Monday, September 14, 2026
News Navigation
Monday, September 14, 2026
News Navigation

Breaking

Monday, September 14, 2026
Home Andhra Pradesh హైడ్రాకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు

హైడ్రాకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు

by Satya
హైడ్రాకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు

హైడ్రా అంశంపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. ఇదే సమయంలో ఏపీలో బుడమేరులో ఆక్రమణల వల్ల కాలనీలు మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ హైడ్రా అంశంపై స్పందించారు. ఆయన కాకినాడ జిల్లాలోని గొల్లప్రోలు ప్రాంతంలో పర్యటించారు. చెరువుల ఆక్రమణలు కొందరు తెలిసి చేయవచ్చు లేదా మరికొందరు తెలియక చేయవచ్చునని హైడ్రాను ఉద్దేశించి పవన్ కల్యాణ్ అన్నారు. అయితే పునరావాసం కల్పించిన తర్వాతే చర్యలు చేపట్టాలన్నారు. బాధితుల సమస్యలు, ఇబ్బందులు తెలుసుకున్న తర్వాత. ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చి ఆ తర్వాత ముందుకు వెళ్లాలనేది తన వ్యక్తిగత అభిప్రాయం అన్నారు. ఇదే విషయాన్ని తాను సీఎం దృష్టికి తీసుకువెళతానన్నారు.బుడమేరులో ఆక్రమణకు పాల్పడిన వారితో మాట్లాడాలని అయన అభిప్రాయపడ్డారు. ఆక్రమణ స్థలం అని తెలియక కొన్నవారు కూడా ఉండి ఉంటారన్నారు. అందరితో మాట్లాడి చర్యలు తీసుకుంటే బావుంటుందన్నారు. నదులు, వాగుల ప్రాంతాల్లోని కట్టడాలపై ప్రజల్లో చైతన్యం రావాల్సి ఉందన్నారు. సుద్దగుడ్డ వాగుపై మాట్లాడుతూ, ఈ వాగు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.
    హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సేవలను సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా.. రోశయ్య మాత్రం తన ప్రత్యేకతను…
  • ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..
    ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్.. యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌‌లో హీరో సూరి మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్.. ‘మండాడి’ యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌‌లో హీరో సుహాస్ ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్…
  • నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.
    ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
  • మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.
    బ్రిక్స్ ఇండియా 2026 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్య కీలక ద్వైపాక్షిక భేటీ జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో భారత్‌–మలేషియా సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.…
  • ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.
    ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌ పర్యటనకు రానున్నారు. గాల్వాన్ వ్యాలీ ఘటన తర్వాత తొలిసారిగా భారత్‌కు వస్తున్న జిన్‌పింగ్‌ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్న జిన్‌పింగ్‌తో పాటు…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: