Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Film “జితేందర్ రెడ్డి” సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్…

“జితేందర్ రెడ్డి” సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్…

by Prakash
Jithender Reddy


‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy) :

‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy) చిత్రంలో నటించిన రాకేష్ వర్రే ముందు బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో ప్రేక్షకుల మన్ననలు పొందిన పొందాడు. గతంలో ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ సినిమాతో హీరో, నిర్మాతగా మారిన సంగతి అందరికీ తెలిసిందే, రీసెంట్ గా నిర్మాతగా ‘పేకమేడలు’ చిత్రం టీజర్ను లాంచ్ చేసి మంచి కథలు, కొత్త కథలను ప్రేక్షకులకు అందించాలని చేసే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy) చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొని వస్తున్నారు. గతంలో రిలీజ్ చేసిన ప్రోమోకి, అస్సలు ఎవరు ఈ జితేందర్ రెడ్డి (Jithender Reddy) అని ? హీరో పేస్ రెవీల్ చెయ్యకుండా విడుదల చేసిన పోస్టర్స్ కూడా మంచి ఆదరణ పొందాయి.. ముదుగంటి క్రియేషన్స్ బ్యానర్ లో రాబోతున్న ఈ జితేందర్ రెడ్డి సినిమా రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ ఈ రోజు విడుదల చేసింది. 2024 May 3న ఈ చిత్రం విడుదల కాబోతుంది అని చిత్ర దర్శకుడు విరించి వర్మ చెప్పారు.

దర్శకుడు విరించి వర్మ మాట్లాడుతూ..

ఈ సందర్భంగా దర్శకుడు విరించి వర్మ మాట్లాడుతూ.. ఈ సినిమా 1 st లుక్ పోస్టర్ నుండి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. హీరో ఎవరో చూపించకుండా విడుదల చేసిన పోస్టర్స్ కూడా మంచి క్యూరియాసిటీని పెంచాయి.. రాకేష్ వర్రే ఫ్యామిలీ హీరో గా ఎవ్వరికీ చెప్పొద్దూ లాంటి లవ్ స్టొరీని చేసినప్పటికీ ఇలాంటి ఒక ఆక్షన్ డ్రామా చెయ్యడం చాలా గొప్ప విషయం. ఈ జితేందర్ రెడ్డి జగిత్యాలలో 1980 లలో యదార్ధంగా జరిగిన కథ. రియల్ స్టొరీని బాగా తియ్యడానికి చాలా రీసెర్చ్ అవసరమైంది, దాని కోసం నేను మా టీం వర్క్ ఔట్స్ చేసి, రెఫెరెన్సులు తీసుకుని, పెద్ద వారి సలహాలు తీసుకుని చాలా జెన్యూన్ గా చేసిన సినిమా ఇది.. మే 3 న రిలీజ్ అయ్యే ఈ సినిమాతో ఆ రోజుల్లో విలువలతో కూడిన ఈ పాత్ర, దాని చుట్టూ తిరిగే కథని ఈ తరం ప్రేక్షకులకి అందించాలని చేసే ప్రయత్నమే ఈ జితేందర్ రెడ్డి.

ముదుగంటి క్రియేషన్స్ అధినేత, నిర్మాత ముదుగంటి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ..

ఉయ్యాలా జంపాలా, మజ్ను లాంటి ప్రేమకథా చిత్రాలకు దర్శకత్వం వహించిన విరించి వర్మ, మా జితేందర్ రెడ్డి లాంటి ఆక్షన్ స్టొరీని కూడా అద్భుతంగా తెరకెక్కించారు.. ఈ చిత్రం యొక్క పోస్టర్స్, గ్లిమ్స్ ను చాలా మంది అప్ప్రిషిఎట్ చేస్తున్నారు, జితేందర్ రెడ్డి అనే టైటిల్ ఏ చాలా పవర్ఫుల్ టైటిల్. 1980లో నేను చూసిన, నాకు తెలిసిన కథ ఈ జితేందర్ రెడ్డి, అప్పటి లొకేషన్స్ గాని, అప్పటి అంబియన్స్ ని గాని చాలా చక్కగా తెరకేక్కించాము. మా హీరో రాకేష్ వర్రే గురంచి మీకు చెప్పాలి, గతంలో లవ్ స్టొరీ చేసి ఇప్పుడు ఈ ఆక్షన్ డ్రామా ని కూడా చాలా బాగా హేండిల్ చేశాడు.

