బిగ్ బాస్ విజేత ప్రశాంత్ తో పాటు ఇతర నిందితులను రేపు ఉదయం నాంపల్లి కోర్టులో హాజరు పర్చనున్న జూబ్లీ హిల్స్ పోలీసులు. రహస్య ప్రాంతంలో ఉంచి విచారిస్తున్న పోలీసులు. ఉదయం 10 గంటలకు వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపర్చే అవకాశం. ఘటనలో పాల్గొన్న మరో 14 మంది నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న జూబ్లీ హిల్స్ పోలీసులు. పల్లవి ప్రశాంత్ ని నిన్న రాత్రి గజ్వేల్ లో అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు, ఆరు గంటల పాటు జూబ్లీహిల్స్ పీఎస్లో విచారించిన పోలీసులు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం ప్రైవేటు ఆస్తులు ధ్వంసం కేసులో అరెస్ట్ చూపెట్టిన పోలీసులు. సెలబ్రిటీ ముసుగులో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే చూస్తూ ఊరుకోమంటున్న పోలీసులు. జడ్జి ఇంట్లో పల్లవి ప్రశాంత్ తో పాటు ఆయన సోదరుడిని ప్రవేశపెట్టిన పోలీసులు. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన న్యాయమూర్తి. పల్లవి ప్రశాంత్ తో పాటు అతని సోదరుని చంచల్గూడా జైలు కు తరలించిన పోలీసులు.
pallavi prashanth
గజ్వెల్ మండలం కొల్గూర్ గ్రామం రైతు బిడ్డ బిగ్ బాస్ లో విజయం సాధించారు. బిగ్ బాస్ సీజన్-7 విన్నర్ గా ‘రైతు బిడ్డ’ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచారు. గొడుగు సత్యనారాయణ, విజయ దంపతులకు కుమార్తె గౌతమి, కుమారుడు ప్రశాంత్, మనోహర్, వినయ్ సంతానం. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ పిల్లలను చదివించారు. ప్రశాంత్ స్వగ్రామంలో ఆరవ తరగతి వరకు, ఏటిగడ్డ కిష్టాపూర్ లో పదవ తరగతి పూర్తి చేసి గజ్వేల్ లో ప్రైవేటు కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. డిగ్రీ మధ్యలో ఆపి తండ్రికి వ్యవసాయ పనుల్లో అండగా నిలిచాడు. సోషల్ మీడియా వేదికగా , ఫేస్బుక్, టిక్ టాక్, ఇంస్టాగ్రామ్ లో జై జవాన్ జై కిసాన్ అంటూ అన్నదాతల కష్టాలు ప్రపంచానికి తెలియజేయడానికి వీడియోలు తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసేవారు. రైతు బిడ్డగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. విజేతగా నిలిచిన ప్రశాంత్ కు రూ.35 లక్షల ప్రైజ్ మనీ, మారుతి బ్రీజా కార్ మరియు జాయ్ అలుకాస్ గిఫ్ట్ ఓచర్ బహుమతులుగా లభించాయి. పట్టుదలతో చేస్తే తప్పకుండా విజయం దక్కుతుంది . గత మూడు సంవత్సరాల క్రితం బిగ్ బాస్ లో ప్రయత్నించినా ఫలితం దక్కకపోవడంతో సీజన్ 7 లో కామన్ మెన్ కోటాలో ఎంట్రీ దక్కింది. బిగ్ బాస్ 7లో 20 మంది కంటెస్ లో పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచారు.





Total views : 80356