అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభ సిర్పూర్ ఆసిఫాబాద్, బెల్లంపల్లి సభల్లో కెసిఆర్ పాల్గొంటారు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు రానున్నారు. బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. బీఆర్ఎస్ సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి అభ్యర్డులు సభలకు సర్వం సిద్ధం చేశారు. గత నాలుగు రోజుల నుంచి సభల ఏర్పాట్లు చేస్తుండగా. సభా ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. పోలీసు యంత్రాంగం భారీ భద్రత ఏర్పాట్లు చేసింది.
Kcr
దేశంలో దివ్యాంగులకు అధిక పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. దివ్యాంగులకు అండగా నిలిచింది కేసీఆర్. స్థానిక బిడ్డనైన నన్ను కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని. చొప్పదండి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సుంకె రవిశంకర్..కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ విఏఎస్ ఫంక్షన్ హాల్లో దివ్యాంగుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రవిశంకర్ మాట్లాడుతూ…. దివ్యాంగుల సంక్షేమమే పరమావధి. దివ్యాంగులకు దేశంలో ఎక్కడ లేని విధంగా అత్యధిక పెన్షన్ 4016 రూపాయలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. తెలంగాణలో నవంబర్ 30వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో రాష్ట్ర ప్రజల ఆశలకు అనుగుణంగా ఉంది. అన్ని వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేలా ఉంది. మేనిఫెస్టో, అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓటు వెయ్యండిని రవిశంకర్ పేర్కొన్నారు.
Read Also..
కూకట్ పల్లి నియోజకవర్గం లో మరోసారి బిఆర్ఎస్ పార్టీ గెలుపు తద్యమని అన్నారు స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కేపి.హెచ్.బి డివిజన్ లోని వసంత నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ ప్రచార కార్యాలయాన్ని స్థానిక కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు తో కలిసి కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి తమకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. గత పాలకుల సమయంలో కూకట్ పల్లి నియోజకవర్గంలో ఎన్ని కష్టాలు పడ్డాము ప్రతి ఒక్కరికి తెలుసని మరల అలాంటి సమస్యలు పునరావృతం కాకుండా కారు గుర్తుపైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
బెల్లంపల్లి పట్టణంలోని తిలక్ స్టేడియంలో ఆవరణలో జరిగే ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశీర్వాద సభకు నియోజకవర్గంలోని ప్రజలందరు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం సభ ప్రాంగణంలో ఎమ్మెల్యే మాట్లాడుతు కెసిఆర్ ప్రభుత్వ హయాంలో అనేక సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క కుటుంబానికి అందాయని అన్నారు.రాబోయే కాలంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరు కెసిఆర్ ప్రభుత్వాన్ని గెలిపించాలని ఆయన కోరారు.ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి చేరాయని అందుకే రాష్ట్ర ప్రజలందరు ఆయన వెంట ఉన్నారని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గడపగడపకు తీసుకెళ్లి ప్రజలకు వివరించి రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ను, నియోజకవర్గంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యలకు హ్యాట్రిక్ విజయం అందించాలని కేసీఆర్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ అమీర్ పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని స్థానిక బాబు క్యాంపు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని అనేక హామీలను అమలు చేసిన గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, కేసీఆర్ కిట్, దళిత బందు, లాంటి అనేక పథకాలు ప్రజలు అడగక పోయిన సీఎం కేసీఆర్ ప్రజల సంక్షేమం గురించి ఆలోచించి పథకాలను అమలు చేస్తున్నాడని తెలిపారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీలోని అన్ని విభాగాల నాయకులు ప్రజల వద్దకు వెళ్లి సంక్షేమ పథకాలను వివరించాలని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.
Read Also..
కెసిఆర్ గారి ఆశీస్సులతొ మెదక్ నియోకవర్గము ను అభివృద్ధి చేశానని మెదక్ ప్రజలు మళ్లీ ఒక సారి అవకాశం ఇస్తే ప్రజలకు సేవ చేస్తానని మెదక్ brs పార్టీ మెదక్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మ దేవేందర్ రెడ్డి అన్నరు, ఈ రోజు మెదక్ ఎమ్మెల్యే అభ్యర్థి గా నామినేషన్ వేసిన సందర్భంగా ఆమె విలేరులతో మాట్లాడుతూ మెదక్ అభివృద్ది కీ పాటు పడుతనని,, 2014నేటి వరకు ఎంతో అభివృద్ది చేశానని మెదక్ ప్రజల కోసం జిల్లా కావడం గొప్ప విషయం అని ఆమె అన్నారు. మెడికల్ కాలేజీ శంకుస్థాపన చేయడం జరిగింది అని ఆమె తెలిపారు.
కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ అధికారికంగా ఖరారైంది. కామారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. 16 మంది అభ్యర్థులతో కూడిన మూడో విడత జాబితాను విడుదల చేసింది. నిజామాబాద్ అర్బన్ సీటును సీనియర్ లీడర్ షబ్బీర్ అలీకి పార్టీ కేటాయించింది. ఇక చెన్నూరు నుంచి జి.వివేక్ వెంకటస్వామి పోటీ చేస్తున్నట్టు ప్రకటించింది. రెండు సీట్లలో అభ్యర్థులను మార్చుతూ పార్టీ నిర్ణయం తీసుకుంది. బోథ్ నియోజకవర్గంలో అశోక్ స్థానంలో ఆదె గజేందర్, వనపర్తిలో చెన్నారెడ్డి స్థానంలో మేఘారెడ్డికి సీట్లు కేటాయిస్తూ మార్పులు చేసింది. మరోవైపు పొత్తులో భాగంగా కొత్తగూడెం సీటును సీపీఐకి కేటాయించింది. తాజా జాబితాతో మొత్తం 114 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించినట్టయ్యింది. తుంగతుర్తి, సూర్యాపేట, మిర్యాలగూడ, చార్మినార్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.
తెలంగాణలో మోడీ ప్రభుత్వం నిరంతారయంగా విద్యుత్‌ను అందిస్తోందని కిషన్ రెడ్డి చేసిన ట్వీట్‌పై కవిత ఫైర్ అయ్యారు. ‘తెలంగాణలో 15,500 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. ఎన్టీపీసీ ప్లాంట్ కేవలం 680 మెగావాట్ల విద్యుత్‌ను మాత్రమే తెలంగాణకు అందిస్తోంది. ఇది తెలంగాణ వినియోగిస్తున్న విద్యుత్‌లో కేవలం 4 శాతం మాత్రమే. కిషన్ రెడ్డి అన్న.. కేంద్ర ప్రభుత్వం నిరంతరాయంగా విద్యుత్‌ను తెలంగాణకు అందిస్తోందని అబద్ధపు ప్రచారాలు మానుకోండి. కేసీఆర్ కృషి వల్లే పవర్ సర్ ప్లస్ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది.’ అని కౌంటర్ ఇచ్చారు.
ఎంత మంది తీస్మార్ఖాన్లు వచ్చినా ఏమీ చేయలేరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు
కేసీఆర్ ప్రజాభిమానం ముందు ఎంత మంది తీస్మార్ఖాన్లు వచ్చినా ఏమీ చేయలేరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో కల్వకుర్తి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జైపాల్‌యాదవ్‌కు మద్దతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో, షాద్‌నగర్ చౌరస్తాలో అభ్యర్థి అంజయ్యయాదవ్‌తో కలిసి నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ మాట్లాడారు. ఒక్క చాన్స్ ఇవ్వండి అంటున్న కాంగ్రె్‌సకు గతంలో ప్రజలు 11సార్లు ఇస్తే ఏం సాధించారని ప్రశ్నించారు. వారి పాలనలో కరెంట్ లేక రైతులు, తాగు నీరు దొరకక మహిళలు అష్టకష్టాలు పడ్డారన్నారు. రాష్ట్రంలో 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తుంటే.. కాంగ్రెస్ నేతలు ఐదు గంటల కరెంటు చాలు అనడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. ఈ ఎన్నికలు ఢిల్లీ దొరలకు.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు జరుగుతున్న యుద్ధం అని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ లేకుండాపోయిందని, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఎన్నికలకు ముందే అస్త్రసన్యాసం చేశారన్నారు. యుద్ధం చేసే ధైర్యం లేక బరిలో నిలువకుండా పారిపోయాడని విమర్శించారు. తెలంగాణలో గులాబీ జెండా ఉండగా గుజరాత్, ఢిల్లీ రాజుల పాలన మనకు అవసరమా అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లోనూ కేసీఆర్ ఒంటరి పోరాటమే చేసి, మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు





Total views : 89883