Wednesday, September 23, 2026
News Navigation
Wednesday, September 23, 2026
News Navigation

Breaking

Wednesday, September 23, 2026
Home Latest News నాకు కాలేజీ రోజులు గుర్తుకొస్తున్నాయి

నాకు కాలేజీ రోజులు గుర్తుకొస్తున్నాయి

by Rama
నాకు కాలేజీ రోజులు గుర్తుకొస్తున్నాయి

వికసిత్ భారత్ లో యువత పాత్ర కీలకమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఎన్‌సీసీ పేరు వినగానే మనకు స్కూల్-కాలేజీ రోజులు గుర్తుకొస్తాయని, తాను ఎస్‌సీసీ విద్యార్థిని అని తెలిపారు. ఆ సమయంలో తాను పొందిన అనుభవం అమూల్యమైనదని పేర్కొన్నారు. ఎన్‌సీసీ అనేది యువతలో క్రమశిక్షణ, నాయకత్వం, సేవా స్ఫూర్తిని పెంపొందిస్తుందన్నారు. విపత్తుల సమయంలో సహాయం చేయడానికి ఎన్‌సీసీ అభ్యర్థులు ఎల్లప్పుడూ ముందు ఉంటారని, విద్యార్థులందరూ ఎన్‌సీసీలో చేరాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. వికసిత భారత్ ని నిర్మించేందుకు యువత పాత్ర ఎంతో కీలకమని అన్నారు. యువత అంతా ఒక్కతాటిపైకి వచ్చి, దేశ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే త్వరతగతిని అభివృద్ధి జరుగుతుందన్నారు.

మన్ కీ బాత్ అంటే దేశానికి సంబంధించిన సమిష్టి కృషి గురించి మాట్లాడటమన్నారు. ప్రజలతో నేరుగా మాట్లాడేందుకు ఈ కార్యక్రమం కోసం ఎదురు చూస్తుంటానని చెప్పుకొచ్చారు. దేశం సాధించిన విజయాలు ఇక్కడి ప్రజల శక్తితో ముడిపడివున్నాయన్నారు. వీలైనన్ని ఎక్కువ సందేశాలను అందించడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నాని అన్నారు. అలానే, ప్రజలు అందించే సూచనల కోసం ఎదురుచూస్తుంటానని చెప్పారు. వచ్చే ఏడాది స్వామి వివేకానంద 162వ జయంతి ఉత్సవాలు చాలా ప్రత్యేకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. జనవరి 11, 12 వ తేదీల్లో ఢిల్లీలోని భారత్‌ మండపంలో యంగ్‌ ఐడియాస్‌ మహాకుంభ్‌ జరగనుందని, ఈ కార్యక్రమానికి రెండు వేల మంది యువత తరలిరానున్నారని తెలిపారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “రణబాలి” మూవీ.
    షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ “రణబాలి” సినిమా అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “రణబాలి” మూవీ విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్…
  • సెమీకాన్‌ ఇండియా-2026 ప్రారంభించిన మోదీ.
    భారత్‌ను ప్రపంచ సెమీకండక్టర్‌ తయారీ హబ్‌గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్‌ సెంటర్‌లో గురువారం ‘సెమీకాన్‌ ఇండియా-2026’ సదస్సును ప్రారంభించారు. సెప్టెంబర్‌ 17 నుంచి 19 వరకు మూడు రోజుల పాటు…
  • జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.
    నియోజకవర్గానికి ఒకటి చొప్పున యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే 72 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు పూర్తి చేశామన్నారు. అలాగే యువత కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు…
  • 96 ఏళ్ల తర్వాత జిల్లాలో రీ-సర్వే.
    96 సంవత్సరాల తర్వాత బౌండరీస్‌ చట్టం ప్రకారం జిల్లాలో రీ-సర్వే చేపడుతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా పరేడ్‌ గ్రౌండ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన భట్టి విక్రమార్క.. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.…
  • లండన్‌లో కన్నులపండువగా గంగా హారతి.
    బ్రిటన్‌ రాజధాని లండన్‌లో థేమ్స్‌ నది ఒడ్డున నిర్వహించిన గంగా హారతి కార్యక్రమానికి వేలాది మంది హాజరయ్యారు. చిన్మయ మిషన్‌ సేవలు ప్రారంభించి 75ఏళ్లు అయిన సందర్భంగా.. చిన్మయ్‌ మిషన్‌ యూకే ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. గంగా నది ఒడ్డున ప్రతిష్ఠాత్మకంగా…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: