తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో 8 స్థానాల్లో పోటీ చేసిన పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన దారుణ ఓటమి పాలైంది. బీజేపీతో కలిసి బరిలోకి దిగిన జనసేన తొలుత 11 స్థానాల్లో పోటీ చేయాలని భావించింది. చివరికి 8 స్థానాలకు పరిమితమై కూకట్పల్లి, తాండూరు, కోదాడ, నాగర్‌కర్నూలు, ఖమ్మం, కొత్తగూడెం, వైరా , అశ్వారావుపే స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. వీరికోసం పార్టీ అధ్యక్షుడు పవన్ ప్రచారం చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూకట్‌పల్లిలో ప్రచారం చేశారు. అయినప్పటికీ అందరూ ఓటమి పాలయ్యారు. అంతేకాదు, ఏ ఒక్కరూ డిపాజిట్ దక్కించుకోలేకపోయారు.
కూకట్పల్లి నుంచి పోటీచేసిన ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్ ఒక్కరే 39,830 ఓట్లు సంపాదించుకోగలిగారు. మిగతా వారందరూ 5 వేల లోపు ఓట్లకు పరిమితమయ్యారు. తాండూరులో జనసేన అభ్యర్థికి 4,087 ఓట్లు పోలవగా, కోదాడలో 2,151, నాగర్‌కర్నూలులో 1,955, ఖమ్మం 3,053, వైరా 2,712, వైరా 2,712, కొత్తగూడెం1,945, అశ్వారావుపేట అభ్యర్థికి 2,281 ఓట్లు పోలయ్యాయి.
ఈ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన సీపీఎం పోటీ చేసిన 19 స్థానాల్లోనూ డిపాజిట్ కోల్పోయింది. అంతేకాదు, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి వంటి కీలక నేతలు కూడా డిపాజిట్ కోల్పోయారు. సీపీఎం తొలుత కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయాలని నిర్ణయించినా పొత్తు చర్చలు ఫలించకపోవడంతో ఒంటరిగా బరిలోకి దిగి ఓటమి పాలైంది.
Janasena
జనసేన పార్టీకి యువతే పెద్ద బలం అని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. ఏపీలో జనసేనకు ఆరున్నర లక్షల క్యాడర్ ఉందన్నారు. మంగళగిరిలో జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడారు. యువత ఆదరణ చూసే తెలంగాణలో 8 చోట్ల పోటీ చేశామన్నారు. నేనేం చేసినా దేశ సమగ్రత గురించే ఆలోచిస్తానని స్పష్టం చేశారు. కార్యకర్తల చిత్తశుద్ధి వల్లే జనసేనకు ఢిల్లీలోనూ గుర్తింపు వచ్చిందని తెలిపారు. నన్ను, నా భావజాలాన్ని నమ్మే యువత జనసేన వెంట వస్తున్నారని చెప్పారు. భావజాలం ఏమీ లేని పార్టీ వైసీపీ అని పవన్ ఎద్దేవా చేశారు.
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ముఖ్య మంత్రిని విమర్శించే స్థాయి టిడిపి జనసేన నాయకులకు లేదంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి స్థానిక టిడిపి మాజీ ఎమ్మెల్యే హేమలత జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ లు ఇరువురు నోరు అదుపులో పెట్టుకుని ముఖ్యమంత్రి గురించి అవాకులు చవాకులు పేలితే చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందంటూ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్థానిక మండల పరిధిలోని పెద్ది ఈటిపాకం పంచాయతీలో జగనన్నే మళ్లీ సీఎం కావాలి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడి విద్యాదేవన వృద్ధులకు వితంతువులకు పెన్షన్లు నాడు నేడు కార్యక్రమం ద్వారా స్కూలు అభివృద్ధి ఆసరా చేయూత రైతులకు వడ్డీలు లేని రుణాలు ఇలా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు అందిస్తూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న మహోన్నత వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటూ ఆయన పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాల నిధుల్ని ముఖ్యమంత్రి జగనన్న బటన్ నొక్కి నేరుగా అర్హులైన వారి ఖాతాల్లోకి వేస్తున్నారంటూ ఆయన అన్నారు. సచివాలయ సిబ్బంది ద్వారా సంక్షేమ పథకాలు అందని వారిని గుర్తించి వారికి కూడా సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని అన్నారు. గత తెలుగుదేశం పార్టీ హయంలో సత్యవేడు అభివృద్ధికి ఏమి చేశారో టిడిపి నాయకులు బహిరంగ చర్చకు రావాలంటూ ఆయన డిమాండ్ చేశారు. టిడిపి పార్టీ శ్రేణులకు అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం సీఎం జగనన్నను సైకో అంటూ విమర్శలు చేయడం తప్ప ఇంకేమీ చేతకావంటూ ఎద్దేవా చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు 2024 ఎన్నికల్లో ప్రజల అండదండలతో భారీ మెజార్టీ గెలుస్తారని ఆయనే మళ్లీ సీఎం అవుతారంటూ ఆయన పేర్కొన్నారు.
