Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Telangana ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నాంపల్లి కోర్టు సంచలన ఆదేశం

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నాంపల్లి కోర్టు సంచలన ఆదేశం

by Satya
ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నాంపల్లి కోర్టు సంచలన ఆదేశం

ఫోన్ ట్యాపింగ్ కేసులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతానని ప్రభాకర్ రావు అభ్యర్ధనను తోసిపుచ్చింది నాంపల్లి కోర్టు. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును కోర్టులో హాజరు పర్చాలని దర్యాప్తు అధికారులను నాంపల్లి కోర్టు ఆదేశించింది. ప్రధాన నిందితుడు కాబట్టి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించలేమని స్పష్టం చేసింది. పరికరాలను కొనుగోలు చేసిన శ్రవణ్ రావును ఆచూకీ ఇప్పటివరకు ఎందుకు కనుక్కోలేదని పోలీసులను ప్రశ్నించింది. ఏ-1 ప్రభాకర్రావు, ఏ-6 శ్రవణ్రావుపై ఇది వరకే వారెంట్ జారీ అయినందున తదుపరి విచారణ నాటికి కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. అనారోగ్యానికి గురై వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నానని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతానని తన లాయర్ ద్వారా గతంలో కోర్టు కి ప్రభాకరరావు తెలిపారు. ప్రభాకర్ రావు అభ్యర్థనను నాంపల్లి కోర్టు తిరస్కరించింది.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: