కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదయింది. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశంలో ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుపై జడ్పీ సీఈఓ శ్రీనివాస్ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీఆర్ ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై క్రిమినల్ కేసు నమోదు. డీఈఓపై చర్యలు తీసుకోవాలంటూ కౌశిక్ రెడ్డి డిమాండ్ చేస్తూ ఆందోళణకు దిగారు. సమావేశానికి హాజరైన కలెక్టర్ పమేల సత్పతి సమావేశం నుండి వెల్తున్న క్రమంలో అడ్డుకుని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పోడియం ముందు బైఠాయించారు. దీంతో జడ్పీ సమవేశం రసాభసాగా కొనసాగింది. ప్రజాప్రతినిధుల మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో సమావేశంలో గందరగోళం నెలకొంది. అయితే సమావేశం ముగిసిన తరువాత జడ్పీ సీఈఓ శ్రీనివాస్ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వన్ టౌన్ పోలీసులు ప్రభుత్వ అధికార యంత్రాంగం విధులకు ఆటంకం కల్గించిన సెక్షన్లలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. బారత్ న్యాయ్ సంహిత యాక్ట్ సెక్షన్ 221, 126 (2)లో ఈ కేసు నమోదు చేశారు. భారత దేశంలో బీఎన్ఎస్ యాక్టు అమల్లోకి వచ్చిన రెండో రోజు చట్టసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రతినిధిపై క్రిమినల్ కేసు నమోదు అయింది. దేశంలోనే కొత్త చట్టాల మేరకు కేసు నమోదు అయిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి రికార్డుల్లోకి ఎక్కారు…
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ గాయంతో బాధపడుతున్న ఆయన..భుజాలకు సంబంధించిన చికిత్స చేయించుకోనున్నారు. రెండు భుజాల కండరాలు దెబ్బతినడంతో ఇబ్బంది పడుతున్న పవన్ కల్యాణ్..ముంబై హాస్పిటల్లో ఇప్పటికే వైద్య పరీక్షలు…
- హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.అమెరికాలో హెచ్-1బీ, పర్మ్ వర్క్ వీసాల జారీలో జరుగుతున్న అక్రమాలపై ట్రంప్ ప్రభుత్వం భారీ దర్యాప్తు చేపట్టింది. అమెరికా కార్మిక శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి’ఎస్పోసిటో వెల్లడించిన వివరాల ప్రకారం.. వీసా మోసాలపై ఇప్పటికే డజన్ల కొద్దీ సమ్మన్లు, సబ్‌పోనాలు…
- అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతోంది. ఇప్పటికే కేంద్ర కార్యాలయాలు, బ్యాంకులు, హోటల్స్, విద్యా సంస్థలతో రూపుదిద్దుకుంటున్న రాజధాని ప్రాంతానికి ఇప్పుడు హైటెక్ స్కై కనెక్టివిటీ కూడా అందుబాటులోకి రానుంది. ఉండవల్లి సమీపంలో ఆధునిక సదుపాయాలతో హెలిపోర్ట్…
- భారత్-ఆస్ట్రేలియా సీఈఓలతో ప్రధాని మోదీ కీలక భేటీ.భారత్-ఆస్ట్రేలియా మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ అల్బనీస్‌తో కలిసి ఇరు దేశాల ప్రముఖ సీఈఓలు, వ్యాపార దిగ్గజాలతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల…
- చెన్నై ఎగ్మూర్‌లోని ఆస్పత్రుల్లో సీఎం విజయ్ ఆకస్మిక తనిఖీలు.తమిళనాడు సీఎం విజయ్ పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు. అవినీతి లేని పాలన అందిస్తానని చెబుతున్న విజయ్..ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఆధారాలతో సహా అవినీతి అధికారుల సమాచారం అందిస్తే వారిపై చర్యలు తీసుకుంటానని ప్రకటించిన ముఖ్యమంత్రి..తాజాగా ప్రభుత్వాస్పత్రుల్లో ఆకస్మిక…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 194776