ఇరాన్, అమెరికా మధ్య మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పరస్పర దాడులతో రెండు దేశాల మధ్య మళ్లీ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. తమ ఆయిల్ ట్యాంకర్ పై దాడికి ప్రతిగా హర్మూజ్ జలసంధిలోని 3 అమెరికా నౌకలపై ఇరాన్ దాడి చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేసింది ఇరాన్. అందుకు బదులుగా అమెరికా…ఇరాన్ పోర్టులపైన దాడులకు దిగింది. ఇరాన్ ముందు దాడి చేసిందని..అందుకే తాము కేవలం ఆత్మ రక్షణ కోసమే అలా చేయాల్సి వచ్చిందని..ఇది పూర్తిస్థాయి యుద్ధానికి తెర దీయలేదని అమెరికా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు ట్రంప్ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వీలైనంత త్వరగా ఒప్పందం చేసుకోకపోతే భీకర దాడులతో విరుచుకుపడతామని హెచ్చరించారు. ఇరాన్ దాడుల్లో తమ మూడు యుద్ధ నౌకలకు ఎలాంటి నష్టం జరగలేదని..ఎదురుదాడుల్లో అనేక ఇరాన్ డ్రోన్లు, బోట్లు ధ్వంసం అయ్యాయని తెలిపారు.
Tag:





Total views : 75006