ఫోన్ ట్యాపింగ్ కేసులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతానని ప్రభాకర్ రావు అభ్యర్ధనను తోసిపుచ్చింది నాంపల్లి కోర్టు. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును కోర్టులో హాజరు పర్చాలని దర్యాప్తు అధికారులను నాంపల్లి కోర్టు ఆదేశించింది. ప్రధాన నిందితుడు కాబట్టి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించలేమని స్పష్టం చేసింది. పరికరాలను కొనుగోలు చేసిన శ్రవణ్ రావును ఆచూకీ ఇప్పటివరకు ఎందుకు కనుక్కోలేదని పోలీసులను ప్రశ్నించింది. ఏ-1 ప్రభాకర్‌రావు, ఏ-6 శ్రవణ్‌రావుపై ఇది వరకే వారెంట్ జారీ అయినందున తదుపరి విచారణ నాటికి కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. అనారోగ్యానికి గురై వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నానని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతానని తన లాయర్ ద్వారా గతంలో కోర్టు కి ప్రభాకరరావు తెలిపారు. ప్రభాకర్ రావు అభ్యర్థనను నాంపల్లి కోర్టు తిరస్కరించింది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- తెలంగాణ అసెంబ్లీలో కంటిన్యూ అవుతున్న రచ్చ.తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నాలుగో రోజు కూడా వాడీవేడిగానే సాగింది. మైక్ ఎవరిదైనా.. మాటల తూటాలు మాత్రం పేలుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్, 22ఏ భూముల వివాదం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రతిపక్షాల ఆందోళనతో సభ రాజకీయ రణరంగంగా మారింది.…
- త్వరలో పాదయాత్ర చేయబోతున్నట్లు వైసీపీ అధినేత జగన్ ప్రకటన.త్వరలో పాదయాత్ర చేయబోతున్నట్లు వైసీపీ అధినేత జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే టీడీపీ నేత రియాక్షన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు మంచితనాన్ని చూసి గతంలో జగన్ పాదయాత్ర చేశారని, కానీ ఇప్పుడు అలా కుదరని…
- 280 ఎకరాల వెంచర్ వ్యవహారంలో వివాదాలు.ప్రముఖ రియల్టర్, హోమ్‌ల్యాండ్ అధినేత బాణాల రాంరెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నేదునూరులోని తన ఫాంహౌస్‌లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. పటాన్చెరులో 280 ఎకరాల్లో వెంచర్ అభివృద్ధి చేస్తున్న రాంరెడ్డి.. స్థానిక నేతలు, పలువురి ఒత్తిళ్లతో తీవ్ర…
- ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు.భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భారత్ మండపంలో ఈ సదస్సు నిర్వహించనున్నారు. 2026 సంవత్సరానికి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలను భారత్ చేపట్టడంతో…
- విజయ్ నేతృత్వంలో ‘సామాజిక న్యాయ విజయ కూటమి’.తమిళనాడు రాజకీయాల్లో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం మరో కీలక రాజకీయ అడుగు వేసింది. టీవీకే ఆధ్వర్యంలో ఏర్పడిన కొత్త కూటమికి సామాజిక న్యాయ విజయ కూటమి గా పేరు ఖరారైంది. విజయ్ అధ్యక్షతన చెన్నై పనయూర్‌లో జరిగిన సమన్వయ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి