దక్షిణాఫ్రికాపై 3వ టీ20 మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అసాధారణ రికార్డులు నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో నాలుగు సెంచరీలు సాధించిన మూడవ బ్యాట్స్‌మెన్‌గా మిస్టర్ 360 గా నిలిచాడు. ఈ జాబితాలో చెరో 4 సెంచరీలతో ఉన్న రోహిత్ శర్మ, గ్లేన్ మ్యాక్స్‌వెల్ సరసన నిలిచాడు. అయితే సూర్య కేవలం 57 ఇన్నింగ్స్‌లలో ఈ రికార్డును సాధించగా రోహిత్ 79 మ్యాచ్‌లు, మ్యాక్స్‌వెల్ 92 ఇన్నింగ్స్ ఆడడం గమనార్హం. దీనినిబట్టి సూర్య ఎంత వేగంగా 4 సెంచరీలను అందుకున్నాడో అర్థమవుతోంది. ఇక టీ20 ఫార్మాట్లో వీళ్లు ముగ్గురు మాత్రమే 4 చొప్పున సెంచరీలు నమోదు చేయగా సబావూన్ డేవిజి 3, కోలిన్ మన్రో 3, బాబర్ ఆజం 3 ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు. దక్షిణాఫ్రికాపై సూపర్ సెంచరీ సాధించిన సూర్య ఖాతాలో మరో రెండు రికార్డులు పడ్డాయి. టీ20లలో అత్యధిక స్కోరు సాధించిన మూడవ భారత కెప్టెన్‌గా సూర్య నిలిచాడు. ఇక సూర్య సాధించిన నాలుగు సెంచరీలు వేర్వేరు దేశాల్లో నమోదు చేయడం మరో రికార్డుగా ఉంది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఇండియా, తాజాగా దక్షిణాఫ్రికాలో సెంచరీలు బాదాడు. ఈ ఫీట్ సాధించిన ఏకైక ఆటగాడిగా మిస్టర్ 360 గా నిలిచాడు. మాక్స్వెల్ సెంచరీల్లో రెండు భారత్‌లో, శ్రీలంక, ఆస్ట్రేలియాల్లో ఒక్కోటి చొప్పున బాదాడు. ఇక రోహిత్ ఇండియాలో 3, ఇంగ్లండ్‌లో ఒక సెంచరీ కొట్టాడు.
england
బీసీసీఐ ( భారత క్రికెట్ నియంత్రణ మండలి) ఆధ్వర్యంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ( ఏసీఏ) పర్యవేక్షణలో ఈ నెల 13 నుంచి 27వ తేదీ వరకు అండర్ –19 పురుషుల అంతర్జాతీయ క్వాడ్రాంగ్యులర్ క్రికెట్ టోర్నమెంట్ మూలపాడులోని డీవీఆర్, సీపీ గ్రౌండ్లలో నిర్వహిస్తున్నట్లు ఏసీఏ కార్యదర్శి ఎస్.ఆర్. గోపినాథ్ రెడ్డి వెల్లడించారు. గురువారం మూలపాడులోని ఏసీఏ క్రికెట్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీఏ జాయింట్ సెక్రెటరీ ఎ. రాకేష్, అపెక్స్ కౌన్సిల్ మెంబర్ జితేంద్రనాథ్ శర్మతో కలిసి ఏసీఏ కార్యదర్శి ఎస్.ఆర్. గోపినాథ్ రెడ్డి మాట్లాడుతూ… బంగ్లాదేశ్, ఇంగ్లాండ్ జట్లు, మన దేశం తరపున ఇండియా–ఎ, ఇండియా– బి జట్లుగా పాల్గొంటాయి. మొత్తం నాలుగు జట్లు టోర్నమెంట్ లో పాల్గొంటాయని తెలిపారు. ఈ నెల 5న ఇంగ్లాండ్ జట్టు విజయవాడకు వచ్చి మూలపాడులో నాలుగు రోజుల పాటు ప్రాక్టీస్ చేయనుంది. బంగ్లాదేశ్ జట్టు 10వ తేదీన విజయవాడకు చేరుకుంటుంది. క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా టోర్నమెంట్ పోటీలను విజయవంతంగా నిర్వహించేందు కు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటు న్నాము. అదేవిధంగా వైజాగ్ లోని డా. వైయస్సార్ ఏసీఏ – విడి సీఎ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 23న ఇండియా – ఆస్ట్రేలియా టీ – 20 ఇంటర్నేషనల్ మ్యాచ్ నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
మూలపాడులో నిర్వహించనున్న8 మ్యాచ్ షెడ్యూల్..
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––
తేదీ మ్యాచ్ వేదిక
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––
13–11–23 ఇండియా (ఎ) – బంగ్లాదేశ్ డీవీఆర్ గ్రౌండ్
13–11–23 ఇండియా (బి) – ఇంగ్లాండ్ సీపీ గ్రౌండ్
15–11–23 ఇండియా (బి) – బంగ్లాదేశ్ డీవీఆర్ గ్రౌండ్
15–11–23 ఇండియా (ఎ) – ఇంగ్లాండ్ సీపీ గ్రౌండ్
17–11–23 ఇండియా (ఎ) – ఇండియా (బి) డీవీఆర్ గ్రౌండ్
17–11–23 ఇంగ్లాండ్ – బంగ్లాదేశ్ సీపీ గ్రౌండ్
20–11–23 ఇండియా (బి) – ఇంగ్లాండ్ డీవీఆర్ గ్రౌండ్
20–11–23 ఇండియా (ఎ) – బంగ్లాదేశ్ సీపీ గ్రౌండ్
22–11–23 ఇండియా (ఎ) – ఇంగ్లాండ్ డీవీఆర్ గ్రౌండ్
22–11–23 ఇండియా (బి) – బంగ్లాదేశ్ సీపీ గ్రౌండ్
24–11–23 ఇంగ్లాండ్ – బంగ్లాదేశ్ డీవీఆర్ గ్రౌండ్
24–11–23 ఇండియా (ఎ) – ఇండియా (బి) సీపీ గ్రౌండ్
27–11–23 ఫైనల్ డీవీఆర్ గ్రౌండ్
27–11–23 3వ ప్లేస్ సీపీ గ్రౌండ్
ప్రపంచకప్ సమయంలో క్రికెట్ అభిమానుల మధ్య మాటల యుద్ధాలు సాధారణంగానే కనిపిస్తుంటాయి. ఈ విడత కూడా ఇలాంటివి కొన్ని చోటు చేసుకుంటున్నాయి. భారత్-ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ సందర్భంగా ఇరు దేశాల క్రికెట్ అభిమానుల మధ్య ట్విట్టర్ లో ట్వీట్ల పోరు కనిపించింది. ఇంగ్లండ్ క్రికెట్ అభిమానుల సంఘం ‘బార్మీ ఆర్మీ’ భారత క్రికెటర్ల పట్ల ఎప్పుడూ అక్కసు వెళ్లగక్కుతూనే ఉంటుంది. మరోసారి బార్మీ ఆర్మీ తన అసలు రూపాన్ని చూపించింది. టాస్ ఓడి భారత్ బ్యాటింగ్ కు దిగగా, ఇంగ్లండ్ బౌలర్లు 229 పరుగులకు భారత్ ను కట్టడి చేశారు. ముఖ్యంగా వన్డే ప్రపంచకప్ 2023లో ఇప్పటి వరకు అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్న విరాట్ కోహ్లీ ఇంగ్లండ్ తో మ్యాచ్ లో తేలిపోయాడు. సున్నా పరుగులకే డకౌట్ అయ్యాడు. దీన్ని బార్మీ ఆర్మీ ఎగతాళి చేసింది. నీటిలో ఉన్న రెండు డక్స్ ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అందులో ఒక బాతు తలకాయకు కోహ్లీ తలను తగిలించింది. మార్నింగ్ వాక్ కు వెళ్లిందంటూ క్యాప్షన్ పెట్టేసింది. దీనిపై భారత అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది. ‘‘ఎడిట్ చేయడానికి మాకు కొంత సమయం ఇవ్వు’’అని బదులిచ్చింది. కోహ్లీ తల స్థానంలో బెన్ స్టోక్స్ తలను అతికించి ఇమేజ్ పోస్ట్ చేసింది. భారత బ్యాటింగ్ ముగిశాక ఇంగ్లండ్ ఇన్నింగ్స్ మొదలైంది. భారత బౌలర్లు ఇంగ్లండ్ ఆటగాళ్లను బెంబేలెత్తించారు. కేవలం 129 పరుగులకే ఇంగ్లండ్ ను ఆల్ అవుట్ చేశారు. అప్పుడు ‘‘సాయంత్రం నడకకు వెళ్లింది’’ అంటూ భారత్ ఆర్మీ పేరుతో భారత అభిమానుల సంఘం రిప్లయ్ ఇచ్చింది. ఈ విడత నీటిలో ఉన్న ఒక బాతు తలకు డకౌట్ అయిన జోరూట్ తలను తగిలించింది. టీమిండియా వైపు నుంచి ఒక్క కోహ్లీయే డకౌట్ కాగా, దీన్ని బార్మీ ఆర్మీ అవకాశంగా తీసుకుంది. ఇంగ్లండ్ వైపు నుంచి డకౌట్ అయిన స్టోక్స్, రూట్ చిత్రాలను ఉపయోగించి నోరు పెగల్లేని విధంగా భారత్ ఆర్మీ బదులిచ్చింది.
వరల్డ్ కప్ లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇవాళ ఇంగ్లండ్ జట్టును కూడా టీమిండియా అలవోకగా ఓడించింది. తద్వారా టోర్నీలో వరుసగా ఆరో విజయాన్ని నమోదు చేసుకుని సెమీస్ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకుంది. లక్నోలో జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 229 పరుగులు చేసింది. అయితే లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 34.5 ఓవర్లలో 129 పరుగులకు కుప్పకూలి, 100 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. టీమిండియా బౌలర్లలో మహ్మద్ షమీ 4 వికెట్లతో మరోసారి సత్తా చాటడం విశేషం. బుమ్రాకు 3, కుల్దీప్ యాదవ్ కు 2, జడేజాకు 1 వికెట్ లభించాయి. ఇంగ్లండ్ జట్టులో లియామ్ లివింగ్ స్టన్ చేసి 27 పరుగులే అత్యధికం. టాపార్డర్ వైఫల్యంతో ఏ దశలోనూ ఇంగ్లండ్ విజయం దిశగా పయనిస్తున్నట్టు కనిపించలేదు. టీమిండియా బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఇంగ్లండ్ ను ఒత్తిడిలోకి నెట్టేశారు.వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ కు ఇది వరుసగా నాలుగో ఓటమి. ఇక ఈ టోర్నీలో ఇంగ్లండ్ సెమీస్ అవకాశాలు పూర్తిగా ఆవిరయ్యాయి. టీమిండియా 6 మ్యాచ్ ల్లో 6 విజయాలు సాధించి 12 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఇంగ్లండ్ 6 మ్యాచ్ ల్లో 1 విజయం సాధించి కేవలం రెండు పాయింట్లతో జాబితాలో అట్టడుగున ఉంది.