Thursday, May 14, 2026
News Navigation
Thursday, May 14, 2026
News Navigation

Breaking

Thursday, May 14, 2026
Home Technology లావా నుంచి మరో బడ్జెట్ ఫోన్ లావా బ్లేజ్2 5జీ .. ఇవీ డిటైల్స్..!

లావా నుంచి మరో బడ్జెట్ ఫోన్ లావా బ్లేజ్2 5జీ .. ఇవీ డిటైల్స్..!

by Satya
Phone Lava Blaze2

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ లావా మరో బడ్జెట్ ఫోన్ లావా బ్లేజ్2 5జీ మార్కెట్లో ఆవిష్కరించింది. గ్లాస్ బ్యాక్‌తోపాటు మూడు కలర్స్‌లో లభిస్తుంది. 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో 6.56-అంగుళాల 2.5 డీ కర్వ్‌డ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరాతోపాటు డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. లావా బ్లేజ్2 5జీ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ఎస్వోసీ చిప్‌సెట్తో వస్తోంది. 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కలిగి ఉంటుంది. 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నదీ లావా బ్లేజ్2 5జీ ఫోన్ లావా బ్లేజ్2 5జీ ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.9999, 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.10,999లకు లభిస్తుంది. గ్లాక్ బ్లాక్, గ్లాస్ బ్లూ, గ్లాస్ లావెండర్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్లు లభిస్తాయి. ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి లావా ఈ-స్టోర్, అమెజాన్ ఇండియా వేదికలపై సేల్స్ ప్రారంభం అవుతాయి. లావా బ్లేజ్2 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 13 వర్షన్‌పై పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 14 వర్షన్ తోపాటు రెండేండ్ల పాటు సెక్యూరిటీ అప్ డేట్స్ అందిస్తుంది. ఎల్ఈడీ ఫ్లాష్‌తోపాటు డ్యుయల్ రేర్ కెమెరాతో వస్తోంది లావా బ్లేజ్2 5జీ ఫోన్. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 0.08 మెగా పిక్సెల్ సెకండరీ కెమెరా ఉంటాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం స్క్రీన్ ఫ్లాష్‌తో 8-మెగా పిక్సెల్ కెమెరా వస్తుంది. 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీతో వస్తున్న ఈ ఫోన్ లో మైక్రో ఎస్డీ కార్డు సాయంతో ఒక టిగా బైట్ వరకూ పొడిగించవచ్చు. లావా బ్లేజ్2 5జీ ఫోన్ 5జీ, 4జీ, బ్లూటూత్, ఎఫ్ఎం రేడియో, వై-ఫై 802.11 బీ/జీ/ఎన్/ఏసీ, ఓటీజీ, 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ కనెక్టివిటీ ఉంటుంది. యాక్సెలరో మీటర్, అంబియెంట్ లైట్ సెన్సర్, మాగ్నెటో మీటర్, ప్రాగ్జిమిటీ సెన్సర్ తదితర సెన్సర్ల ఉంటాయి. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఫేస్ అన్ లాక్ ఫీచర్ కలిగి ఉంటుంది. 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోందీ లావా బ్లేజ్2 5జీ ఫోన్.

Advertisements

You may also like

Our Visitor

012458
Total views : 75195

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.