అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం మాండవ్య నది ఒడ్డున వేలిసియిన్న అతి పురాతనమైన పుణ్యక్షేత్రం శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి దేవాలయం నందు శ్రీశైలం వేద పండితులచే ఆలయ పశ్చిమ రాజగోపుర కుంభాభిషేక, సాలహార మహోత్సవ ,హోమం కార్యక్రమాలు శుక్రవారం నుంచి ఘనంగా కొనసాగుతున్నాయి. రెండవ రోజు జరుగుతున్నా హోమం, పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. వారికీ ఆలయ చైర్మన్ పొలం రెడ్డి విజయమ్మ వారి భర్త మున్సిపల్ వైస్ చైర్మన్ పోలం రెడ్డి దశరథ రామిరెడ్డి, ఆలయ ఈవో రమణా రెడ్డి ల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛరణలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం శ్రీశైలం వేద పురోహితులు పరమేశ్వర స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్నా హోమం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోనున్న వినాయకుడిని, అఘోర లింఘేస్వరుడు తో పాటు శ్రీ వీరభద్ర స్వామి అమ్మవార్లను దర్శించుకొన్నారు. వారికీ ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యేని శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. స్వామి వారి ఆలయ చరిత్ర గురించి మాట్లాడుకునే విధంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యం అన్నారు. ఆలయ అభివృద్దితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు కావాల్సిన వసతి ఏర్పాట్లు తదితర అంశాల గురించి వారిని అడిగి తెలుసుకొన్నారు. ఆలయ చైర్మన్ పొలం రెడ్డి విజయమ్మ, ఈవో రమణా రెడ్డి, శ్రీశైలం వేదం పురోహితులు పరమేశ్వర స్వామి లు మాట్లాడుతూ 2019 లో సిఎం జగన్ మోహన్ రెడ్డి పశ్చిమ రాజ గోపురం నిర్మాణానికి శంఖుస్థాపన చేశారన్నారు. కానీ కరోనా వైరస్ కారణంగా ఆ కార్యక్రమం అప్పట్లో నిర్వహించలేకపోయామన్నారు. తిరిగి స్థానిక ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, రాజంపేట ఎంపి మిథున్ రెడ్డి, కలెక్టర్ గిరిషా పీఎస్ కృషితో పశ్చిమ రాజగోపురం సాలహారం ల నిర్మాణాలకు రూ 1.58 కోట్ల నిధులు మంజూరై పనులు కూడా పూర్తి కావడంతో శుక్రవారం నుండి పశ్చిమ రాజగోపుర కుంభాభిషేక, సాలహార మహోత్సవ పూజలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు కర్ణాటక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నట్లు వారు తెలియజేశారు. అందరికి శ్రీ భద్ర కాళీ సమేత శ్రీ వీరభద్ర స్వామి సంపూర్ణ కృపా కటాక్షాల తో పాటు శ్రీ భ్రమ రాంబ మల్లి కార్జున ఆశీస్సులతో మెండుగా కలగాలని ఇటువంటి దైవ కార్యక్రమాలు ఎన్నెన్నో నిర్వహించాలని మనస్పూర్తిగా కోరుకొంటున్నామన్నారు. ఆలయానికి వచ్చేటువంటి భక్తులకు నిత్యాన్నదాన కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ గంగాప్రసాద్, కమిటీ సభ్యులు రత్న శేఖర్ రెడ్డి, సంబేపల్లె నాయకులు వివి ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ ఆర్ ఐ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
National News
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన నేడు శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్‌ను పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు. ఈ సమావేశానికి 38 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. కేసీఆర్ ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటూ తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. కాగా, ఈ సమావేశం అనంతరం కేటీఆర్ ఇతర ఎమ్మెల్యేలతో కలిసి అల్పాహార విందులో పాల్గొంటారు. అనంతరం, ప్రత్యేక వాహనంలో అసెంబ్లీ ప్రాంగణం ఎదురుగా ఉన్న గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులర్పిస్తారు.
Read Also..
కర్ణాటకలోని తిప్పరెడ్డిపల్లి గ్రామంలో ఈరోజు జరగాల్సిన పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది. పెళ్ళికూతురు పెళ్ళికొడుకు కి నెలరోజుల క్రితం నిచ్చితార్టం జరిపి కట్నకానుకలు మాట్లాడుకుని 4 లక్షల 70వేల రూపాయలు, అమ్మాయికి బంగారు మాట్లాడుకుని పెళ్లి కుదుర్చుకున్నారు. ఐతే రాత్రి పెళ్ళికొడుకు బృందం వారు అమ్మాయి ఊరికి వచ్చినప్పుడే పెళ్లి చేసుకొనేది లేదు అని తెగేసి చెప్పారు అడపెళ్లి వారు అంతలోనే పోలీసులు రంగప్రవేశం చేసి అమ్మాయిని పెళ్లికి ఒప్పించారు . అంతా సక్రమంగా జరుగుతుండగా తాళి కట్టే సమయం లో అమ్మాయి తాళి కట్టనివ్వకుండ అడ్డుకోవడంతో పెళ్లి ఆగిపోయింది. ఐతే పెళ్ళికొడుకు వాళ్ళు కట్నండబ్బులు బంగారం ఇవ్వమని డిమాండ్ చేసారు. నెల రోజులలో మీరు ఇచ్చిన బంగారం, డబ్బు వాపస్ ఇస్తామని చెప్పి పంపించారు.
పెళ్ళికొడుకు వాళ్ళు ముందే మాకు ఇష్టం లేదు అని చెప్పి ఉంటే మాకు ఇంత డబ్బు పరువు పోయేది కాదు కదా అని వాపోతున్నారు.
ఆర్ జే డి అధినేత, బీహార్ మాజీ సీఎం, మాజీ కేంద్ర మంత్రి లాలు ప్రసాద్ యాదవ్ కు గురువారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఆయన సతీమణి మాజీ ముఖ్యమంత్రి రబ్రి దేవి, ఆయన తనయుడు బీహార్ రాష్ట్ర డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, ఇతర కుటుంబ సభ్యులతో కలసి పాట్నా విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు తెలంగాణ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్,స్థానిక యాదవ సంఘం నాయకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.
దేశంలో ఉల్లి ధరలు మళ్లీ మండిపోతున్నాయి. చాలా రాష్ట్రాల్లో కిలో ఉల్లి కనీస ధర 50 రూపాయల పైనే పలుకుతోంది. దీంతో వీటి ధరల కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2024 మార్చి 31 వరకు ఉల్లి ఎగుమతులపై నిషేధం విధిస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ -DGFT తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశీయంగా ఉల్లి అందుబాటులో ఉంచడంతో పాటు ధరలు అదుపు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ నిషేధం ఈరోజు నుంచే అమల్లోకి వస్తున్నట్లు పేర్కొంది. అయితే, ఇందులో కొన్ని మినహాయింపులు కల్పించింది. ఈ నోటిఫికేషన్‌కు ముందే ఓడల్లో లోడ్ అయిన ఉల్లిని, ఇప్పటికే కస్టమ్స్‌కు అప్పగించిన ఉల్లి లోడ్‌ను ఎగుమతి చేసుకోవచ్చని DGFT వెల్లడించింది. అయితే, ఇతర దేశాల అభ్యర్థనల మేరకు భారత ప్రభుత్వం అనుమతిస్తే ఆయా దేశాలకు ఉల్లి ఎగుమతులు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
ఎనిమిది మంది నావికాదళ అధికారులపై ఖతర్ కోర్టు విధించిన మరణశిక్షను సవాల్ చేస్తూ భారత్ అప్పీల్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరణ శిక్షపడిన వారిని భారత రాయబారి కలిసినట్లు విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చి మీడియాకు వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే రెండు సార్లు విచారణ జరిగిందని తెలిపారు. సున్నితమైన ఈ అంశాన్ని నిశితంగా గమనిస్తున్నామని తెలిపారు. నావికాదళ అధికారులకు న్యాయ, దౌత్యపరమైన సాయం కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 3ను వారిని భారత్ రాయబారి కలిసినట్లు అరిందమ్ బాగ్చి వెల్లడించారు. అదేవిధంగా ఇటీవల కాప్ సదస్సులో భాగంగా దుబాయ్ వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖతార్ రాజు షేక్ తమీమ్ బిన్ హమాద్‌తో సమావేశమైన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, అక్కడి భారత కమ్యూనిటీ సంక్షేమం సంబంధించి పలు అంశాలపై చర్చ జరిగినట్లు బాగ్చి తెలిపారు.
