కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అయి పేలుడు సంభవించింది. గ్రామ ఉపసర్పంచ్ మామిడి మల్లిబాబు నివాసంలో వంట చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 14 ఏళ్ల శ్రావణి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. చిన్నబాబు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడగా, మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పేలుడు భారీగా జరగడంతో ఇంట్లోని సామగ్రి ధ్వంసం కాగా, ఇల్లు పూర్తిగా దెబ్బతింది. పిఠాపురం సీఐ శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Gas cylinder explosion
తూర్పుగోదావరి జిల్లా, నల్లజర్ల లో భారీ అగ్నిప్రమాదం. పోలీస్ స్టేషన్ కు అతి సమీపంలో ఉన్న పదిహేను ఇళ్లను చుట్టుముట్టిన మంటలు. గ్యాస్ సిలెండర్ లు పేలడంతో సంభవించిన అగ్ని ప్రమాదం. తెల్లవారుజామున 3 గంటలకు ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో నిద్రమత్తులో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడి పరుగులు తీసిన వైనం. సంఘటన స్థలానికి చేరుకున్న మూడు ఫైరింఇంజిన్లు. స్థానిక ప్రజలను దగ్గరలో ఉన్న SRK కళాశాలకు తరలింపు. లక్షలాది రూపాయలు ఆస్తి నష్టం. 15 ఏళ్ళు ఒక్కసారిగా మంటలలో దగ్ధం కావడంతో నిరాశ్రయులైన బాధితులు.
విజయనగరం జిల్లా లక్కవరపుకోట గవరవీధిలో గ్యాస్ సిలిండర్ పేలి 5 గురికి తీవ్ర గాయాలు వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. ఇందులో ముగ్గురు చిన్న పిల్లలు కూడా ఉన్నారు.. వీరిని శృంగవరపుకోట ప్రభుత్వ ఆసుపత్రికి 108 లో తరలించారు. ఉదయం టీ పెట్టుకుందామని గ్యాస్ వెలిగించడంతో ఒక్కసారిగా సిలిండర్ పేలడంతో ఘటన జరిగిందని సమాచారం. గాయాలు పడిన వారికి ప్రధమ చికిత్స చేసి విశాఖ కె.జి.హెచ్ కు తరలించారు. ఓకే కుటుంబానికి చెందిన వారు గాయ పడిన వారి వివరాలు తామరాపల్లి వెంకటలక్ష్మి 50 సం,, ప్రాణవి 7 సం,, కెల్లా మోహన్ 10 సం,, కెల్లా లాష్య 8 సం,, కెల్లా శ్రావణి 30 సం,, సంఘటన స్థలానికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే మరియు శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి కోళ్ల లలిత కుమారి.. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ ఎల్.కోట గ్రామ పంచాయతీలో ఎన్నడూ లేని విధంగా ఈ రోజు జరిగిన గ్యాస్ సిలిండర్ సంఘటన జరగడం చాలా దురదృష్టకరం అని అన్నారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోని గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించి, వెంటనే బాధితుల కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు





Total views : 78905