బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణస్వీకారం చేశారు. అసెంబ్లీకి చేరుకున్న ఆయనకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు స్వాగతం పలికారు. కేసీఆర్ నేరుగా అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్ కు చేరుకున్నారు. ఆయన చేత ఎమ్మెల్యేగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రమాణస్వీకారం చేయించారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చిన సమయంలో పార్టీ ఎమ్మెల్యేలంతా అక్కడే ఉన్నారు. అయితే, ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యేలలో ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్ మాత్రం అక్కడ కనిపించకపోవడం గమనార్హం. తుంటి ఎముక ఆపరేషన్ తర్వాత కేసీఆర్ చాలా వరకు కోలుకున్నట్టుగా కనిపిస్తోంది. హ్యాండ్ స్టిక్ ఆధారంగా, ఎవరి సహాయం లేకుండానే కేసీఆర్ నడిచారు. ముఖ్యమంత్రిగా గత పదేళ్ల కాలంలో అసెంబ్లీ గేట్ నెంబర్ 1 ద్వారా రాకపోకలు సాగించిన కేసీఆర్ ఈరోజు గేట్ నెంబర్ 2 ద్వారా అసెంబ్లీకి రావడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి విపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.
Tag:
Prakash Goud
రాజేంద్రనగర్ భారాస ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు. ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో కలిసి జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వచ్చిన ఆయన రేవంత్‌రెడ్డికి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ప్రకాశ్‌గౌడ్ మీడియాతో మాట్లాడుతూ సీఎంను కలవడంలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదన్నారు. కాంగ్రెస్‌లో చేరినట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తెలిపారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో భూసమస్యలు పరిష్కరించాలని, నిధులు మంజూరు చేయాలని సీఎంను కోరినట్టు చెప్పారు. తన విజ్ఞప్తిపై సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు.





Total views : 78560