వికసిత్ భారత్ లో యువత పాత్ర కీలకమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఎన్సీసీ పేరు వినగానే మనకు స్కూల్-కాలేజీ రోజులు గుర్తుకొస్తాయని, తాను ఎస్సీసీ విద్యార్థిని అని తెలిపారు. ఆ సమయంలో తాను పొందిన అనుభవం అమూల్యమైనదని పేర్కొన్నారు. ఎన్సీసీ అనేది యువతలో క్రమశిక్షణ, నాయకత్వం, సేవా స్ఫూర్తిని పెంపొందిస్తుందన్నారు. విపత్తుల సమయంలో సహాయం చేయడానికి ఎన్సీసీ అభ్యర్థులు ఎల్లప్పుడూ ముందు ఉంటారని, విద్యార్థులందరూ ఎన్సీసీలో చేరాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. వికసిత భారత్ ని నిర్మించేందుకు యువత పాత్ర ఎంతో కీలకమని అన్నారు. యువత అంతా ఒక్కతాటిపైకి వచ్చి, దేశ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే త్వరతగతిని అభివృద్ధి జరుగుతుందన్నారు.
మన్ కీ బాత్ అంటే దేశానికి సంబంధించిన సమిష్టి కృషి గురించి మాట్లాడటమన్నారు. ప్రజలతో నేరుగా మాట్లాడేందుకు ఈ కార్యక్రమం కోసం ఎదురు చూస్తుంటానని చెప్పుకొచ్చారు. దేశం సాధించిన విజయాలు ఇక్కడి ప్రజల శక్తితో ముడిపడివున్నాయన్నారు. వీలైనన్ని ఎక్కువ సందేశాలను అందించడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నాని అన్నారు. అలానే, ప్రజలు అందించే సూచనల కోసం ఎదురుచూస్తుంటానని చెప్పారు. వచ్చే ఏడాది స్వామి వివేకానంద 162వ జయంతి ఉత్సవాలు చాలా ప్రత్యేకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. జనవరి 11, 12 వ తేదీల్లో ఢిల్లీలోని భారత్ మండపంలో యంగ్ ఐడియాస్ మహాకుంభ్ జరగనుందని, ఈ కార్యక్రమానికి రెండు వేల మంది యువత తరలిరానున్నారని తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..కార్మికులు, కర్షకులే దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని హోంమంత్రి అనిత తెలిపారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో అనిత పర్యటించారు. కోటవురట్ల మండలం రామచంద్రపురం గ్రామానికి చేరుకున్న మంత్రికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. రామచంద్రపురం గ్రామంలో ఇంటింటికీ వెళ్లి…
- మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామంలో గ్రామకంఠం భూమిని ఆక్రమించి నిర్మించిన ఇళ్లను కోర్టు ఆదేశాల మేరకు కూల్చివేశారు. భారీ బందోబస్తుతో పోలీసు, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా ఈ…
- అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…అల్లూరి జిల్లా అరకు నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాల్లో రహదారి సమస్యలు ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అరకు, డుంబ్రిగూడ, అనంతగిరి మండలాల్లోని పలు గ్రామాలు ఇప్పటికీ కనీస రహదారి సౌకర్యం లేకుండా ఉన్నాయి. మాడగడ పంచాయతీ పరిధిలోని మెచ్చగూడ గ్రామస్తులు…
- జీటీ ఉత్కంఠభరిత విజయం – తేవాటియా శాంతమైన ముగింపు, గిల్-బట్లర్ ధాటికి ఆర్సీబీ పరాభవం..జీటీ తమ సీజన్‌ను కొనసాగించేందుకు తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని సాధించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం మంచి నిర్ణయంగా నిలిచింది, ఎందుకంటే జీటీ బౌలర్లు ఆర్సీబీ బ్యాటర్లకు తీవ్ర ఇబ్బందులు కలిగించారు. విరాట్ కోహ్లీ రబాడా బౌలింగ్‌లో వరుసగా…
- గెటప్ శ్రీను వాగ్వాదం! “తొక్కలో ఇంటర్వ్యూ” అంటూ వెళ్ళిపోయిన గెటప్ శ్రీను?ప్రముఖ నటుడు గెటప్ శ్రీను తాజాగా జర్నలిస్ట్ జాఫర్ కు ఇచ్చిన వ్యక్తిగత ఇంటర్వ్యూలో చోటుచేసుకున్న సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మహదేవపట్నంలో జరిగిన ఈ ఇంటర్వ్యూ ప్రారంభంలో సరదాగా సాగిన సంభాషణ, కొద్ది సేపటికే ఉద్రిక్తతకు దారితీసింది.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 62096