తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే జనసేన మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. బీజేపీ పోటీ చేస్తున్న స్థానాల్లో జన సైనికులు మద్దతివ్వాలని కోరారు. కొత్తగూడెంలో జనసేన అభ్యర్థి సురేంద్రరావుకు మద్దతుగా పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం 1200 మంది ఉద్యమకారుల బలిదానంతో తెలంగాణ ఏర్పడిందన్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని పలికిన దాశరథి కృష్ణమాచార్యులను తాను స్ఫూర్తిగా తీసుకున్నట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమ పోరాట స్ఫూర్తితోనే ఏపీలో రౌడీలు, గూండాలను ఎదుర్కొంటున్నానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పారు. ఇదే నా ఇజం హ్యూమనిజం అని స్పష్టం చేశారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న యువతకు జనసేన అండగా ఉంటుందని వెల్లడించారు.
Janasena
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. జనసేనాని పర్యటన నేపథ్యంలో ప్రగతి మైదానంలో లో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. ప్రగతి మైదానం నుండి భారీ కాన్వాయి తో ప్రకాశం మైదానానికి చేరుకోనున్నారు. బీజేపీ బలపరిచిన జనసేన కొత్తగూడెం నియోజకవర్గ అభ్యర్థి లక్కినేని సురేందర్ కు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. రాష్ట్రంల నలుమూలల నుంచి పవన్ కళ్యాణ్అ భిమానులు సభకు హాజరుకానున్నారు. బీజేపీ, జనసేన కార్యకర్తలు సుమారు 80 వేల మంది వరకు పవన్ సభకు హాజరు కానున్నట్లు అంచనా వేస్తున్నారు పార్టీ నేతలు.
Read Also..
Read Also..
బలిదానాలపై ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం అవినీతిమయం కావడం ఎంతో బాధ కలిగించిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. హనుమకొండలో నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభలో పవన్ మాట్లాడారు. ఏ మార్పు కోరుతూ తెలంగాణ బిడ్డలు చనిపోయారో అది సాధిస్తానన్నారు. నా పోరాటానికి తెలంగాణ యువత అండగా ఉంటోందని ధీమా వ్యక్తం చేశారు. నాకు తెలంగాణ ఎంతో బలాన్నిచ్చిందని, తెలంగాణ ఇచ్చిన స్ఫూర్తితోనే ఏపీలో రౌడీలతో పోరాడుతున్నానన్నారు.ఆంధ్రా జన్మనిస్తే తెలంగాణ పునర్ జన్మనిచ్చిందని అన్నారు. పదేళ్లలో తాను తెలంగాణపై మాట్లాడలేదని అన్నారు. ప్రధాని అంటే తనకు ఎంతో గౌరవం ఉందని తెలిపారు. దశాబ్దం తర్వాత మాట ఇస్తున్నానని… వచ్చే ఏడాది నుంచి ఆంధ్రాలో లాగే తెలంగాణలోనూ తిరుగుతాను అని జనసేనాని స్పష్టం చేశారు.బీసీ ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వారిలో తాను కూడా ఉన్నానన్నారు. తెలంగాణలో జనసేన ఉంటుందని బీజేపీతో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. తెలంగాణ పోరాట స్ఫూర్తితోనే జనసేన స్థాపించామని తెలిపారు.
బీజేపీ తోపాటు జనసేన పార్టీ సేవలు అవసరం అనిపిస్తుంది. బీసీ బిడ్డను సీఎం గా చూడాలని బీజేపీ కోరుతున్న అజెండాలో నేను కూడా ఒక్కడిని. ఆంధ్ర నాకు జన్మనిస్తే తెలంగాణ పునర్జన్మణించింది. తెలంగాణలో కనీసం త్రాగు నీళ్లు లేని తండాలను గతంలో నేను గుర్తించా. అదిలాబాద్ జిల్లా ఓ తండాలో నేను భోరు బావి వేయించా. వరంగల్ తూర్పు, పశ్చిన అభ్యర్ధులను ఖచ్చితంగా గెలిపించుకుంటాం.. ఇక నుండి మీ కష్టసుఖాల్లో నేను పాలు పంచుకుంటా. అవినీతి రహిత తెలంగాణను నేను కోరుకుంటున్నా. గద్దర్ తో కలిసి సామాజిక తెలంగాణ సాధించాలనుకున్నా. మోడి తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిగా హామి ఇచ్చారు. ఇప్పటికే ముప్పై ఒక్క మంది ఓబీసీలను కేంద్ర మంత్రులుగా నియమించారు. గద్దర్ మరియు నా ఆశయాలు నెరవేరే క్షణం ఇప్పుడు సాకారం అవ్వబోతుంది. బీజేపి అధికారంలోకి రాగానే ఓరుగల్లు భద్రకాళి వారికి మొక్కులు తీర్చుకుంటా. తెలంగాణ నా గుండె చప్పుడు…ఆ మాట వింటే చాలు నా రోమాలు నిలుచుంటాయి. రౌడీలను, ఫ్యాక్షనిస్టులను ఎదుర్కొంటున్న నేను తెలంగాణ కోసం ఎంతకైనా తెగిస్తాను. నాకు దన బలం లేకున్నా గుండె బలం వచ్చింది తెలంగాణ ఉద్యమ ఘటనలే… పదె పదె గద్దర్ ప్రస్తావన తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్…నాకు ఇష్టమైన నాయకుడు భాతర ప్రధాన మంత్రి నరేంద్ర మోది…తెలంగాణ సాధనలో భవిష్యత్తు కోసం 1200 అమరులయ్యారో వారి సాక్షిగా భవిష్యత్తు కోసం జనసేనా కొనసాగిస్తుంది.
నేడు వరంగల్ కు పవన్ కళ్యాణ్ రానున్నారు. హనుమకొండ బిజెపి అభ్యర్థి రావు పద్మ, వరంగల్ తూర్పు బిజెపి అభ్యర్థి ప్రదీప్ రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. జనసేన అధినేత వరంగల్ హంటర్ రోడ్ లోని సిఎస్ఆర్ గార్డెన్ వద్ద బిజెపి శ్రేణులు భారీగా సభ ఏర్పాట్లు చేశారు. భారీ సంఖ్యలో పాల్గొననున్న బిజెపి, జనసేన, పవన్ కళ్యాణ్ అభిమానులు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేటి నుంచి తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కూటమిగా పోటీ చేస్తున్నాయి. 119 నియోజకవర్గాలకు గాను బీజేపీ 111, జనసేన 9 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఇటీవల ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బీసీల ఆత్మగౌరవ సభలో ప్రధాని నరేంద్రమోదీతో పాటు పవన్ పాల్గొన్నారు. ఇప్పుడు బీజేపీ, జనసేన అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. నేడు వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రావు పద్మకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 25న తాండూరులో జనసేన అభ్యర్థి శంకర్ గౌడ్, 26న కూకట్ పల్లిలో జనసేన అభ్యర్థి ప్రేమ్ కుమార్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే సభలలోనూ ఆయన పాల్గొననున్నారు.
బాపట్ల జిల్లా
చుండూరు మండలం ఆలపాడు గ్రామంలో జనసేన నేతలతో కలిసి టీడీపీ నేతలు పర్యటింటారు. మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు, వేమూరు నియోజకవర్గం జనసేన సమన్వయ కర్త ఉషా రాజేష్ తో కలిసి బాబు షూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో రూపొందించిన మినీ మ్యానిపెస్టోపై ప్రజల్లో అవగాహన కల్పించారు. ఇంటింటికి వెళ్లి మహిళలు, యువతతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. గ్రామంలో మినీ మేనిఫెస్టో కరపత్రాలను అందజేసారు. టీడీపీ అధికారంలోకి వస్తే అమలు చేయబోయే సంక్షేమ పథకాలు మహాశక్తి, యువగళం, అన్నదాత, ఇంటింటికీ నీరు, పూర్ టు రిచ్, బీసీ రక్షణ చట్టం గురించి వివరించారు. చంద్రబాబు ఒక విజన్ ఉన్న నాయకుడని.. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు అత్యవసరమన్నారు.
