ఇవాళ హైదరాబాద్ వేదికగా తొలిసారి విభజన అంశాలపై ముఖ్య మంత్రులు సమావేశం కానున్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే భవన్ సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ కీలక భేటీలో ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై చర్చించనున్నారు.ఈ భేటీ కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన విభజన హామీలను లేఖలో ప్రస్తావించారు. వీటి పరిష్కారం కోసం కలిసి చర్చించుకుందామని కోరారు. జులై 6వ తేదీన కలిసి చర్చించుకుందామని ప్రతిపాదించారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి భేటీకి సానుకూలంగా స్పందించారు. దీంతో ఈ కీలక భేటీ ఇవాళ హైదరాబాద్ వేదికగా జరగనుంది.
ఈ భేటీలో పలువురు మంత్రులతో పాటు ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఇతర శాఖల కార్యదర్శులు పాల్గొనున్నారు. ఈ భేటీలో రాష్ట్ర విభజన సమయం నుంచి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా షెడ్యూలు 9, 10లో ఉన్న సంస్థల విభజనపై చర్చించనున్నారని సమాచారం.
షీలాబేడీ కమిటీతో నివేదిక ప్రకారం పెండింగ్ లో ఉన్న అంశాలతో పాటు పదో షెడ్యూల్ లో ఉన్న విద్యా సంస్థల పంపిణీపై వివాదాలు తలెత్తాయి. పదేళ్ల కాలం నుంచి ఇవి పెండింగ్ లోనే ఉన్నాయి. వీటిపై ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఉద్యోగుల కేటాయింపులపై నెలకొన్నసమస్యలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన ఓ సైగ తీవ్ర రాజకీయ దుమారం రేపింది. మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్‌ను ఉద్దేశించి విజయ్ మాట్లాడుతున్న సమయంలో తన కుడి అరచేతిని దవడకు ఆనించి చేసిన సైగపై డీఎంకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం…
- ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులను మరింత పెంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. న్యూఢిల్లీలో ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి, కేబినెట్ సభ్యుడు ఫ్రాన్సిస్కో పి.టు లారెల్ జూనియర్‌తో మంత్రి సమావేశమయ్యారు. తెలంగాణలో భారీగా వరి ఉత్పత్తి…
- హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.హైదరాబాద్ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ రంగంలో మరో కీలక ఘనతను అందుకోనుంది. భారత్‌లో తొలిసారిగా అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కాన్ఫరెన్స్ IREC-2026 హైదరాబాద్‌లో జరగనుంది. సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో మూడు రోజుల పాటు ఈ…
- వైసీపీకి గుడ్‌బై చెప్పిన చిన్న శ్రీను.ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళవారం వైసీపీకి రాజీనామా చేసిన చిన్న శ్రీను..…
- స్పీకర్‌పై వ్యాఖ్యల వెనుక ఫామ్‌హౌస్ కుట్ర: భట్టి.స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యల ఘటన వెనుక ఫామ్‌హౌస్ కుట్ర ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ వ్యవహారంలో పాత్రధారులు వేరని.. సూత్రధారులు వేరని, సూత్రధారులు చాలా ప్రమాదకరమని అన్నారు. దళిత వర్గాల నుంచి వచ్చి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి