Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Andhra Pradesh మహీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం…

మహీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం…

by Prakash
Spiritual meeting under the leadership of Mahidhar Reddy

నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం కందుకూరులో ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం వెంగమాంబ కళ్యాణ మండపం లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సిపి ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి బుర్ర మధుసూదన్ యాదవ్ జూపూడి ప్రభాకర్ రావు బీద మస్తాన్ రావు వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విజయ్ సాయి రెడ్డి మాట్లాడుతూ మానుగుంట మహీధర్ రెడ్డి సహకారం లేకుండా మా గెలుపు దుర్లభం. ఎం పీ విజయసాయిరెడ్డి కందుకూరి ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి సహకారం లేకుండా ఎంపీగా తాను, ఎమ్మెల్యేగా బుర్ర మధుసూదన్ యాదవ్ గెలుపు అత్యంత దుర్లభమని విజయ సాయి రెడ్డి కితాబిచ్చారు. శనివారం మధ్యాహ్నం కందుకూరు పట్టణంలోని వెంగమాంబ ఫంక్షన్ హాల్ లో వైకాపా కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మహిధర్ రెడ్డి మచ్చలేని నాయకుడని, 50. సంవత్సరాల వారి రాజకీయ ప్రస్థానంలో అద్భుతమైన పాలనా దక్షుడ ని , విజయసాయిరెడ్డి అభివర్ణించారు.

ఎమ్మెల్సీగా మహీధర్ రెడ్డి ఉండాలనేది జగన్మోహన్ రెడ్డికోరిక ని, 2026 లో నియోజకవర్గాల డీ లిమిటేషన్స్ అనంతరం ఎమ్మెల్సీ అవుతారని విజయసాయి రెడ్డి వివరించారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా తాము గెలిస్తే మహీధర్ రెడ్డి మాట జవదాటేది లేదని ఆయన ప్రమాణం చేశారు. కార్యకర్తలకు అన్ని విధాల తోడ్పాటు అందిస్తామన్నారు. ఈ సందర్భంగా ఎంపీ బీద మస్తాన్రావు మాట్లాడుతూ ఎంపీ విజయసాయిరెడ్డి గెలుపు నెల్లూరు జిల్లాకు మలుపున్నారు. కార్యకర్తలను ఉద్దేశించి మానుగుంట మహీధర్ రెడ్డి మాట్లాడుతూ, కార్యకర్తలు సహకారం వైకాపా అభ్యర్థులకు అందించాలన్నారు.

Advertisements

You may also like

Our Visitor

019581
Total views : 91171

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.