెక్షన్ లో పైలా ప్రసాద్ రావు,…
- ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.బానోత్ పవన్, గౌతమ్, నర్మద, సతీష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “ఐ బొమ్మ”. ఈ చిత్రాన్ని శ్రీ మల్లన్న క్రియేషన్స్ బ్యానర్ పై కురువ జమన్న నిర్మిస్తున్నారు. విజయ్ రఘునాథభట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా త్వరలో వరల్డ్ వైడ్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి