ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని డిసెంబరు 23 నుండి 2024 జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు 6.47 లక్షల మంది భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కల్పించామని టీటీడీ ఈవో ఎ వి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం ఈవో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారికి నిర్దేశించిన సమయంలోనే సంతృప్తికరంగా స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం కల్పించామన్నారు. దర్శించుకున్న భక్తులతోపాటు అన్నప్రసాదాలు స్వీకరించిన భక్తుల సంఖ్య గతం కంటే పెరిగిందని చెప్పారు. భక్తులు క్యూలైన్లలో చలికి ఇబ్బందులు పడుతూ ఎక్కువ సమయం వేచి ఉండడాన్ని నివారించేందుకు టైంస్లాట్ టోకెన్లు జారీ చేశామన్నారు. 10 రోజులకు కలిపి విఐపి బ్రేక్ దర్శనానికి సంబంధించి మొత్తం 19,255 టికెట్లు జారీ చేశామని, 18,578 మంది హాజరుకాగా, 677 మంది(3.3 శాతం) గైర్హాజరయ్యారని తెలిపారు. దాతలకు బ్రేక్ దర్శనానికి సంబంధించి ఆన్లైన్లో మొత్తం 6,858 టికెట్లు బుక్ చేసుకున్నారని, 6,388 మంది హాజరుకాగా, 470 మంది(7 శాతం) గైర్హాజరయ్యారని వివరించారు. శ్రీవాణి దాతలకు మొత్తం 20 వేల ఎస్ఇడి టికెట్లు జారీ చేశామని, 19,083 మంది హాజరుకాగా, 917 మంది(4.5 శాతం) గైర్హాజరయ్యారని తెలియజేశారు. రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి మొత్తం 2.25 లక్షల టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకున్నారని, 1,97,524 మంది హాజరుకాగా, 27,476 మంది(12.2 శాతం) గైర్హాజరయ్యారని తెలిపారు. సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు మొత్తం 4.23 లక్షలు మంజూరు చేశామని, 3,24,102 మంది హాజరుకాగా, 90,850 మంది(21.5 శాతం) గైర్హాజరయ్యారని వెల్లడించారు. అదేవిధంగా, ఈ పది రోజులకు కలిపి రూ.40.20 కోట్లు హుండీ కానుకలు అందాయని, 17.81 లక్షల మంది అన్నప్రసాదాలు, 35.60 లక్షల మంది లడ్డూ ప్రసాదాలు స్వీకరించారని, 2.14 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని ఈవో తెలియజేశారు. అలిపిరి పాదాల మండపం వద్దగల రాతిమండపం కూలిపోయే స్థితికి చేరుకుందని, దీని పునర్నిర్మాణానికి సంబంధించి భారత పురావస్తు శాఖకు పలుమార్లు లేఖలు రాసినా స్పందన లేదని తెలిపారు. నందలూరులోని శ్రీ సౌమ్యనాథస్వామివారి ఆలయ గోడ కూలిందని, దీనికి సంబంధించి పురావస్తు శాఖకు లేఖలు రాసినా స్పందించడం లేదని చెప్పారు. రాతిమండపాలు, ఆలయాల పునర్నిర్మాణానికి సంబంధించి టీటీడీలో ప్రత్యేకంగా ఆలయ నిర్మాణ విభాగం ఉందని, ఇక్కడ నిపుణులైన స్థపతులు ఉన్నారని వివరించారు. ఎస్వీ శిల్ప కళాశాల ఆధ్వర్యంలో ఎంతో మంది నిపుణులను తయారవుతున్నారని, వీరు విగ్రహాల తయారీతోపాటు, చక్కగా ఆలయాలు నిర్మించగలరని తెలియజేశారు. ఇటీవల జమ్మూకాశ్మీర్, వైజాగ్, హైదరాబాద్, ఒడిశా, కన్యాకుమారి, సీతంపేట, రంపచోడవరం ప్రాంతాల్లో అత్యంత సుందరంగా రాతి కట్టడంతో ఆలయాలు నిర్మించామని వెల్లడించారు. అలిపిరి నడకమార్గంలో ఏర్పాటుచేసిన ట్రాప్ కెమెరాల ద్వారా చిరుత, ఎలుగుబంటి సంచారాన్ని గుర్తించినపుడు వెంటనే భక్తులను అప్రమత్తం చేసి తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్ర అటవీశాఖకు రూ.3.5 కోట్లు అందించామని, దీంతో అత్యాధునిక ట్రాప్ కెమెరాల కొనుగోలుతో పాటు ఇతర చర్యలు చేపడతారని చెప్పారు.
devotional news
హనుమాన్ మహా పరాక్రమవంతుడు, అపజయమే ఎరుగనివాడు. శత్రువులను సంహరించడంలోను భక్తులకు అభయమివ్వడంలోను ఆయన ఎంత మాత్రం వెనుకాడడు. ఆయన పేరు వింటేనే భూత ప్రేత పిశాచాలు కంటికి కనిపించనంత దూరం పారిపోతాయి. అంతటి శక్తిమంతుడైన ఆంజనేయుడు అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించి భక్తజనులను అనుగ్రహిస్తున్నాడు. అలా ఆవిర్భవించిన ఆలయమే శ్రీ తాడ్ బండ్ వీరాంజనేయ ఆలయం. తాడ్ బండ్ వీరాంజనేయ స్వామి భాగ్యనగరంలో ఏటా నిర్వహించే హనూమాన్ జయంతి వేడుకల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. స్వామివారి సేవలతో మొదలయ్యే ఈ వేడుకలు శోభాయత్రతో ఘనంగా ముగుస్తాయి. ఏటా చైత్ర పౌర్ణమి రోజున హనుమాన్ , వైశాఖ బహుళ దశమినాడు జయంతిని ఘనంగా నిర్వహిస్తారు. లక్షలాది దీక్షాపరులు, భక్తులు స్వామివారిని దర్శించుకొని తరిస్తారు. తాడ్ బండ్ వీరాంజనేయ స్వామి త్రేతాయుగంలోనే ఇక్కడ స్వామి స్వయంభువుగా ఆవిర్భవించినట్టు స్థలపురాణం చెబుతోంది. జాబాలి మహర్షి తపస్సుకు మెచ్చిన ఆంజనేయుడు ఇక్కడ స్వయంభువుగా ఆవిర్భవించినట్టు చెబుతారు. 19 శతాబ్దం తొలినాళ్లలో ఓ భక్తుడికి ఆంజనేయుడు కలలో కనిపించి తన జాడను తెలియజేయడంతో, అప్పుడా భక్తుడు ఈ ప్రాంతవాసుల సహాయసహకారాలతో, నూతన ఆలయంలో స్వామికి పునఃప్రతిష్ఠ జరిపాడు. ఆనాటి నుంచి స్వామికి నిత్యపూజలు జరుగుతూ వస్తున్నాయి. మరి ఈ ఆలయ విశేషాలేంటో ఒకసారి తెలుసుకుందాం. తాడ్ బండ్ వీరాంజనేయ స్వామితాడ్ బండ్ ప్రాంతంలో నెలకొన్న శ్రీ వీరాంజనేయస్వామి దేవాలయం స్వయంభువుడని ప్రతీతి. మొగలులు, రాజపుత్రులు, కుతుబ్ షాహీలు ఈ దేవాలయం కోసం కొన్ని అభివృద్ధి పనులు చేసినట్లు చెబుతుంటారు. ఇక్కడ ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే హనూమాన్ వైవాహిక జీవితానికి సంబంధించిన విశేషాలు శిలాఫలకంపై ఉంటుంది. నవ వ్యాకరణంలో చివరి నాలుగు అంకాలను పూర్తి చేయాలంటే ఖచ్ఛితంగా గృహస్తుడై ఉండాలని, ఇందుకోసం తన కమార్తె సువర్చలను వివాహం చేసుకోవాలని స్వామివారికి గురువైన సూర్యుడు సూచిస్తాడు. ఇందుకు అంగీకరించిన ఆంజనేయుడు ఆమెను వివాహమాడతాడు. తాడ్ బండ్ వీరాంజనేయ స్వామికానీ, ఆపై బ్రహ్మచారిగానే కొనసాగాడు. ఇక సువర్చల స్వామివారి ధ్యానంలోనే తన శేష జీవితాన్ని గడిపేస్తుంది. వీరిద్దరి ప్రతిమలు ఇక్కడ మనకు గోచరిస్తాయి. గర్భాలయం మొత్తంను గ్రానైట్ రాయితో నిర్మించారు. ముఖమండపం విశాలంగా ఉంటుంది. విమాన గోపురం, మహారాజ గోపురాలతో శోభాయమానంగా ఉంటుంది. 