రైతులకు ఆర్బీఐ తీపి కబురు అందించింది. వ్యవసాయ అవసరాలకు, పంట సాగు కోసం ఎలాంటి తాకట్టు లేకుండా అందించే రుణ సదుపాయాన్ని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రైతులకు ఎలాంటి తనఖా లేకుండా ఒక లక్షా 60వేల వరకూ రుణం తీసుకునే అవకాశం ఉండగా, దాన్ని 2 లక్షల వరకూ పెంచింది.
వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. పంట సాగుకు రైతులు పెడుతున్న ఖర్చులను, ద్రవ్యోల్బణం పెరుగుదలను పరిశీలిస్తూ ఆర్బీఐ ఈ పరిమితి పెంచుతూ వస్తోంది. నిబంధనల ప్రకారం .. సాధారణంగా భూ యజమాని నుంచి ఎలాంటి పూచీకత్తు అడగకుండా బ్యాంకులు రుణాలు మంజూరు చేయాల్సి ఉన్నా క్షేత్ర స్థాయిలో ఇది అమలు కావడం లేదు. బ్యాంకులు ఎవరో కొందరికి డిపాజిట్లు ఉన్న రైతులకు మాత్రమే ఇలాంటి రుణాలు మంజూరు చేస్తున్నాయి. దీంతో రైతులు ప్రైవేటు వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు రుణాలను తీసుకొని అప్పులపాలవుతున్నారు. ఇలాంటి వారికి అండగా ఉండేందుకే ఆర్బీఐ ఈ సదుపాయం కల్పిస్తోంది. వ్యవసాయ పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నందున రైతులకు రుణ సదుపాయం మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ చర్యల వల్ల చిన్న, సన్నకారు రైతులైన 86 శాతం మందికి ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్.దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. వచ్చే నెల 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొనే అవకాశమున్నట్లు సమాచారం. 2019లో చివరిసారిగా భారత్‌కు వచ్చిన షీ జిన్‌పింగ్,…
- పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. సముద్ర వేటకు వెళ్లిన బోటు.. ఇసుకదిబ్బను ఢీకొనడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకి.. ఈదుకుంటూ ఒడ్డుకు…
- 22ఏపై బీజేపీ దీక్షలు.భూ భారతి పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సెక్షన్ 22ఏ కింద లక్షలాది ఎకరాల భూములను ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ధరణి పోర్టల్‌పై నిర్వహించిన…
- సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముందు వెళ్తున్న కంటైనర్‌ను అత్యంత వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా..…
- భారత సైన్యం చేతికి ‘షేర్’.. ఏకే-203 రైఫిళ్లు రెడీ.రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లా కోర్వాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో దేశీయంగా తయారైన ఏకే-203 అసాల్ట్ రైఫిళ్లు భారత సైన్యానికి అందించేందుకు సిద్ధమయ్యాయి. త్వరలోనే వీటి డెలివరీ ప్రారంభం కానుంది. అత్యాధునికమైన…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి