ఆరు ఓటముల తర్వాత ఎట్టకేలకు బెంగళూరు(Bangalore) రెండో విజయం సాధించింది. హైదరాబాద్(Hyderabad)తో జరిగిన పోరులో ఆజట్టు 35 పరుగుల తేడాతో నెగ్గింది. 207 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులకే పరిమితం అయింది. ఆ జట్టులో షాబాజ్ అహ్మద్ (40) టాప్ స్కోరర్. ఓపెనర్ అభిషేక్ శర్మ (31), కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (31) చెలరేగారు.
ఇది చదవండి: LSG vs DC IPL 2024 | ఐపీఎల్ పదిహేడో సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో విజయం..
మిగతావారు విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లలో స్వప్నిల్ సింగ్, గ్రీన్, కర్ణ్ శర్మ తలో రెండు వికెట్లు తీశారు. విల్ జాక్స్, యశ్ దయాల్ చెరో వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన డుప్లెసిస్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 51, రజత్ పటిదార్ 50, కామెరూన్ గ్రీన్ 37, డుప్లెసిస్ 25 పరుగులతో రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్ మూడు వికెట్లు పడగొట్టగా, నటరాజన్ 2, కమిన్స్, మార్కండే ఒక్కో వికెట్ తీశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- 15 ఏళ్ల వయసులో ఐపీఎల్‌ను శాసించిన వైభవ్.భారత క్రికెట్‌కు మరో అద్భుతమైన యువ సంచలనం దొరికింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్-2026 సీజన్‌ను తన పేలవమైన కాదు, పేలుడు బ్యాటింగ్‌తో ఏకంగా శాసించాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన ఈ యువ ఆటగాడు…
- ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్‌పై గెలిచిన బెంగళూరు..IPL 2026 సీజన్ విజేతగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ నిలిచింది. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ ను 5 వికెట్ల తేడాతో ఓడించి వరుసగా రెండోసారి టైటిల్ ను ముద్దాడింది. తొలుత బ్యాటింగుకు దిగిన గుజరాత్ 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి…
- గిల్ నిరాశ.. కోహ్లీ పరవశం: ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ ఘన విజయం..కోహ్లీ విజయాన్ని ఖాయం చేసిన తర్వాత తన హెల్మెట్‌ను తీసి, కుడి చేతిని పైకి ఎత్తి డగౌట్ వైపు సంకేతం చేశాడు. వెంటనే సహచర ఆటగాళ్లు పరుగెత్తుకుంటూ వచ్చి అతన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆ మహానుభావుడు తన బ్యాట్‌ను…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 90724