40 రోజులపాటు జరిగే మండల దీక్షలు, మండల ప్రదక్షిణాలు, మండల అభిషేకాల కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, పొరుగు ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఈ దేవాలయానికి వస్తుంటారు. తాడ్ బండ్ వీరాంజనేయ స్వామిమండల ప్రదక్షిణాలు మరియు పూజల కోసం ప్రత్యేకంగా నలభై రోజులపాటు ఇక్కడే ఉండాలని కోరుకుంటారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వాకులు పలు సత్రాలను నిర్మించారు. సత్రాలతో పాటు భోజనశాలలు తదితర సౌకర్యాలు ఈ మందిరంలో భక్తుల కోసం ఏర్పాటు చేశారు. ఈ ఆలయం రజత, బంగారు జూబ్లీ ఉత్సవాలను కూడా జరుపుకుంది. ప్రతి మంగళ, శనివారాలలో ఇక్కడ కోలాహలం మాములుగా ఉండదు. వేల సంఖ్యలో స్వామివారి దర్శనార్థం తరలివస్తుంటారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది అన్ని రకాల వసతులను విస్తృతంగా ఏర్పాటు చేస్తారు. తాడ్ బండ్ వీరాంజనేయ స్వామివాహన పూజకు ఈ ఆలయం బాగా ఫేమస్. తక్కువ సొమ్ముతో పెళ్ళి వేడుకలు, ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలకు నిర్వహించుకునేందుకు ఓ కళ్యాణ మండపం కూడా ఉంది. కళ్యాణ మండపం అద్దెకు తీసుకున్నవారికి అధిక గదులు కేటాయిస్తారు.
Read Also..
Read Also..
పశ్చిమ చాళుక్యల వారికి ఈ ప్రాంతం రాజధానిగా వుండేదని పురాతత్వ ఆధారాలు తెలుపుతున్నాయి. క్రీ.శ. 8వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయానికి ఆనాటి వేములవాడ ప్రాంతానికి మొదటి చాళిక్యరాజు అయిన నరసింహుడుకు గల ‘రాజాదిత్య’ బిరుదు నుండి ఈ ఆలయానికి రాజరాజేశ్వర ఆలయనం అని పేరు వచ్చిందని చరిత్రకారులు అభిప్రాయపడుతుంటారు. చారీత్రాత్మకంగా వేములవాడ ఒక అతి పురాతనమైన ఆలయం. చాళిక్యుల కాలంలో ఈ క్షేత్రం మహామహివాన్విత క్షేత్రంగా వెలుగొందని చరిత్రకారుల అంచనా. ఈ ఆలయం చుట్టూ వున్న దేవాలయాలను నిర్మించడానికి ఆనాటి చాళిక్యుల కాలంలో సుమారు 220 సంవత్సరాల కాలం పట్టిందని చరిత్రకారులు చెబుతున్నారు.
ఆలయ విశేషాలు :
శివరాత్రి పర్వదినం సందర్భంగా 100 మంది అర్చకులతో ఈ మహాలింగానికి అర్చన చేయబడుతుంది. ఇక్కడ భక్తులు నిర్వహించుకునే ప్రధాన పూజలలో కోడెముక్కు ఒకటి. ఈ పూజలో మొదటగా భక్తులు ఒక గిత్తను తీసుకుని గుడిచుట్టూ ప్రదక్షిణలు చేయిస్తారు. ఆ తరువాత ఆలయ ప్రాంగణంలో దానిని కట్టేసి, దక్షిణగా ఇచ్చేస్తారు. ఈ విధంగా ఈ పూజను నిర్వహించుకోవడం వల్ల వారికి సంతానం కలుగుతుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. శైవులు, వైష్ణవులు, జైనులు, బౌద్ధులుఇలా రకరకాల జాతులకు చెందినవారు ఈ ఆలయాన్ని తరుచూ సందర్శిస్తారు. ఈ దేవాలయంలో వున్న శిల్పాలు కూడా జైన, బౌద్ధ సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. ఈ ఆలయంలో ఇంకొక విశిష్టమైన అంశం వుంది. ఈ ఆలయ ప్రాంగణంలో 400 సంవత్సరాలనాటి పురాతన మసీదు వుంది. పూర్వం ఇస్లాం మతానికి చెందిన ఒక శివభక్తులు ఈ ఆలయంలోనే వుంటూ నిత్యం స్వామివారిని సేవిస్తుంటేవాడట. అతని మరణం కూడా ఇక్కడే జరిగిందని చెబుతుంటారు. అలా అతని పేరు మీద ఇక్కడ మసీదును నిర్మించడం జరిగింది.
