ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ద్విచక్ర వాహనం పై వెళుతున్న దంపతులను వెనుక నుండి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటన లో గుంటూరు జిల్లా చిలకలూరిపేట కి చెందిన మల్లారపు వెంకట్రావు ప్రాణాల తో బయట పడగా.. అతని భార్య వెంకాయమ్మ ఘటనాస్థలం లోనే దుర్మరణం పాలైంది. జీ కొండూరు మండలం చిన్న నందిగామ మామిడి తోటలో కాపలా కి పనిచేస్తున్న వెంకట్రావు భార్యతో కలిసి మైలవరం రైతు బజార్ లో కూరగాయలు కొనడానికి వచ్చి తిరిగి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
Fatal road accident
ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ సొంత చిన్నాన్న పొన్నాడ నాగేశ్వరరావు చిన్న కుమార్తె పోతాబత్తుల నవీన గంగ, అల్లుడు లోకేష్ లు వారి కుమార్తె కుమారుడుతో టెక్సాస్ లో ఉంటున్నారు. సుమారు ఆరు నెలల క్రితం అమలాపురం వచ్చిన కుమార్తె నవీన గంగతో కలిసి తండ్రి పొన్నాడ నాగేశ్వరరావు, సీతామహాలక్ష్మి దంపతులు టెక్సాస్ వెళ్లారు. టెక్సాస్ హైవేలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పొన్నాడ నాగేశ్వరరావు, సతీమణి సీతామహాలక్ష్మి, కుమార్తె పోతాబత్తుల నవీన గంగతో పాటు కుమారుడు, కుమార్తె మృతి చెందారు. ప్రమాదంలో తీవ్ర గాయాలు పాలైన పోన్నాడ నాగేశ్వరరావు అల్లుడు లోకేష్ పరిస్థితి విషమంగా ఉంది, సర్జరీ జరుగుతుంది.
పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్నంలోని కొత్త మార్కెట్ యార్డ్ ఎదురు నేషనల్ హైవే మీద గుంటూరు నుంచి వెళ్తున్న కారు, గణపవరంకు చెందిన వ్యక్తి మార్కెట్ యార్డ్ లో నుంచి కూరగాయలు కొనుక్కొని టీవీఎస్ ద్విచక్ర వాహనం మీద గణపవరం వెళుతుండగా గుంటూరు నుంచి వస్తున్న కారు బలంగా ఢీకొనడంతో అక్కడికక్కడే గణపవరంకు చెందిన వ్యక్తి మృతి చెందాడు. అలాగే పక్కన ఆగి ఉన్న స్కూటీని కూడా ఢీకొంది. స్కూటీ మీద ఉన్న వ్యక్తికి తీవ్రమైన గాయాలు అవటంతో వారి బంధువులు హుటాహుటిన వైద్యశాలకు తరలించారు.
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందాడు. ఆరాంఘర్ నుంచి మేహిదిపట్నం వైపు బైక్ పైన వెళ్తున్న అక్బర్ మోహిఉద్దిన్ (24) అనే ఓ యువకుని, శివరాంపల్లి పిల్లర్ నెంబర్ 245 వద్దకు చేరుకోగానే వెనుక నుంచి వచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొనడం తో, యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీనితో ఢీకొన్న వాహనం అక్కడ నుంచి ఫరారయ్యింది. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఒస్మానియా ఆసుపత్రికి తరలించారు.
NTR జిల్లా జగ్గయ్యపేట నియోజక వర్గం జాతీయ రహదారి 65 మీద హైదరాబాదు నుండి విజయవాడ వైపు ప్రయానిస్తున్న కారు, ముళ్ళపాడు ప్లే ఓవర్ బ్రిడ్జి వద్ద అదుపు తప్పి, హైవే మీద డివైడర్ ఎలక్ట్రికల్ పోల్ కు ఢీకొంది. ప్రమాద ఘటన లో కారు లోని యువతి మృతి చెందింది. కారు ఎలక్ట్రికల్ పోల్ ను ఢీ కొట్టడం తో మంటలు వ్యాపించాయి. క్షతగాత్రులను నందిగామ ఆస్పత్రికి తరలించారు.
ఏలూరు జిల్లా కైకలూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పి కొల్లేటిలోకి పల్టీ కొట్టింది ఏలూరు డిపోకి చెందిన APS RTC పల్లె వెలుగు బస్సు. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. సుమారు 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం అందింది. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బస్సు అద్దాలు పగలగొట్టి రక్షిస్తున్నారు స్థానికులు.
కె.వి పల్లి మండలం జిల్లెల మంద పంచాయతీ బసన్న గారి పల్లి వాసి చిన్న సిద్దయ్య సన్నాఫ్ లేట్ వెంకటస్వామి వయసు 50 సంవత్సరాలు అనబడే వ్యక్తి కె.వి పల్లి మండలం గుండ్రేవారిపల్లి నుంచి వస్తున్న సమయంలో కారు అతివేగంగా ద్విచక్ర వాహనం ని ఢీకొనడంతో చిన్న సిద్దయ్య అక్కడికక్కడే మృతి చెందినట్లు వ్యక్తిని ఢీకొట్టిన కారు బావిలో బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. కె.వి పల్లి మండలం పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
అనంతపురం రూరల్ సమీపంలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. వీరిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. అనంతపురం రూరల్ చిన్నంపల్లి క్రాస్ సమీపంలో బండల లోడుతో వెళుతున్న లారీ టైరు పంచర్ కావడంతో నిలిపారు. అనంతపురం నుంచి కళ్యాణదుర్గం వెళుతున్న కాళీ ఐచర్ వాహనం వేగంగా వచ్చి లారీ వెనుక వైపు ఢీ కొట్టింది. ఐచర్ వాహనంలో ఉన్న నలుగురు వ్యక్తుల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా సుభాష్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతులు కర్ణాటకకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం నిరంపల్లె గ్రామ జాతీయ రహదారిపై తెల్లవారుజామున చెప్పుల లోడు తో వెళుతున్న బొలెరో వాహనం లారీని ఢీకొంది. దీంతో బొలెరో వాహనం లో మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఈ సంఘటనలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బొలెరో వాహనం డ్రైవర్ మంటల్లో నుంచి దూకి పరారయ్యాడు. బొలోరో క్లీనర్ కు లారి లోని ఇంకొక డ్రైవర్ కు వారిద్దరికీ స్వల్ప గాయాలు కావడంతో జిల్లాప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. డి.ఎస్.పి, సిఐ ప్రమాద స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు నుండి కోల్కతా ఉల్లిగడ్డలోడు తో వెళ్తున్న లారీని విజయవాడ నుండీ అనంతపురం వెళ్తున్న చెప్పుల లోడు తో వెళ్తున్న బొలెరో వాహనం ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది.
కడప జిల్లా.. జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని ముద్దనూరు మండలం చింతకుంట గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి చెందగా 15 మంది త్రీవంగా గాయపడ్డారు. కొండాపురం నుంచి వేంపల్లి వెళ్తున్న రెండు పెళ్లి బస్సులు ఒకదాని వెనుక ఒకటి ఢీకొన్నాయి. దీంతో పెళ్లి బృందంలోని ఒక వ్యక్తి అక్కడికి అక్కడే మృతి చెందగా 15 మందికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.