హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరుపై కరీంనగర్ డిసిసి అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నిప్పులు చెరిగారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్రంలో ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వమని, అరాచకాలు చేస్తే సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈరోజు జరిగిన ఘటనలో అదృష్టం కొద్దీ తప్పించుకున్నావని, ఇలాంటివి పునరావృతమైతే ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు. హుజూరాబాద్‌లో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో స్పందించిన ఆయన.. ఎవరి మీద పడితే వారి మీద ఇష్టానుసారంగా మాట్లాడటం మానుకోవాలని సూచించారు.
మిస్టర్ కౌశిక్ రెడ్డి.. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ అరాచకాలు సాగవు అంటూ మేడిపల్లి సత్యం ధ్వజమెత్తారు. చర్యకు ప్రతిచర్య తప్పదని, ఈరోజు ఏదో అదృష్టం బాగుండి తప్పించుకున్నావని.. కానీ పద్ధతి మార్చుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ప్రజాప్రతినిధిగా ఉండి బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం సరికాదని, రేవంత్ రెడ్డి సర్కార్‌లో చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన స్పష్టం చేశారు.
Tag:





Total views : 75216