జితేందర్ రెడ్డి నా సొంత ప్రాజెక్ట్ లాగా..

తనకు సొంతగా క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ ఉన్నప్పటికీ, తన సినిమాలే మూడు జరుగుతున్నప్పటికీ కూడా ఈ జితేందర్ రెడ్డిని తన సొంత ప్రాజెక్ట్ లాగా, తన సినిమాల పనులను అడ్జస్ట్ చేసుకుని చాలా శ్రమని ఈ సినిమా కోసం పెట్టారు.. అప్పటి సన్నివేశాలని, జరిగిన కథని యదార్ధంగా చూపించాము తప్ప, ఎవరిని కించ పరిచే విధంగా మాత్రం చెయ్యలేదు. సుబ్బరాజు గారి లాంటి విలక్షణ నటులు కూడా మనసు పెట్టి అధ్బుతంగా ఈ కథ కోసం పని చేశారు. ఈ సినిమాకి సంబధించిన updates ను మీకు ఇక నుండి ఇస్తూ ఉంటాము. మేము మొదటి సారి సినిమా ఇండస్ట్రీ కి వచ్చి ఈ సినిమా చేస్తున్నాము. మమ్మల్ని ఆశీర్వదించండి.

ఇది చదవండి : శివమల్లాల నిర్మాతగా నూతన నిర్మాణ సంస్థ శివమ్‌ మీడియా ప్రారంభం…

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలకు (కంచే, NTR కథానాయకుడు, NTR మహానాయకుడు, IB 47) విషువల్స్ అందిచిన వి. ఎస్‌ జ్ఞాన శేఖర్‌ ఈ సినిమాకి కెమెరామెన్‌ గా పని చేశారు. అలాగే ఎన్నో లవ్ స్టోరీస్ కు మ్యూజికల్ హిట్స్ అందించిన మలయాళ సంగీత దర్శకుడు గోపీ సుందర్‌ జితేందర్ రెడ్డి సినిమాకు సంగీతం అందిస్తున్నారు. నాగేంద్ర కుమార్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాను ముదుగంటి క్రియేషన్స్‌ బ్యానర్‌పై ముదుగంటి రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు.

నటీ నటులు : రాకేష్ వర్రే, రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్

సాంకేతిక నిపుణులు:
డైరెక్టర్ : విరించి వర్మ.
కథ & మాటలు : ముదుగంటి రవీందర్ రెడ్డి.
నిర్మాత : ముదుగంటి రవీందర్ రెడ్డి.
కో – ప్రొడ్యూసర్ : ఉమ రవీందర్.
ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : వాణిశ్రీ పొడుగు
డి. ఓ. పి : వి. ఎస్. జ్ఞాన శేఖర్.
మ్యూజిక్ డైరెక్టర్ : గోపి సుందర్.
ఆర్ట్ డైరెక్టర్: నాగేంద్రకుమార్
పి ఆర్ వో: మదు వి ఆర్

Follow us on :  Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్‌పూర్ కన్నుమూత.
భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఓ మధుర స్వరం మూగబోయింది. తన గానామృతంతో కోట్లాది మంది …
‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..
శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద ‘మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి …
దాస‌రి నారాయ‌ణ‌రావు గారు ఓ ఇన్‌స్టిట్యూష‌న్‌.. ఆయ‌న్ని చూసి చాలా విష‌యాలు నేర్చుకోవాలి..
దిగ్గజ దర్శకుడు, దర్శక రత్న దాసరి నారాయణరావు వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆయ‌న ఘాట్‌ను హీరో రాకింగ్ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

019572
Total views : 91136

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.