ఆధ్యాత్మిక, చారిత్రాత్మక సంపదగల భారతదేశంలో కొన్ని ఆలయాలు చరిత్రపుటలో మరుగునపడుతున్నాయి. ఒక్కసారి వాటిని పరిశీలిస్తే నమ్మలేని అద్భుత గాధలు తెలుసుకోవచ్చు. అలాంటి ఆలయాల్లో ‘భోగేశ్వరాలయం’ ఒకటి. కాకతీయ సామ్రాజ్యంలో నిర్మించబడిన ఈ ఆలయం.. వరంగల్ రైలు స్టేషన్ కి మూడు కిలోమీటర్ల దూరంలోని మట్టెవాడ ప్రాంతంలో వుంది. ఈ ఆలయానికి ‘భోగేశ్వరాలయం’ అనే పేరు రావడం వెనుక ఓ పురాణ కథ అమలులో వుంది. ప్రతిరోజూ రాత్రిపూట ఒక పాము ఇక్కడికొచ్చి ఈశ్వరుని సేవించేదట. పానవట్టముమీద పైనున్న లింగభాగాన్ని జరపటానికి వీలుగా వున్నది. దాని క్రింది భాగం బోలుగా వుంటుంది. ఇక్కడ అడుగుభాగంలో శివలింగం కింద మేరు ప్రస్తారంలో శ్రీ చక్రం వుందట. శీచక్రం బిందుస్ధానంలో మరొక చిన్న రాతి శివలింగం వుంది. అక్కడ ఒక పెద్ద శ్రీ చక్రము, ఆ శ్రీచక్రబిందు స్ధానంలో ఒక లింగము, శ్రీ చక్రాన్ని కప్పివేస్తూ నిర్మించిన పెద్దపానవట్టము, ఆ పానవట్టముమీద కదల్చటానికి వీలుగా చెక్కిన మరొక శివలింగము వున్నాయి. దానికింద పదకొండు శివ లింగాలు వున్నాయని, అందుకే ఈ భోగేశ్వర స్వామికి ఒక్కసారి అభిషేకంచేస్తే ఏకాదశరుద్రాభిషేకం చేసిన ఫలితం దక్కుతుందంటారు. ఈ ఆలయంలో మరొక విశేషం ఏమిటంటే ఇక్కడ ఎన్ని బిందెలనీళ్ళతో శివలింగానికి అభిషేకం చేసినా ఆ నీరు ఒక్క చుక్కైనా బయటికి రాదు ఎక్కడికి పోతుందో కూడా తెలీదు. ఈ లింగానికి వెనుక భాగంలో పార్వతీ పరమేశ్వరుల విగ్రహం కూడా ప్రతిష్టించబడింది. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ ఆలయం ప్రసిద్ధి చెందకపోవడానికి కొన్ని వాస్తుదోషాలు వున్నాయని చెబుతారు. స్వామి ఉత్తర ముఖంగా వున్నాడు. అంటే పూజించేవారు దక్షిణ ముఖంగా వుండి చెయ్యాలి. అది శాస్త్ర సమ్మతం కాదంటారు. నైఋతిలో బావి వుందన్నారు కానీ వాస్తుదోషం కారణంగా దానిని మూసేశారుట. ఆలయ ప్రవేశద్వారం ఈశాన్యంలో వున్నది. ఇదికూడా వాస్తు శాస్త్ర విరుధ్ధమే. ఈ ఆలయంలో శివరాత్రి వగైరా పర్వదినాలలో ప్రత్యేక పూజలే కాక మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రంరోజున ద్వార దర్శనం వుంటుంది.
