ఇంధన పొదుపు భవితకు భరోసానన్నారు జేసి ఫర్హాన్ అహమ్మద్, ఎ పి ఎస్ పి డి సి ఎల్ జిల్లా ఇంచార్జి అధికారి చంద్ర శేఖర్ రెడ్డి లు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా అన్నమయ్య జిల్లా రాయచోటి ఎ పి ఎస్ పి డి సి ఎల్ కార్యాలయం నందు జిల్లా అధికారి చంద్ర శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంధన పొదుపు వారోత్సవాల ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలిలో అన్నమయ్య జిల్లా జేసి ఫర్హాన్ అహమ్మద్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించి ర్యాలిలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఇంధనం పొదుపు చేయాలంటూ నినాదాలు నిర్వహిస్తూ విద్యుత్ కార్యాలయం నుండి శివాలయం చెక్ పోస్ట్ సర్కిల్, యస్ యన్ కాలని మీదగా నేతాజీ కూడలి వరకు కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏడాది దేశ వ్యాప్తంగా కుడా డిసెంబెర్ 14 నుండి 20 వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ యొక్క వారోత్సవాలలో ప్రజలకు, రైతులకు, విద్యార్థులకు ఇంధనం దుర్వినియోగం చేయకుండా ఎలా ఆదా చేయాలనే విధంగా పలు రకాల అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ ర్యాలిలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చాంద్ భాషా, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ విజయ్ కుమార్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ నరేంద్ర నాథ్ రెడ్డి, వై నాగరాజు, నరేష్, గిరిధర్, రాజేష్, ఇతర అధికారులతో పాటు కార్మికులు పాల్గొన్నారు.
Tag:
Naresh
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ధరణి ఉద్యోగుల మాయాజాలం వెలుగు చూసింది. జిల్లాలో కోట్లలో విలువైన భూములను, భూదస్తావేజులకు ఆమోదించినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. ఎన్నికల నేపథ్యంలో అధికారులు బిజీగా ఉండడం ద్వారా ఇద్దరు ధరణి ఆపరేటర్లు కొంతమందితో కుమ్మక్కయ్యారు. కోర్టు కేసులలో ఉన్న భూములను మ్యూటేషన్స్ ,పాస్ బుక్కులను జారీ చేసినట్లు అధికారులు గుర్తించారు. జిల్లా కలెక్టర్ పరిపాలన విభాగం అధికారి, ఇద్దరు ధరణి ఆపరేటర్లపై ఆదిభట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. ఆదిభట్ల సీఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా సమన్వయకర్త నరేష్, ఆపరేటర్ మహేష్ లపై కలెక్టరేట్ ఏఓ ప్రమీల ఫిర్యాదు చేశారు. వారిద్దరినీ అధికారులు సస్పెండ్ చేశారు.
Read Also..
Read Also..




Total views : 80912