Read Also…
Read Also…
తెలంగాణలో మార్పు అవసరమని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఆమె కూకట్‌పల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళితబందు స్కీమ్‌లో అవినీతి జరుగుతోందని, ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ కూడా అంగీకరించారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ తమ మిత్రపక్ష జనసేన అభ్యర్థి ప్రేమ్ కుమార్‌ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రేమ్ కుమార్‌ని గెలిపించాక నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు కేంద్రం నుంచి కూడా మద్దతు ఉంటుందని వెల్లడించారు.లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్లలో చేసిందేమీ లేదన్నారు. మోదీ ప్రభుత్వం నాలుగు కోట్ల ఇళ్లను మంజూరు చేసి, మూడు కోట్ల ఇళ్లు నిర్మించిందన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లలో కేంద్రం ఇచ్చిన డబ్బులు ఉన్నాయన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో మునిసిపల్ అధికారులు చేపట్టిన ఫ్లెక్సీలు తొలగింపు వివాదం గా మారింది. అధికార వైసిపి పార్టీకి చెందిన ఫ్లెక్సీలు తొలగించకుండా టిడిపి జనసేన ఫ్లెక్సీలు మాత్రమే తొలగిస్తున్నారని టిడిపి జనసేన నేతల ఆందోళన కు దిగారు. మున్సిపల్ అధికారులతో వాగ్వాదానికి దిగారు దీంతో నర్సాపురం పట్టణంలో ఉద్రిక్తత పరిస్థితిలు నెలకొన్నాయి. ఫ్లెక్సీలు తొలగింపు నిలుపుదల చేయాలని రోడ్డుమీద బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా టిడిపి జనసేన నేతలు మాట్లాడుతూ అధికార వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తుందని వైసిపి బస్సుయాత్రకు పెట్టిన ఫ్లెక్సీలను తొలగించుకుండ జనసేన ఇన్చార్జ్ బోమ్మడి నాయకర్, చాగంటి మురళీకృష్ణ, టిడిపి కి చెందిన కొవ్వలి నాయుడు ఫ్లెక్సీలు మాత్రమే తొలగిస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే మున్సిపల్ కమిషనర్ సంఘటన ప్రాంతానికి రావాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంబేద్కర్ సెంటర్ జాతీయ రహదారిపై ధర్నా చేయడంతో రహదారి కి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
కళ్యాణదుర్గంలో చంద్రబాబు కు బెయిల్ మంజూరుతో టీడీపీ జనసేన కూటమి సంబరాలు మిన్నంటాయి. నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వరనాయుడు ఆధ్వర్యంలో సంబరాలు మిన్నంటాయి. ఎన్టీఆర్ భవన్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పాలాఅభిషేకం పూలమాలలు వేసి నివాళులు అర్పించిన టీడీపీ జనసేన నాయకులు, ఎన్టీఆర్ భవన్ వద్ద టీడీపీ జనసేన నాయకులు డాన్స్ వేస్తూ ఈలలు కేరింతలతో సంబరాలు జరుపుకున్నారు. నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వరనాయుడు మాట్లాడుతూ.. న్యాయస్థానం పై నమ్మకం ఉంది కాబట్టే న్యాయం గెలిచిందని, చెప్పిన విధంగానే చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటికి వచ్చాడని, టీడీపీ నాయకులు, రాష్ట్ర ప్రజలు చేసిన పూజలు ఫలించాయని, చంద్రబాబు కు బైయిల్ వచ్చింది. వైసీపీ పతనం ఆరంభమైంది అంటూ ఎద్దేవ చేశారు.
Read Also..



Total views : 90074