నువ్వు రాజకీయ విటుడివా లేక రాజకీయ బ్రోకరువా అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం చేస్తుండటంపై అంబటి మండిపడ్డారు. పదేళ్ల నుంచి రాజకీయాలు చేస్తున్నావు. నువ్వు రాజకీయ నాయకుడివా, లేక రాజకీయ నటుడివా, లేకపోతే రాజకీయ విటుడివా, లేక రాజకీయ బ్రోకరువా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘అసలు నీ వ్యక్తిత్వం ఏంటి? నీ వ్యవహారం ఏంటి? ఇవాళ తెలంగాణలో ఏం జరుగుతోంది? తెలంగాణ రాజకీయాల్లో నీ పాత్ర ఏంటి? తెలంగాణలో నువ్వు ఎవరికి మద్దతు ఇస్తున్నావ్? చంద్రబాబు ఎవరికి మద్దతు ఇస్తున్నాడు? అని మంత్రి అంబటి రాంబాబు నిలదీశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బీజేపీ, బీఆర్ఎస్ సవాల్ చేస్తుంటే నీ జెండా ఎక్కడ కట్టావ్, బీజేపీ పక్కన కట్టావ్. మరి చంద్రబాబు జెండా ఎక్కడ కట్టాడు, కాంగ్రెస్ పక్కన కట్టాడు. ఏం బతుకులయ్యా మీవి? చంద్రబాబేమో ఇంట్లో కూర్చుంటాడు. కాంగ్రెస్ మీటింగులు జరుగుతుంటే వాటిల్లో పచ్చ జెండాలు పైకి లేస్తుంటాయి. బీజేపీలో ఏమో నువ్వు డైరెక్టుగా వెళ్లి జెండాలు కట్టి కూర్చున్నావు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Read Also..
Read Also..
రెండున్నర నెలల సుదీర్ఘ విరామం తర్వాత టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర తిరిగి ప్రారంభమైంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలోని పొదలాడలో మళ్లీ తొలి అడుగుపడింది. రెట్టించిన ఉత్సాహంతో ప్రారంభమైన యాత్రకు జనం పోటెత్తారు. తాటిపాక సెంటర్లో జరిగిన బహిరంగ సభకు జనం సునామీలా వచ్చారు. కోనసీమ నలుమూలల నుంచి వచ్చిన ప్రజలతో పరిసరాలు కిక్కిరిసిపోయాయి. సంఘీభావంగా టీడీపీ, జనసేన కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. లోకేశ్ మాట్లాడుతూ తనపై ఆరు కేసులు పెట్టినా వెనక్కి తగ్గలేదని స్పష్టం చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా యువగళం పాదయాత్రను అడ్డుకోలేరని స్పష్టం చేశారు. చంద్రబాబును జైలుకు పంపితే తన పాదయాత్ర ఆగుతుందని భ్రమపడ్డారని ఎద్దేవా చేశారు. స్కిల్ ఖాతాలో ఒక్క ఆధారమైనా చూపించలేకపోయారని ధ్వజమెత్తారు.
కుత్బుల్లాపూర్ నియోజక వర్గ బిజెపి పార్టీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ కు మద్దతు గా పవన్ కళ్యాణ్ ప్రచాకం నిర్వహించారు.ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. కుత్బుల్లాపూర్ లో బలమైన నాయకుడు శ్రీశైలం గౌడ్ అని అన్నారు.కుత్బుల్లాపూర్ లో ఏ సమస్యలు ఉన్న భారతీయ జనతా పార్టీ, జనసేన సమిష్టిగా పోరాడుతుందని అన్నారు. శ్రీశైలం ను ఎమ్మెల్యేగా గెలిపించాలని అభ్యర్దించారు. తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి కావలసిన అవసరం ఎంతైనా ఉందనీ,బీసీ ముఖ్యమంత్రి బిజెపితోనే సాధ్యం అని తెలిపారు. కుత్బుల్లాపూర్ లో శ్రీశైలం గౌడ్ కు ఓటేస్తే పవన్ కళ్యాణ్ కు ఓటేసినట్లే అని అన్నారు.
కుత్బుల్లాపూర్ ప్రజల ప్రేమకు ధన్యవాదాలు తెలుపుతున్న. కుత్బుల్లాపూర్ లో బలమైన నాయకుడు శ్రీశైలం గౌడ్. కుత్బుల్లాపూర్ లో ఏ సమస్యలు ఉన్న భారతీయ జనతా పార్టీ, జనసేన సమిష్టిగా పోరాడుతుంది దేశానికి మోడీ గారి లాంటి బలమైన నాయకత్వం కావాలి. నా మిత్రుడు శ్రీశైలం ను ఎమ్మెల్యేగా గెలిపించాలి. తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి కావలసిన అవసరం ఎంతైనా ఉంది బీసీ ముఖ్యమంత్రి బిజెపితోనే సాధ్యం. నరేంద్ర మోడీ గారికి ఓటేస్తే పవన్ కళ్యాణ్ కు ఓటేసినట్టే. కుత్బుల్లాపూర్ లో శ్రీశైలం గౌడ్ కు ఓటేస్తే పవన్ కళ్యాణ్ కు, జనసేనకు వేసినట్టే. దేశంలో ఉగ్రదాడులు జరగకుండా బలంగా నిలబడిన పార్టీ బిజెపి. నరేంద్ర మోడీ గారి లాంటి ఒక బలమైన నాయకత్వంలో దేశం ప్రగతిపథాన నడుస్తుంది.
విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్ లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో బోట్లు కోల్పోయిన బాధితులకు ఆర్థిక సాయం చేయాలని టీడీపీ నిర్ణయించింది. ఈ మేరకు పూర్తిగా బోట్లు కోల్పోయిన వారికి రూ.లక్ష చొప్పున అందించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా పాక్షికంగా బోట్లు పాడైపోయిన వారికి రూ.50 వేలు, బోటుకలాశీలకు రూ.5 వేల చొప్పున పార్టీ ఆర్థికసాయం అందించనుంది. ఫిషింగ్ హార్బర్ లో బోట్లు కోల్పోయిన బాధితులను పూర్తిగా ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. చేసే సాయానికి కూడా అంతశాతం..ఇంతశాతం అంటూ అంటూ కొర్రీలు విధించింది. బాధితులకు బాసటగా నిలబడేందుకే ఆర్థిక సాయం అందించేందుకు టీడీపీ ముందుకు వచ్చింది. టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే బాధితులకు కొత్తబోట్లు అందించడంతో పాటు అన్ని విధాలా ఆదుకుంటాం.
స్నేహం వేరు, రాజకీయం వేరన్నారు పవన్ కళ్యాణ్. మంత్రి కేటీఆర్ తో స్నేహం ఉన్నా, కేసీఆర్ తో పరిచయం ఉన్నా రాజకీయంగా విభేదిస్తానని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీనే అభిమానిస్తానన్నారు. తెలంగాణలో అత్యధిక జనాభా బీసీలే అన్న జనసేనాని సీఎం పదవి వారికే దక్కాలని ఆకాంక్షించారు. అందుకే బీసీ నినాదం ఎత్తుకున్న బీజేపీకి జైకొట్టినట్లు కొత్తగూడెం ఎన్నికల ప్రచారంలో తెలిపారు. తన కుటుంబంలో కొందరు వ్యక్తులు వైసీపీని సమర్థించినా తాను మాత్రం విభేదించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ బండి కి జాకీలు వేసి బిజెపి, జనసేన పార్టీలు తిరిగి తెలుగుదేశం పార్టీకి జీవం పోయడానికి ప్రయత్నిస్తున్నాయని. ఇందులో భాగంగా బిజెపి నాయకులు భాను ప్రకాష్ రెడ్డి తిరుపతి అభివృద్ధి కోసం కేటాయించాలనుకుంటుంన్న శ్రీవారి ఒక శాతం నిధులను వ్యతిరేకించడం లోనే అంతరార్థం బయట పడింది అని వైసీపీ నేతలు ముద్ర నారాయణ, బాలిశెట్టి కిషోర్, వాసు యాదవ్, దొడ్డ రెడ్డి మురళి తదితరులు విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ గత చరిత్రలో భాను ప్రకాష్ రెడ్డి కౌన్సిలర్ గా, టీటీడీ బోర్డు మెంబర్ గా పనిచేసిన కాలంలో కమిషన్ లేనిదే పనిచేయ డన్న కీర్తిని గడించారన్నారు. దీనిని బట్టి చూస్తే నేడు ఎంత సంపాదించడానికి ఒక శాతం నిధులకు అడ్డుపడుతున్నాడని అనుమాన వ్యక్తం చేశారు. దీనివలన ప్రత్యక్షంగా కారు తదితర ప్రైవేటు వాహనాల కార్మికులు, పరోక్షంగా తిరుపతి ప్రజలు, భక్తులు, ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భానుకు కళ్ళు తెరిపించాలని వెంకన్నను వేడుకుంటున్నాము అన్నారు.
Read Also…
Read Also…






Total views : 90157