ఈ ఆలయ నిర్మాణం ఎంతో ప్రాచీనమైనది. ప్రాచీన మధురై నగరానికి సంబంధించిన భౌగోళిక, సంప్రాదాయిక ఆచారాలను కలిగి వుంటూ ఒక కేంద్రంగా గుర్తించబడుతుంది. ఈ ప్రాచీన ఆలయానికి చుట్టూ వుండే గోడలు, వీధులు, నగర గోడలు చతురస్రాకారంలో నిర్మించబడి వుండేవి. నాలుగు ముఖాలతో ప్రవేశ ద్వారాలతో కలిగిన ఆలయాలో తమిళనాడులో వుండే అతికొద్ది దేవాయాల్లోనే ఇది ఒకటి. ఆలయ సముదాయం 45 ఎకరాలతో గుండ్రంగా వుండి, 254/237 మీటర్లతో పొడవున భారీ నిర్మాణంగా వుండేది. అప్పటిలో ఈ ఆలయానికి 12 గోపురాలు వుండేవి. పురాతన ఆలయం అయిన ఇందులో ఎందరో దేవతల సముదాయం వుండేది. అందులో ముఖ్యంగా శివాలయం ఆలయ సముదాయానికి నడిబొడ్డులో వుండేది. అలాగే ఆలయానికి వెలుపల ఏకశిలపై మలిచిన గణేశుని భారీ విగ్రహం వుంది. దీనిని ముఖురుని వినాయకర్ అని పిలుస్తారు. మీనాక్షీ విగ్రహం శివు విగ్రహానికి ఎడమవైపున వుంది. ఆలయ ప్రత్యేకతలు ఆలయానికి నలువైపులా నాలుగు ఎత్తైన రాజు గోపురాలు ఎంతో గంభీరంగా దర్శనమిస్తాయి. తూర్పు – పశ్చిమ దిశగా వున్న గోపురాలను 13, 14వ శతాబ్దాలలో సుందరపాండ్యన్, పరాక్రమ పాండ్యన్ అనే ఇద్దరు పాలకులు నిర్మించారని అదేవిధంగా దక్షిణ గోపురాన్ని శివ్వంది చెట్టియార్ అనే పాలకుడు 16వ శతాబ్దంలో నిర్మించినట్టు స్థలపురాణం పేర్కోబడుతోంది. దక్షిణవైపుగా వున్న గోపురం సుమారు 160 అడుగుల ఎత్తు వుంది. ఈ ఆలయంలో సుందరేశ్వర స్వామి, మీనాక్షీ అమ్మవారు మొదలగు దేవతలు కొలువై వున్నారు. మధురై ప్రాంతంలో వున్న సంస్కృతీ – సంప్రదాయాల ప్రకారం ఆలయానికి తూర్పువైపున వున్న అష్టలక్ష్మీ మండపం ద్వారా లోపలికి ప్రవేశం చేసి, మీనాక్షి అమ్మవారిని దర్శించుకోవాలి. ఈ ప్రవేశ ద్వారంపై అమ్మవారి ఘట్టాలు శిల్పాల రూపంలో ఎంతో అందంగా చెక్కబడి వున్నాయి. అలాగే స్వర్ణ కమల తటాకం కూడా ఎందో ఆకర్షణీయంగా వుంటూ భక్తులను ఎంతో ఉత్సాహపరుస్తుంది. ఆలయ సముదాయంలో వుండే రెండుబంగారు గోపురాలతోపాటు 14 అద్భుతమైన గోపురాలకు ముఖ్యదేవతలకు నిలయంగా వుంది.
Read Also..
Read Also..
నూతన సంవత్సరం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు కిటకిటలాడాయి. ఏపీలోని తిరుమల, శ్రీశైలం, సింహాచలంతో పాటు తెలంగాణలో యాదాద్రి, వేములవాడ, భద్రాద్రి, బాసర తదితర ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తిరుమల శ్రీవారి దర్శనానికి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతరప్రాంతాల నుంచీ తరలివచ్చారు. స్వామివారి కృపాకటాక్షాలు తమపై ఉండాలని ప్రార్థించారు. దీంతో శ్రీవారి ఆలయ పరిసరాల్లో కోలాహలం నెలకొంది. శ్రీవారిని కేంద్రమంత్రి కిషన్రెడ్డి దంపతులు, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దర్శించుకున్నారు. వారికి రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు గవర్నర్ తమిళిసై తెలిపారు. తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. కొత్త ఏడాది తొలి రోజు కావడం, మేడారం జాతరకు ముందుగా భక్తులు రాజన్నను దర్శించుకోవడానికి వస్తుండడంతో గర్భాలయంలో ఆర్జిత సేవలను ఆలయ అధికారులు రద్దు చేశారు. ధర్మగుండంలో స్నానాలు ఆచరించిన భక్తులు.. స్వామి వారికి కోడె మొక్కులను చెల్లించుకుంటున్నారు. అనంతరం స్వామివారి దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఓరుగల్లు శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయంలో అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని విశేష పూజలు నిర్వహించారు. కొత్త సంవత్సరం కలిసి రావాలంటూ వేడుకున్నారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.
శివుడు అభిషేక ప్రియుడు. కలశంతో మంచి నీటి అభిషేకం చేసిన పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. కోరిన కోర్కెలను నెరవేరుస్తాడు. అలా అని అభిషేకం ఎలా పడితే అలా చేయకూడదు. దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ముఖ్యంగా పవిత్రమైన మహాశివరాత్రి నాడు శివుడిని ఆరాధించేటప్పుడు ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాలి. అప్పుడే పుణ్యఫలం దక్కుతుంది. తెలిసీతెలియక తప్పులు చేస్తే అభిషేకం చేసిన పుణ్యం కూడా దక్కదు. ఉత్తర దిశను శివుడి ప్రధాన ద్వారంగా భావిస్తారు. కాబట్టి శివ లింగానికి నీటిని అభిషేకించేటప్పుడు ఎల్లప్పుడూ ఉత్తరం వైపు ముఖం ఉంచాలి. ఈ దిశను అర్ధనారీశ్వరుడి ఎడమవైపుగా భావిస్తారు. స్టీల్ గిన్నె లేదా మట్టి పాత్రల్లో తీసుకునే అభిషేకించాలి. మహాశివరాత్రి నాడు కొంతమంది పాల ప్యాకెట్లతో అభిషేకం చేస్తుంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. అలాగే కూర్చొని మాత్రమే అభిషేకం చేయాలి.పూజా సమయంలో శివలింగంపై పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర వంటి పంచామృతాలతో అభిషేకం చేసినప్పటికీ చివరగా నీటితో అభిషేకం చేయడం చాలా ముఖ్యం. అప్పుడే అభిషేక ఫలితం దక్కుతుంది. నీటితో అభిషేకం చేసేటప్పుడు అందులో పూలు, గంధం వంటివి ఏవీ కలపకూడదు. స్వచ్ఛమైన నీటితోనే అభిషేకం చేయాలి. అలాగే శివుడికి శంఖంలో నీటిని తీసుకుని ఎప్పుడూ అభిషేకించకూడదు.
నెల్లూరు నుండి 15 కిలోమీటర్ల దూరంలో వున్న జొన్నవాడ శాంత స్వరూపిణిగా కామాక్షి దేవి కొలువై ఉంది. కామాక్షి దేవి సన్నిధిలో తమ సమస్యలను చెప్పుకుని మొరపెట్టుకునే భక్తులు ఆ ఆలయంలో నిద్రిస్తే వారి సమస్యలు తీరిపోతాయి. అమ్మవారి ఆలయ గోపురం లోపలికి ప్రవేశించగానే ముందు ఎడమవైపున వున్న మార్గంలో వెడితే పినాకిని నదికి చేరుకోవచ్చు. ఆలయ ప్రవేశ ద్వారంలో దేవి కామాక్షి సన్నిధి వైపు వెళ్లే మార్గంలో రెండు వైపులా శూలాన్ని చేతబూనిన మహిళా ద్వారపాలకులు గోచరిస్తారు. లోపలికి వెడితే విశాలమైన లోగిలి. దాన్ని దాటి వెడితే ముందుగా కల్యాణ మండపం వస్తాయి. కల్యాణ మండపానికి కుడివైపు కామాక్షిదేవి గర్భగుడికి వెళ్లే దారిలో బలిపీఠం, ధ్వజస్థంభం ఉంటాయి. ధ్వజస్తంభం ముందు ఒక పెద్ద నంది, దానిపక్కనే చిన్న నంది ఉంటాయి. లోపలికి వెళ్లగానే అర్ధమండపంలో చాలా స్తంభాలుంటాయి. ఆలయ పురాణం శిల్పాల రూపంలో తెలిసేలా అమర్చారు. అర్ధమండపం తర్వాత వరసగా గర్భగుడులు ఉంటాయి. మొదటి గర్భగుడిలో లక్ష్మీగణపతి, ఎడమవైపున చిన్న మహలక్ష్మి విగ్రహం ఉంటాయి. గర్భగుడిలో మల్లికార్జునస్వామి కొలువై ఉన్నారు. చిన్న లింగం, వల్లి, దేవయాని సమేత సుబ్రహ్మణ్యస్వామి కొలువై ఉన్నారు. అఖిల జగత్తును కాపాడే కామాక్షిదేవి ఈ క్షేత్రంలో నిల్చున్నట్టు మనకు దర్శనమిస్తుంది. చిరునవ్వుతో ఉన్న ముఖారవిందం, కరుణ భరితమైన నయనాలతో సర్వాలంకారాలతో దర్శనిమిస్తుంది. నాలుగు హస్తాలతో ఉన్న అఖిలాండేశ్వరి పై రెండు చేతులలో అంకుశము, పాశము ఉంటాయి. కింది రెండు చేతులలో ఒకటి అభయ హస్తంగాను, మరొకటి శరణాగతి పొందమని చూపినట్టు ఉంటాయి. ఆ తల్లిని చూడడానికి రెండు కళ్లు చాలవు. ఆ దేవి ఎదుట శ్రీ చక్రం స్థాపించిన ఆది శంకరుడు చేత ఒక దండంతో దర్శనమిస్తాడు. బయటి ప్రాకారంలో గణపతి, వల్లి, దేవయాని సమేతుడైన సుబ్రహ్మణ్యస్వామి, పసుపు రాసిన ముఖారవిందంతో దుర్గాదేవి చిన్న మండపాలలో దర్శనమిస్తారు. దుర్గాదేవి పక్కనే నవగ్రహాలున్నాయి. బయటి ప్రాకారంలో భక్తులు వేచి ఉంటారు. ఈ క్షేత్ర దర్శనానంతరం బయటికి వచ్చేటప్పుడు మానసికంగా ఎంతో ప్రశాంతత లభిస్తుంది. ఇక్కడ ప్రతి ఏటా ఏప్రిల్, మే మాసాలలో పదిరోజులపాటు ఉత్సవాలు నిర్వహించబడతాయి. ప్రతి శుక్రవారం అమ్మవారి సన్నిధికి పెద్దఎత్తున ముత్తయిదువలు చేరుకుని పూజలు చేస్తారు.
Read Also..
Read Also..
