Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Devotional శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం

శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం

by Satya
Sri Rajarajeswara Swamy


పశ్చిమ చాళుక్యల వారికి ఈ ప్రాంతం రాజధానిగా వుండేదని పురాతత్వ ఆధారాలు తెలుపుతున్నాయి. క్రీ.శ. 8వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయానికి ఆనాటి వేములవాడ ప్రాంతానికి మొదటి చాళిక్యరాజు అయిన నరసింహుడుకు గల ‘రాజాదిత్య’ బిరుదు నుండి ఈ ఆలయానికి రాజరాజేశ్వర ఆలయనం అని పేరు వచ్చిందని చరిత్రకారులు అభిప్రాయపడుతుంటారు. చారీత్రాత్మకంగా వేములవాడ ఒక అతి పురాతనమైన ఆలయం. చాళిక్యుల కాలంలో ఈ క్షేత్రం మహామహివాన్విత క్షేత్రంగా వెలుగొందని చరిత్రకారుల అంచనా. ఈ ఆలయం చుట్టూ వున్న దేవాలయాలను నిర్మించడానికి ఆనాటి చాళిక్యుల కాలంలో సుమారు 220 సంవత్సరాల కాలం పట్టిందని చరిత్రకారులు చెబుతున్నారు.
ఆలయ విశేషాలు :
శివరాత్రి పర్వదినం సందర్భంగా 100 మంది అర్చకులతో ఈ మహాలింగానికి అర్చన చేయబడుతుంది. ఇక్కడ భక్తులు నిర్వహించుకునే ప్రధాన పూజలలో కోడెముక్కు ఒకటి. ఈ పూజలో మొదటగా భక్తులు ఒక గిత్తను తీసుకుని గుడిచుట్టూ ప్రదక్షిణలు చేయిస్తారు. ఆ తరువాత ఆలయ ప్రాంగణంలో దానిని కట్టేసి, దక్షిణగా ఇచ్చేస్తారు. ఈ విధంగా ఈ పూజను నిర్వహించుకోవడం వల్ల వారికి సంతానం కలుగుతుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. శైవులు, వైష్ణవులు, జైనులు, బౌద్ధులుఇలా రకరకాల జాతులకు చెందినవారు ఈ ఆలయాన్ని తరుచూ సందర్శిస్తారు. ఈ దేవాలయంలో వున్న శిల్పాలు కూడా జైన, బౌద్ధ సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. ఈ ఆలయంలో ఇంకొక విశిష్టమైన అంశం వుంది. ఈ ఆలయ ప్రాంగణంలో 400 సంవత్సరాలనాటి పురాతన మసీదు వుంది. పూర్వం ఇస్లాం మతానికి చెందిన ఒక శివభక్తులు ఈ ఆలయంలోనే వుంటూ నిత్యం స్వామివారిని సేవిస్తుంటేవాడట. అతని మరణం కూడా ఇక్కడే జరిగిందని చెబుతుంటారు. అలా అతని పేరు మీద ఇక్కడ మసీదును నిర్మించడం జరిగింది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: