Saturday, May 2, 2026
News Navigation
Saturday, May 2, 2026
News Navigation

Breaking

>
Saturday, May 2, 2026
Home Latest News మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు…

మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు…

by Prakash
Gomase Srinivas


బిజెపి అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ (Gomase Srinivas)..

పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో బిజెపి గెలుపు ఖాయమైందని, దేశవ్యాప్తంగా బిజెపి గెలవబోతున్న 4 వందల స్థానాల్లో పెద్దపల్లి పేరు ఉండబోతుందని బిజెపి అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ (Gomase Srinivas) ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రచారం చేపట్టారు. అనంతరం అమర చంద్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు.

పెద్దపల్లిలో బిజెపి గెలుపు ఖాయమైంది..

అనంతరం ఆయన మాట్లాడుతూ… మూడవసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసే ముహూర్థం ఖరారయ్యిందన్నారు. పెద్దపల్లిని పాలించిన గత పాలకులు అర చేతిలో వైకుంఠం చూపించి అభివృద్దిని మరిచిపోయారని, ఇక్కడి ప్రజలను మోసం చేసి వివేక్ కుటుంబం పదవులు అనుభవించిందన్నారు. రూ. వందల కోట్ల సంపదను దోచుకుని, దోచుకున్న డబ్బులతో తమ వ్యాపార సామ్రాజ్యాలను విస్థరించుకున్నారన్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల అభివృద్దిపై చిత్తశుద్ది లేదని, ఆరు గ్యారెంటీల అమలు చేయించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలం అయ్యిందని దుయ్యబట్టారు.

దేశమంతా మోదీ హవా నడుస్తోంది..

చైనా, పాకిస్తానులను వణికించిన మోదీ, కాంగ్రెస్ పార్టీ పాలనలో భారతదేశాన్ని చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, తదితర దేశాలు భయపెట్టేవని, వారి ఒత్తిళ్ళకు తలొగ్గి కాంగ్రెస్ అధిష్టానం పని చేసేదని మండిపడ్డారు. మోదీ ప్రధాని అయిన తరవాత శత్రుదేశాల భరతం పట్టడం జరిగిందని, ప్రస్తుతం చైనా, పాకిస్తాన్ దేశాలు మోదీ దెబ్బకు విలవిలలాడుతున్నాయని అన్నారు. మోదీ దార్శనికత వల్ల శత్రుదేశాలు మన వైపు కన్నెత్తి చూడటానికి గజగజ వణుకుతున్నాయని తెలిపారు. 5 వందల యేళ్ళుగా వివాదంలో ఉన్న అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేసి దేశ కీర్తిని మోదీ విశ్వవ్యాప్తం చేయడం గర్వంగా ఉందన్నారు. మోదీ పరిపాలన దక్షతకు ఇది నిదర్శనమని అభిప్రాయం వ్యక్తం చేశారు. బిజెపి కార్యకర్తలు నిజమైన దేశభక్తులుగా అభివర్ణించిన ఆయన, తన చివరి శ్వాసవరకు దేశం కోసం,ధర్మం కోసం పని చేస్తానని స్పష్టం చేశారు.

బిజెపి కార్యకర్తలు నిజమైన దేశభక్తులు..

పెద్దపల్లి పార్లమెంటులో బిజెపి గెలుపు ఖాయమైందని, గెలిచిన తర్వాత నియోజకవర్గ అభివృద్దికి పూర్తి సమయాన్ని కేటాయిస్తానని శ్రీనివాస్ హామీ ఇచ్చారు. జిల్లాకేంద్రం చుట్టూ రింగు రోడ్డు నిర్మాణం, మైనింగ్ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు, కేంద్రీయ విశ్వవిద్యాలయం, ముస్లీముల ఖరస్తానుల అభివృద్దికి రూ. 20లక్షల ఎంపి నిధులు, సిఎస్ఆర్ నిధులతో విద్యాసంస్థల ఏర్పాటు, గోదావరి నీళ్ళను అదనపు పైపులైను ద్వారా పెద్దపల్లి రైతంగానికి సాగు నీరుగా అందించడానికి కృషి చేస్తానన్నారు.

నిజాయితీ గల పేదవాడికి, డబ్బు గల అవినీతి పరుడికి మధ్య యుద్ధం..

కాంగ్రెస్ అభ్యర్థి ఒక అముల్ బేబి బిజెపిలో ఉన్నంతకాలం కెసిఆర్ కుటుంబాన్ని వారసత్వ రాజకీయాలుగా విమర్శలు చేసిన వివేక్ వెంకటస్వామి, తన కొడుక్కి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పించడాన్ని ఎమంటారో తెలపాలని సవాలు విసిరారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించిన గడ్డం వంశీ కృష్ణ ఒక అముల్ బేబీ అని ఎద్దేవా చేశారు. తండ్రి చాటు రాజకీయలతో గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు. నిజాయితీ గల పేదవాడికి, డబ్బు గల అవినీతి పరుడికి మధ్య జరుగుతున్న ఎన్నికల యుద్ధమని పేర్కొన్నారు.తనకు అవకాశం ఇచ్చి ఎంపిగా గెలిపించాలని ఓటర్లను గోమాసే శ్రీనివాస్ కోరారు.

ఇది చదవండి : GHMC అడ్డగోలు రూల్స్, ఇబ్బందులు పడుతున్న సామాన్యులు..!

ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్,జిల్లా అధ్యక్షుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డి, పార్లమెంటు కన్వీనరు వెంకటేషం గౌడ్, కో కన్వీనరు గుండబోయిన లక్ష్మన్, నాయకులు శిలారపు పర్వతాలు, తంగెడ రాజేశ్వరరావు, పోల్సాని సంపత్ రావు, దాడి సంతోష్, తాత రవి, గంగిపెల్లి స్వామి, రాజం మహంత, చిలారపు సంపత్, మేకల శ్రీనివాస్, గుడ్ల సతీష్, వివిధ మండలాల అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇంచార్జీలు, బూత్ అధ్యక్షులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Follow us on :  Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్‌లో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం గత పదమూడు సంవత్సరాలుగా సాగుతుండటం స్థానిక …
ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..
ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనుల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. వెంకటాపూర్ మండలం …
ప్రణీత్‌ ప్రణవ్‌ గ్రూప్‌పార్క్‌పై పోరాటానికి సిద్ధమవుతున్న స్థానికులు..
హైదరాబాద్‌ శివారు గాగిల్లాపూర్‌లో ఉన్న ప్రణీత్‌ గ్రూవ్‌ పార్క్ అక్రమాలపై స్థానికులు పోరాటానికి సిద్ధమవుతున్నారు. రియల్‌ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

009435
Total views : 62356

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.