ఆకుకూరలు తినండి.. మధుమేహానికి చెక్ పెట్టండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆకుకూరలను తినడం వల్ల మధుమేహానికి దూరంగా ఉండవచ్చని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాదు, ఆకుకూరలే కాకుండా రోజూ పల్లీలు, ఇతర డ్రై ఫ్రూట్స్ తీసుకునే వారిలో కూడా మధుమేహంతోబాటు ఇతర గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రతిరోజూ పల్లీలు తినేవారిలో మధుమేహం వచ్చే ప్రమాదం ఇరవైవొక్క శాతం తగ్గుతుందని అధ్యయనంలో తేలింది. డ్రైఫ్రూట్స్ శరీరానికి అవసరమైన కొవ్వును అందిస్తూనే బరువును అదుపులో ఉంచుతాయని న్యూట్రీషన్లు అంటున్నారు. ఆకుకూరల్లో కెలోరీలు, కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ప్రతిరోజూ ఏదో ఒక ఆకుకూర తీసుకొనే వారిలో మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పధ్నాలుగు శాతాన్ని తగ్గించవచ్చంటున్నారు. కాబట్టి ఆహారం ఆకుకూరలు వారానికి మూడు సార్లు తీసుకుంటూ వుండండి.
Heart diseases
చైనాలో ఎప్పట్నుంచో వినియోగిస్తున్న ఈ నల్ల బియ్యాన్ని శాస్త్రవేత్తలు ఇప్పుడు “సూపర్ ఫుడ్”గా అభివర్ణిస్తున్నారు. వీటిలో చక్కెర తక్కువగా ఉండటమే కాదు ఆరోగ్యాన్ని కాపాడే పీచు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా దండిగా ఉంటాయని లూసియానా రాష్ట్ర విశ్వవిద్యాలయం చేసిన అధ్యాయనంలో వెల్లడైంది. ఇవి గుండె జబ్బులు, క్యాన్సర్లతో పోరాడటంలో దోహదం చేస్తాయని పరిశోధక్లు చెబుతున్నారు. “చెంచాడు నల్లబియ్యం తవుడులో బ్లాక్బెర్రీల్లో కన్నా అధికంగా యాంతోసైయానిన్ ఆక్సిడెంట్లు ఉంటాయి. చక్కెర మోతాదు తక్కువగానూ పీచు, “విటమిన్ ఈ” ఎక్కువగానూ ఉన్నాయని అధ్యయానానికి నేతృత్వం వహించిన డాక్టర్ జిమిన్ జు పేర్కొన్నారు. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు తీసుకోవటాన్ని ప్రోత్సాహించటానికి నల్లబియ్యం తవుడు ప్రత్యేకమైన, చవకైన మార్గమని ఆయన సూచించారు.బ్లూబెర్రీలు, ఎండు మిరప వంటి పండ్లు, కూరగాయలకు ఈ యాంతోసైయానిన్లు ముదురురంగును తెచ్చిపెడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు అయిన ఇవి రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి. డీఎన్ఏ దెబ్బతినకుండా కాపాడుతూ క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటాయని పరిశోధకులు వివరించారు. పూర్వకాలంలో ఈ నల్లబియ్యాన్ని “నిషిద్ద బియ్యం” అని పిలుచుకునేవారు.
Read Also..
Read Also..




Total views : 78479