భక్త సంరక్షణార్ధం శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలు ఎత్తాడు, వాటిలో ముఖ్యమైనవి దశావతారాలని మనం కొలుచుకుంటాంకదా. ఇవి భూమి మీద మానవ పరిణామానికి సంకేతాలనికూడా చెబుతారు. దశావతారాలలో మూడవది ఆది వరాహావతారం. శ్రీ మహావిష్ణువు వరాహావతారాన్ని ఎత్తటానికి సంబంధించిన కధని ఇక్కడ టూకీగా చెప్పుకుందాం. ఒకసారి శ్రీ మహావిష్ణువు దర్శనార్ధం సనక సనందాది మహా ఋషులు వైకుంఠానికి వెళ్ళారు. అక్కడ ద్వార పాలకులైన జయ విజయులు స్వామివారి దర్శనానికి అది సరైన సమయం కాదని అడ్డగిస్తారు. దానితో ఆ మహా ఋషులకి కోపం వస్తుంది. జయ విజయులని, ఏ స్వామి సాన్నిధ్యంలో వున్నామనే గర్వంతో తమని అడ్డగించారో, ఆ స్వామి సేవకి దూరమయ్యి భూలోకంలో అసురులుగా జన్మిస్తారని శపిస్తారు. వారు శ్రీ మహావిష్ణువుని ఆయన సేవకి ఎక్కువ కాలం దూరంగా వుండలేమని ప్రార్ధించగా, విష్ణుమూర్తి భక్తులుగా ఏడు జన్మలు లేక శత్రువులుగా మూడు జన్మలలో తనని తిరిగి చేరవచ్చనే వరం ఇస్తాడు. ఏడు జన్మలు ఆయన సేవకి దూరం కాలేమని, శత్రువులుగా మూడు జన్మలలోనే ఆయన సాన్నిధ్యాన్ని ప్రసాదించమని కోరుతారు. ఆ విధంగా వారు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడిగా భూలోకంలో జన్మిస్తారు. మిగతా జన్మలు రావణ – కుంభకర్ణులు, కంస – శిశుపాలురు. హిరణ్యాక్షుడిని చంపటానికి ఆది వరాహావతారంలో, హిరణ్యకశిపునికోసం నరసింహావతారంలో, రావణ, కుంభకర్ణులకోసం శ్రీరాముడిగా, కంస, శిశుపాలురని అంతం చేయటానికి శ్రీ కృష్ణుడిగా అవతరించాడు శ్రీమహావిష్ణు. ప్రస్తుతం మనం చెప్పుకునే కధ ఆది వరాహావతారం గురించి. హిరణ్యకశిపుడు భూదేవి ని చెరబట్టి సముద్రం అడుక్కి తీసుకెళ్ళాడు. ఆవిడని రక్షించటానికి శ్రీమహావిష్ణువు ఆది వరాహ రూపమెత్తి హిరణ్యాక్షుడిని వెతుక్కుంటూ సముద్ర గర్భంలోకి వెళ్ళి, యుధ్ధంచేసి ఆతణ్ణి సంహరించి, భూదేవిని ఉధ్ధరిస్తాతడు.
కర్ణాటక రాష్ట్రంలోని వరాహనాథ కల్లహళ్లిలో ఉన్న భూవరాహ స్వామి ఆలయంకు ఏకంగా 3,000 సంవత్సరాల చరిత్ర ఉంది. గౌతమ మహర్షి హేమవతీ నదీ ఒడ్డున 3,000 సంవత్సరాల క్రితం ఈ ఆలయంలో స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారట. ఆ విగ్రహం శిథిలావస్థకు చేరుకున్న సమయంలో మూడో వీరభళ్లాల అనే రాజు ఈ విగ్రహానికి పూర్వ వైభవం తెచ్చారు. పదేళ్ల క్రితం ఒక భక్తుడు శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయాన్ని పునర్నిర్మించాడు. ఇంటి నిర్మాణం కోసం స్థలం కొనాలని భావించే వాళ్లు మట్టిని, స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వాళ్లు ఇటుకలను పూజిస్తారు. ఈ పూజల తర్వాత ఆ మట్టి, ఇటుకలను ఇంటి నిర్మాణంలో వినియోగిస్తారు. ఈ విధంగా చేయడం ద్వారా దేవుని అనుగ్రహం తమపై ఉంటుందని భక్తులు నమ్ముతారు. రేవతి నక్షత్రం రోజున ఈ ఆలయంలో పూజా కార్యక్రమాలతో పాటు ప్రత్యేక అభిషేకాలను నిర్వహిస్తారు. రైలు, బస్సు మార్గాల ద్వారా సులువుగా ఈ ఆలయాన్ని దర్శించుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. బెంగళూరు, మైసూర్ నుంచి ఈ ఆలయానికి ప్రత్యేకంగా బస్సులు ఉంటాయి. ఈ దేవుడు చాలా పవర్ ఫుల్ అని భక్తులు భావిస్తారు. ఈ ఆలయాన్ని దర్శించుకునే అవకాశం ఉంటే అస్సలు మిస్చే సుకోవద్దని పండితులు సైతం చెబుతున్నారు. సొంతింటి కల తీరాలంటే ఈ ఆలయాన్ని వెంటనే దర్శించుకుంటే మంచిది.