మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చరిత్రాత్మక నిర్ణయమని తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. 45 రోజుల్లో 12కోట్లకు పైగా మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారని తెలిపారు. నాంపల్లిలోని తెలుగు వర్సిటీలో బ్లైండ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్ లూయిస్ బ్రెయిలీ 215వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఉచిత ప్రయాణం కారణంగా వికలాంగులకు కేటాయించిన సీట్లలో కూడా మహిళలు కూర్చుంటున్నారు. ఆర్టీసీ బస్సుల్లో వికలాంగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు నా దృష్టికి వచ్చాయి. త్వరలో 2,375 కొత్త బస్సులు తీసుకుంటున్నాం. అప్పుడు కొంత వెసులుబాటు కలుగుతుంది. అవసరమైతే వికలాంగుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసే విధంగా ఆర్టీసీ యాజమాన్యం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. అనౌన్స్మెంట్, ఎంక్వయిరీ రూమ్ ఉద్యోగాల్లో అంధులకు అవకాశం కల్పిస్తాం’’ అని సజ్జనార్ హామీ ఇచ్చారు.
Nampally
హైదరాబాద్ నగరంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. నాంపల్లి బజార్‌ఘాట్‌లోని ఓ భవనంలో మంటలు అంటుకున్నాయి. చూస్తుండగానే నాలుగు అంతస్తులకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో దట్టమైన పొగ తీవ్రతతో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, చిన్నారి ఉన్నారు. నాలుగు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. నిచ్చెనల సహాయంతో భవనంలోని మహిళలు, చిన్నారులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. భవనంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో గ్యారేజ్ ఉండటంతో కారు రిపేర్ చేస్తుండగా మంటలు వచ్చినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అదే సమయంలో అక్కడ డీజిల్, కెమికల్ డ్రమ్ములు ఉండటం.. వాటికి మంటలు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. దీంతో పక్కనే అపార్ట్మెంట్లలో ఉంటున్నవారు భయాందోళనకు గురయ్యారు. గ్యారేజ్‌లో ఉన్న మిగతా కెమికల్ డబ్బాలను అగ్నిమాపక సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. ప్రమాదంతో గ్యారేజ్‌లో ఉన్న పలు వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి.






Total views : 78065