Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Andhra Pradesh 13 నుంచి మూలపాడులో అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్..

13 నుంచి మూలపాడులో అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్..

by Rama
cricket

బీసీసీఐ ( భారత క్రికెట్ నియంత్రణ మండలి) ఆధ్వర్యంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ( ఏసీఏ) పర్యవేక్షణలో ఈ నెల 13 నుంచి 27వ తేదీ వరకు అండర్‌ –19 పురుషుల అంతర్జాతీయ క్వాడ్రాంగ్యులర్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ మూలపాడులోని డీవీఆర్, సీపీ గ్రౌండ్లలో నిర్వహిస్తున్నట్లు ఏసీఏ కార్యదర్శి ఎస్.ఆర్. గోపినాథ్ రెడ్డి వెల్లడించారు. గురువారం మూలపాడులోని ఏసీఏ క్రికెట్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీఏ జాయింట్ సెక్రెటరీ ఎ. రాకేష్, అపెక్స్ కౌన్సిల్ మెంబర్ జితేంద్రనాథ్ శర్మతో కలిసి ఏసీఏ కార్యదర్శి ఎస్.ఆర్. గోపినాథ్ రెడ్డి మాట్లాడుతూ… బంగ్లాదేశ్, ఇంగ్లాండ్‌ జట్లు, మన దేశం తరపున ఇండియా–ఎ, ఇండియా– బి జట్లుగా పాల్గొంటాయి. మొత్తం నాలుగు జట్లు టోర్నమెంట్ లో పాల్గొంటాయని తెలిపారు. ఈ నెల 5న ఇంగ్లాండ్ జట్టు విజయవాడకు వచ్చి మూలపాడులో నాలుగు రోజుల పాటు ప్రాక్టీస్ చేయనుంది. బంగ్లాదేశ్ జట్టు 10వ తేదీన విజయవాడకు చేరుకుంటుంది. క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా టోర్నమెంట్‌ పోటీలను విజయవంతంగా నిర్వహించేందు కు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటు న్నాము. అదేవిధంగా వైజాగ్ లోని డా. వైయస్సార్ ఏసీఏ – విడి సీఎ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 23న ఇండియా – ఆస్ట్రేలియా టీ – 20 ఇంటర్నేషనల్ మ్యాచ్ నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
మూలపాడులో నిర్వహించనున్న8 మ్యాచ్‌ షెడ్యూల్‌..
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––
తేదీ మ్యాచ్‌ వేదిక
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––
13–11–23 ఇండియా (ఎ) – బంగ్లాదేశ్‌ డీవీఆర్‌ గ్రౌండ్‌
13–11–23 ఇండియా (బి) – ఇంగ్లాండ్‌ సీపీ గ్రౌండ్‌
15–11–23 ఇండియా (బి) – బంగ్లాదేశ్‌ డీవీఆర్‌ గ్రౌండ్‌
15–11–23 ఇండియా (ఎ) – ఇంగ్లాండ్‌ సీపీ గ్రౌండ్‌
17–11–23 ఇండియా (ఎ) – ఇండియా (బి) డీవీఆర్‌ గ్రౌండ్‌
17–11–23 ఇంగ్లాండ్‌ – బంగ్లాదేశ్‌ సీపీ గ్రౌండ్‌
20–11–23 ఇండియా (బి) – ఇంగ్లాండ్‌ డీవీఆర్‌ గ్రౌండ్‌
20–11–23 ఇండియా (ఎ) – బంగ్లాదేశ్‌ సీపీ గ్రౌండ్‌
22–11–23 ఇండియా (ఎ) – ఇంగ్లాండ్‌ డీవీఆర్‌ గ్రౌండ్‌
22–11–23 ఇండియా (బి) – బంగ్లాదేశ్‌ సీపీ గ్రౌండ్‌
24–11–23 ఇంగ్లాండ్‌ – బంగ్లాదేశ్‌ డీవీఆర్‌ గ్రౌండ్‌
24–11–23 ఇండియా (ఎ) – ఇండియా (బి) సీపీ గ్రౌండ్‌
27–11–23 ఫైనల్‌ డీవీఆర్‌ గ్రౌండ్‌
27–11–23 3వ ప్లేస్‌ సీపీ గ్రౌండ్‌

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: