కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ ఎం కృష్ణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాయన..ఈ రోజు తెల్లవారుజామున బెంగళూరులోని సదాశివనగర్ లో తుదిశ్వాస విడిచారు. కాంగ్రెస్ లో సీనియర్ నేతగా కొనసాగిన ఎస్ ఎం కృష్ణ వివిధ కీలక పదవులు నిర్వహించారు. 2004-2009 మధ్య కర్ణాటక సీఎంగా ఆయన పనిచేశారు. ఈ సమయంలో బెంగళూరులో ఐటీ రంగం అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఆ తర్వాత 2004 డిసెంబర్ నుంచి 2008 మార్చి వరకు మహారాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు నిర్వర్తించారు.
అనంతరం యూపీఏ హయాంలో 2009-2012 మధ్య విదేశాంగా మంత్రిగా ఎస్ ఎం కృష్ణ పనిచేశారు. దాదాపు 50 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న ఎస్ ఎం కృష్ణ,.2017లో బీజేపీలో చేరారు. గతేడాది రాజకీయాలనుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. 2023లో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను పద్మవిభూషణ పురస్కారంతో సత్కరించింది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- కరీంనగర్ జిల్లా ఘన్ముక్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విచిత్ర పరిస్థితి.ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తోంది. ఆధునిక తరగతి గదులు, డిజిటల్ బోర్డులు, కంప్యూటర్ ల్యాబ్‌లు, మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. అయితే కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఒక ప్రభుత్వ ఉన్నత…
- అరకులోయలో ట్రైబల్ ఆర్టిజన్ మేళా ఘనంగా ప్రారంభం.అడవుల ఒడిలో పుట్టిన గిరిజన ఉత్పత్తులకు దేశవ్యాప్త మార్కెట్ దిశగా అరకులోయలో కీలక అడుగు పడింది. గిరిజన కళ, కృషి, సంప్రదాయానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో నిర్వహించిన ట్రైబల్ ఆర్టిజన్ మేళా విశేష స్పందన లభిస్తోంది. భారత ప్రభుత్వ…
- నకిలీ జెమిని టీ పౌడర్ బాక్సులను పట్టుకున్న పోలీసులు.మంచిర్యాల జిల్లా మందమర్రి మార్కెట్లోని మహేశ్వర ట్రేడర్స్ నుంచి గోలేటికి అక్రమంగా తరలిస్తున్న నకిలీ జెమిని టీ పౌడర్ బాక్సులను పోలీసులు వాహన తనిఖీల్లో పట్టుకున్నారు. స్థానిక టోల్ గేట్ వద్ద సాధారణ వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ అక్రమ రవాణా…
- జూపార్క్ ను సందర్శించిన ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు.ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆధ్వర్యంలో అసెంబ్లీ వన్యప్రాణి – పర్యావరణ పరిరక్షణ కమిటీ ఏర్పడింది. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర జూలాజికల్ పార్క్ ను కమిటీ సందర్శించింది. ఆధునికీకరణ, అభివృద్ధిపై కీలక సమీక్ష నిర్వహించింది. స్పీకర్ అయ్యన్నపాత్రుడితో పాటు ఎమ్మెల్యేలు…
- ఇరాన్‌పై అమెరికా రెండో విడత దాడులు.పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకున్నాయి. ఇరాన్ లక్ష్యంగా అమెరికా సైన్యం మరో విడత భారీ దాడులను ప్రారంభించింది. అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకల రక్షణే ధ్యేయంగా ఈ దాడులు జరుపుతున్నట్లు అమెరికా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 212431