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీవోకే పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోక్ సభలో కీలక ప్రకటన చేశారు. పీవోకే మనదే అన్నారు. భారత్‌లో అంతర్భాగమైన పీవోకేకు 24 అసెంబ్లీ సీట్లు రిజర్వ్ చేసినట్లు స్పష్టం చేశారు. రెండు నయా కాశ్మీర్ బిల్లులను కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టింది. జమ్ముకశ్మీర్ రిజర్వేషన్- సవరణ బిల్లు 2023, జమ్ముకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ- సవరణ బిల్లు 2023లను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. కశ్మీర్లో హక్కులు కోల్పోయిన కశ్మీరీ పండిట్లకు ఈ బిల్లుల ద్వారా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కశ్మీర్లో గతంలో 46 సీట్లు ఉండగా ఆ సంఖ్యను 47కు పెంచామని, అలాగే జమ్ములో గతంలో 37 సీట్లు ఉండగా ఆ సంఖ్యను 43కు పెంచామని తెలిపారు. పీవోకే కూడా మనదేనని, అందుకే ఆ ప్రాంతానికి 24 సీట్లు రిజర్వ్ చేశామన్నారు. భారత తొలి ప్రధాని జనహర్ లాల్ నెహ్రూ చేసిన రెండు పొరపాట్ల కారణంగా జమ్ముకశ్మీర్ దశాబ్దాలుగా బాధపడుతోందని వ్యాఖ్యానించారు. ముందుగా కాల్పుల విరమణ ప్రకటించి, ఆ తర్వాత కశ్మీర్ సమస్యను ఐక్య రాజ్య సమితికి తీసుకెళ్లారని చెప్పారు. ఇది తన తప్పేనని నెహ్రూ చెప్పారని గుర్తు చేశారు. కానీ మన దేశం చాలా భూమిని కోల్పోవడం పెద్ద తప్పు అన్నారు. నెహ్రూపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. వారు లోక్ సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం జమ్ముకశ్మీర్ రిజర్వేషన్- సవరణ బిల్లు 2023, జమ్ము, కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2023 లోక్ సభలో ఆమోదం పొందాయి.
టీపీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. ఆయనతో పాటు తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే కూడా భాగ్యనగరానికి వస్తున్నారు. అంతకుముందు రేవంత్ రెడ్డి హైదరాబాద్ బయలుదేరేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చారు. అయితే ఆయనకు అధిష్ఠానం నుంచి ఆహ్వానం రావడంతో హుటాహుటిన వెనక్కి వెళ్లారు. ఏఐసీసీ కార్యాలయంలోని మహారాష్ట్ర సదన్‌లో మాణిక్ రావు ఠాక్రేతో భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు ఇరువురు చర్చించారు. అనంతరం రేవంత్, ఠాక్రేలు హైదరాబాద్‌కు బయలుదేరారు. రేవంత్‌తో పాటు మంత్రులుగా ప్రమాణం చేసే అంశంపై వారిద్దరు చర్చించుకున్నారని సమాచారం. రేపు తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది.
మిచాంగ్ తుపాన్ కారణంగా చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని 14 రైల్వే సబ్‌వేల్లోకి నీరు చేరడంతో వాటిని మూసివేశారు.ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే చెన్నైలో మోహరించాయి. తాంబ్రం ప్రాంతంలో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు.. నీటిలో చిక్కుకొన్న 15 మందిని కాపాడాయి. బాసిన్ బ్రిడ్జ్, వ్యాసర్పాడి మధ్యలోని బ్రిడ్జ్ నెం:14ను మూసివేసినట్లు ప్రకటించారు. ఈ ప్రాంతంలో చాలా ప్రదేశాలు జలమయమయ్యాయి. భారీ వర్షాల కారణంగా చెన్నైలోని పాఠశాలలు మూసివేశారు. మరో వైపు… రైళ్లు, విమాన సర్వీసులు రద్దు…చెన్నై-మైసూర్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్, కోయంబత్తూర్ కోవై ఎక్స్‌ప్రెస్, కోయంబత్తూర్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్, కేఎస్ఆర్ బెంగళూరు ఏసీ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్, కేఎస్ఆర్ బెంగళూరు బృందావన్ ఎక్స్‌ప్రెస్, తిరుపతి సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేశారు. దీంతోపాటు సబర్బన్ రైళ్లను కూడా రద్దు చేశారు. కోయంబత్తూరు- చెన్నై మధ్యలో రెండు విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఇండిగో ప్రకటించింది. చాలా విమానాలను చెన్నై ఎయిర్‌పోర్టు నుంచి బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయానికి మళ్లించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటన వాయిదా పడింది! ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తుందని భావించారు. వివిధ అంశాల కారణంగా ప్రకటన జరగలేదు. అయితే సీఎం అభ్యర్థి ప్రకటన, ఎన్నికల ఫలితాలను సమీక్షించేందుకు కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సహా నలుగురు పరిశీలకులను ఆ పార్టీ అధిష్ఠానం ఢిల్లీకి పిలిపించుకుంది. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ నేడు సాయంత్రం ఢిల్లీకి బయలుదేరారు. రేపు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో చర్చలు జరిపి సీఎల్పీ నేతను ఎంపిక చేయనున్నారు. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి, ఏ నేతకు ఏ పోర్ట్‌పోలియో ఇవ్వాలో కూడా చర్చించనున్నారు.